Wednesday, June 9, 2021

JEALOUS MEN GRANDMA STORIES TELUGU STORIES

Grandmas Stories presents you telugu stories

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, JEALOUS MEN GRANDMA STORIES TELUGU STORIES

దొందూ దొందే

సీతారామపురంలో అచ్చయ్య, బుచ్చయ్య అనే ఇద్దరు ఉండేవారు. వాళ్లిద్దరూ ఏ పని చేయాలన్నా గొడవ పడేవాళ్ళు. వీళ్ళని చూసి అందరూ నవ్వుకునేవారు.
ఒకరోజున అచ్చయ్యకు, బుచ్చయ్యకు, తపస్సు చేసి శివుడిని మెప్పించి సకల సంపదలు పొందాలని అనిపించింది. ఇద్దరు వాళ్ళ అలవాటు ప్రకారం అడవికి వెళ్లి పోటాపోటీగా తపస్సు చేయటం మొదలుపెట్టారు.
కొంత కాలం తరువాత శివుడు అచ్చయ్య వద్ద ప్రత్యక్షమై అయ్యాడు.

శివుడు,"అచ్చయ్య నీకు ఏమి వరం కావాలో కోరుకో నాయనా !!" అన్నాడు.

దీనికి అచ్చయ్య ఏమని ఆలోచించాడంటే తానేదన్నా వరం కోరులుకుంటే బుచ్చయ్య దాని కంటే ఎక్కువది కోరుకోవచ్చు అని అనుకుని శివుడితో అచ్చయ్య "స్వామి బుచ్చయ్యకు ఇచ్చిన వరానికి రెట్టింపు వరం నాకివ్వండి" అని అన్నాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, JEALOUS MEN GRANDMA STORIES TELUGU STORIES

శివుడు బుచ్చయ్యని వరం కోరుకోమని అడిగాడు, దానికి బుచ్చయ్య అచ్చయ్యకు ఏమి వరం ఇచ్చారని అడిగాడు.
శివుడు నీకిచ్చినదాని కంటే రెట్టింపు ఇమ్మని అడిగాడు అని చెప్పాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, JEALOUS MEN GRANDMA STORIES TELUGU STORIES
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, JEALOUS MEN GRANDMA STORIES TELUGU STORIES

దీనికి బుచ్చయ్య ఒక నిమిషం ఆలోచించుకుని శివునితో స్వామి నాకు ఒక కంటికి చూపుని పోగొట్టండి అని అడిగాడు.
తథాస్తు!! అని శివుడు మాయమయ్యాడు.
బుచ్చయ్యకు ఒక కంటి చూపు పోయింది.

ఆఛయ్యకు రెండూ పోయాయి.

ఈ కథనుంచి మనం తెలుసుకోవలసిన అంశం ఏమిటంటే ఈర్ష్యతో కూడిన పోటీలు పనికిరావు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, JEALOUS MEN GRANDMA STORIES TELUGU STORIES

అందుకే అన్నారు పెద్దలు, "దొందూ దొందే" అని.

అంటే పై కథలో అచ్చయ్య బుచ్చయ్య ఇద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు పోటీ పెట్టుకుని ఈర్ష్య అసూయలతో వారి జీవితాలని నిరర్థకం చేసుకున్నారు. ఎవరైనా మరొకరితో పోటీ పెట్టుకుని వారి మీద ఈర్ష్య అసూయలతో వారి లాగే ఉండాలని ప్రయత్నిస్తూ ఇద్దరూ నష్టపోతే ఆ సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Asatyam Adaradu Telugu Stories Grandma Stories

Asatyam Adaradu Telugu Stories Grandma Stories

Grandmas Stories presents you telugu stories

అసత్యం ఆడరాదు

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Asatyam Adaradu Telugu Stories Grandma Stories

భువనగిరిలో ప్రకాశం, వనజ అనే దంపతులు ఉండేవారు. వారికి వికాస్, లత అనే ఇద్దరు పిల్లలు. వికాస్ పెద్దవాడు, చురుకైనవాడు, చదువులో, ఆటల్లో అన్నింట్లో ముందుండేవాడు. లత చిన్నది ఈమె కూడా బాగా తెలివైనది.
ప్రకాశం అదే ఊరిలోని మిల్లులో పనిచేసేవాడు. అతనికి చెప్పింది వినే భార్య, ఆనీ ముత్యాల్లాంటి పిల్లలు అని అందరు అనేవారు.
ఒక రోజు ప్రకాశం ఇంటికి వస్తూ దారిలో సీతా ఫలాలు కనిపిస్తే కొని ఇంటికి తీసుకువెళ్లాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Asatyam Adaradu Telugu Stories Grandma Stories

పెద్దవాడు ప్రకాశం సీతా ఫలాలు ఇంతకు ముందు తిన్నాడు. కానీ చిన్నది లత సీతా ఫలాలు ఎప్పుడూ తినలేదు. అవి తెచ్చినప్పటి నుంచీ అవి ఎప్పుడు తిందామా అని ఎదురుచూడసాగింది.
వాళ్ల అమ్మ వనజ సీతా ఫలాలు సాయంత్రం పెడతానని చెప్పింది. లత ఎంత సేపైనా సాయంత్రం అవకపోయేసరికి ఒక పండు ఎవరూ చూడకుండా పక్కకి తీసుకువెళ్లి తినేసింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Asatyam Adaradu Telugu Stories Grandma Stories
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Asatyam Adaradu Telugu Stories Grandma Stories

ఏమీ ఎరగనిదానిలా సాయంత్రం వచ్చి వాళ్ళమ్మని సీతా ఫలాలు పెట్టమన్నది.
సరే పొద్దున్నుంచి ఎదురుచూసింది ఇక ఆగలేదని అందరినీ పిలిచి సీతా ఫలాలు పెడదామని చుస్తే అక్కడ ఒక పండు తగ్గి ఉన్నది.
వనజ పిల్లలిద్దరినీ అడిగింది , "ఒక పండు ఎవరు తిన్నారు?" అని.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Asatyam Adaradu Telugu Stories Grandma Stories

వికాస్, లత ఇద్దరూ తినలేదని చెప్పారు.

అప్పుడు ప్రకాశం "సీతా ఫలాలో రాళ్లు ఉంటాయి, ఆ రాళ్లు లోపల ఉండకూడదు, అవి వెంటనే బయటికి తీయాలి అందుకని అడుగుతున్నాను, ." అని అన్నాడు.

ఇది విన్న లత గబుక్కున "నేను ఆ రాళ్లు తీసేసి సీతాఫలం తిన్నాను." అని అన్నది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Asatyam Adaradu Telugu Stories Grandma Stories

అందరూ ఫక్కున నవ్వారు. అప్పుడు వనజ లతని దగ్గరికి తీసుకుని "నువ్వు సీతాఫలం తిన్న విషయం నీతో చెప్పించటానికి మీ నాన్న ఆలా అన్నారు. ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. " అని చెప్పింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Asatyam Adaradu Telugu Stories Grandma Stories

అందుకే అన్నారు పెద్దలు అసత్యం ఆడరాదని.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Penuki Pettanam Iste Telugu Stories Grandma Stories

Penuki Pettanam Iste Telugu Stories Grandma Stories

Grandmas Stories presents you telugu stories

పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగింది

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Penuki Pettanam Iste Telugu stories grandma stories

సింహపురి రాజ్యంలో విక్రముడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని పాలనలో ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారు. ఒక రోజున విక్రముడు తన అంగ రక్షకుడితో కలిసి వేట గురించి అడవికి వెళ్ళాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Penuki Pettanam Iste Telugu stories grandma stories

ఆ అడవిలో కొంత సమయం వేటాడిన తరువాత రాజు విక్రముడికీ, అతని అంగరక్షకులకూ రెండు సింహాలు ఎదురుపడ్డాయి. విక్రముడి అంగరక్షకులు సింహాలని చూడగానే విక్రముడిని అక్కడే వదిలివేసి పారిపోయారు.

tories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Penuki Pettanam Iste Telugu stories grandma stories

అక్కడే ఒక చెట్టు మీద ఉన్న ఒక కోతి ఆ సమయంలో పెద్దగా "కిచ, కిచ" అంటూ శబ్దం చేసింది. ఆ శబ్దం ఏమిటో అనుకుని సింహాలు పారిపోయాయి. ఇది గమనించిన విక్రముడు కోతి సింహాలని భయపెట్టింది అని అనుకున్నాడు. విక్రముడు ఆ కోతిని తన అంతఃపురానికి తీసుకువచ్చాడు. ఆ కోతికి బాగా తిండి పెడుతూ కత్తి యుద్ధం నేర్పాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Penuki Pettanam Iste Telugu stories grandma stories

ఒక రోజున నిండు సభలో విక్రముడు "ఈ రోజు నుండీ నాకు అంగరక్షకుల అవసరం లేదు, ఈ కోతే నాకు అంగరక్షకుడు" అని చెప్పాడు.

ఈ నిర్ణయాన్ని మార్చుకొనమని మంత్రులు విక్రముడికి సూచించారు. విక్రముడు వాళ్ళ మాట వినలేదు. అప్పుడు విక్రముడు కోతి వైపు తిరిగి "నా మీద ఈగకుడా వాలకుండా చూసుకోవలసిన బాధ్యత నీదే" అన్నాడు. దానికి కోతి సంతోషంగా తల ఊపింది. అప్పటినుండీ కోతి విక్రముడితోపాటు కత్తి పట్టుకుని తిరగసాగింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Penuki Pettanam Iste Telugu stories grandma stories

ఒక రోజు సాయంకాలం విక్రముడు తోటలో పడుకుని నిద్రపోతున్నాడు. కోతి కత్తి పట్టుకుని విక్రముడికి పహారా కాస్తున్నాడు. ఇంతలో విక్రముడు కంఠం మీద ఒక ఈగ వాలింది. విక్రముడు తన మీద ఈగ కూడా వాలకుండా చూసుకోమన్నారు కాబట్టి ఆ ఈగని చంపేయాలని, కోతి రాజు కంఠం మీద కత్తితో కొట్టింది. ఇంకేముంది రాజు విక్రముడు తల తెగిపోయి చనిపోయాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Penuki Pettanam Iste Telugu stories grandma stories

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Penuki Pettanam Iste Telugu stories grandma stories

అందుకే అన్నారు పెద్దలు "పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగింది" అని 

దీనివలన మనం తెలుసుకోవలసినది ఏమిటంటే మనం ఎప్పుడైనా సందర్భానుసారంగా, విచక్షణతో వ్యవహరించాలి. పై కథలో చెప్పినట్టు కోతి ని అంగరక్షుడిగా చేసి ఆ కోతికి పెత్తనం ఇచ్చిన రాజు చివరికి ఆ కోతి తెలివితక్కువతనం వల్ల చనిపోయాడు.  అందువల్ల వివేకాన్ని,విచక్షణనీ ఎప్పుడూ విడువకూడదు.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Arhatani Batti Andalam Telugu Stories For Kids

Arhatani Batti Andalam Telugu Stories For Kids

Grandmas Stories presents you telugu stories

గాడిద గాడిదే, గుర్రం గుర్రమే

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Arhatani Batti Andalam Telugu Stories For Kids

ఆదిత్యుడనే రాజు వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి. అతని రాజ్యమంతా సుఖ శాంతులతో ఆయురారోగ్యములతో, విద్యా, పాండిత్యాలతో, అన్ని రకాలుగా సుభిక్షంగా ఉన్నది.

ఒక రోజున రాత్రి సమయంలో అంతఃపురంలో ఒక దొంగ ప్రవేశించి కొన్ని బంగారు వస్తువులు తీసుకుని పారిపోతుండగా రాజు ఆదిత్యుడు అతన్ని పట్టుకుంటానికి ప్రయత్నించాడు. దొంగ జుట్టు ఆదిత్యుడి చేతికి చిక్కింది. దొంగ ఆదిత్యుడి చేతిలో ఉన్న జుట్టు కోసేసుకుని పారిపోయాడు. 

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Arhatani Batti Andalam Telugu Stories For Kids

వెంటనే రాజు మంత్రులందరినీ పిలిపించి జరిగినదంతా వారికి చెప్పాడు. ఆదిత్యుడు మంత్రులకి ఈ జుట్టుని బట్టీ ఆ దొంగని పట్టుకోవాలని సూచించాడు. 

ఆదిత్యుడి ఆలోచనకు జవాబు ఏమీ చెప్పలేక మంత్రులు నిశ్శబ్దంగా ఉండిపోయారు. 
అప్పుడే అక్కడికి వచ్చి అది విన్న రాజు క్షురకుడు ఇదెంత భాగ్యం ప్రభూ సాయంకాలానికల్లా దొంగని పట్టేస్తాను అని ఆదిత్యునితో చెప్పి ఆ జుట్టు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. 

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Arhatani Batti Andalam Telugu Stories For Kids

క్షురకుడు సాయంకాలానికల్లా నిజంగా దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుని ఆదిత్యుడి దగ్గరకు వచ్చాడు. నిజంగా అతని చేతుల్లోంచి తప్పించుకుపోయిన దొంగ అతనే. ఆదిత్యుడు ఆ దొంగని చూసి చాలా ఆశ్చర్యపోయాడు.  
ఆదిత్యుడు క్షురకునితో ఇతన్ని పట్టుకోవటం ఎలా సాధ్యమయ్యిందని అడిగాడు.

అప్పుడు క్షురకుడు ప్రభూ, ఒకరి జుట్టులాగా ఇంకొకరి జుట్టు ఉండదు. అందుకని ఈ దొంగని పట్టుకోవటంలో పెద్ద సమయం పట్టలేదు అని అన్నాడు. 

ఆదిత్యుడు క్షురకుని తెలివితేటలకు ఎంతో ఆశ్చర్యం చెంది ఈ రోజు నుంచీ నువ్వే నా ప్రధాన మంత్రివి అని అన్నాడు. 

Arhatani Batti Andalam Telugu Stories For Kids

ఆ విధంగా కొంత కాలం గడిచింది, శత్రు సైన్యాలు తన రాజ్యం మీదకి దండెత్తుతున్నాయని వేగుల ద్వారా ఆదిత్యునికి తెలిసింది. 

వెంటనే ఆదిత్యుడు క్షురకుణ్ణి పిలిపించి మన రాజ్యం మీదకి శత్రు సైన్యాలు దండెత్తుతున్నాయి వాళ్ళని మనం ఎలా ఎదురుకోవాలి అని అడిగాడు. 

వంటనే క్షురకుడు ఇప్పుడే వస్తాను ప్రభూ అని చెప్పి బయటికి వెళ్లి కొంత సమయం తరువాత రెండు పెట్టెలతో రాజు సమక్షానికి  తిరిగి వచ్చాడు.

Arhatani Batti Andalam Telugu Stories For Kids

వెంటనే ఆదిత్యుడు ఇప్పుడు ఏమి చేద్దామని మళ్ళీ అడిగాడు. దానికి క్షురకుడు ఈ పరిపాలన యుద్ధాలు మనకెందుకు ప్రభూ ఇది మా నాన్నగారి మంగళి పొది, మరొకటి నా మంగళి పొది (అంటే క్షవరం చేసే పని మెట్లు అన్నమాట దాన్ని మంగళి పొది అనేవారు). మనిద్దరమూ ఇక్కడినుంచి తప్పించుకు పారిపోయి మనం ఎక్కడికైనా చేరుకొని క్షురక వృత్తి చేసుకుంటూ హాయిగా జీవిద్దాం ప్రభూ అని చెప్పాడు. 

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

అప్పుడు ఆదిత్యునికి తాను చేసినది ఎంత తెలివి తక్కువ పనో అర్థం అయ్యింది. 

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Arhatani Batti Andalam Telugu Stories For Kids
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Arhatani Batti Andalam Telugu Stories For Kids

వెంటనే ఆదిత్యుడు పాత మంత్రులని పిలిచి తనని మన్నించమని కోరి మంత్రుల సలహాతో శత్రువుని తరిమి కొట్టి తన రాజ్యంలో తిరిగి శాంతిని స్థాపించాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Arhatani Batti Andalam Telugu Stories For Kids

అందుకే అన్నారు పెద్దలు "గాడిద గాడిదే, గుర్రం గుర్రమే" అని. 

అంటే గాడిద బరువు ఎక్కువ మొయ్యగలదు కదా అని దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు గాడిద మీద వెళ్ళము కదా!! గుర్రం వేగం గాడిదకు వస్తుందా!! అర్హతని బట్టి అందలం ఎక్కించాలని దాని అర్థం.  

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Confidence Is the Key Telugu Stories

Confidence Is the Key Telugu Stories

Grandmas Stories presents you telugu stories

ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories 
Confidence Is the Key Telugu Stories

ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మూఢ నమ్మకస్తుడు. అతను పక్క ఊరిలో ఉన్న వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్లి వాళ్ళని పలకరరించి, అక్కడ పని చూసుకుని తన గ్రామం తిరిగి వస్తుండగా ఆ ఊరిలోని షావుకారు ఆ బ్రాహ్మణుడికి ఒక మంచి బలమైన మేకని ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి ఆ మేకను తీసుకుని భుజాలపై పెట్టుకుని తిరిగి తన ఉరికి వస్తున్నాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Confidence Is the Key Telugu Stories

ఆలా వస్తున్న ఆ బ్రాహ్మణుడిని ముగ్గురు మోసగాళ్లు చూశారు. ఆ బలిసిన మేకను చూసి వాళ్లకు దానిని ఆ బ్రాహ్మణుడి దగ్గరనుండి దానిని ఎలాగైనా తీసుకుని చక్కగా వండుకు తిందామనుకున్నారు. అప్పుడు ఆ ముగ్గురూ కలిసి ఒక పన్నాగం పన్నారు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Confidence Is the Key Telugu Stories

అది ఏమిటంటే ఆ ముగ్గురూ విడిపోయి మూడుచోట్ల ఆ బ్రాహ్మణుడితో మాట్లాడి మోసం మాటలు చెప్పి అతన్ని మోసగించి ఆ మేకను కాజేయాలనుకున్నారు.

ముందుగా ఒక మోసగాడు కొంతదూరం బ్రాహ్మణుడిని వెంబడించి కొంత దూరం వెళ్లిన తరువాత ఆ బ్రాహ్మణుడిని పలకరిస్తూ "అదేంటి ఏ మేకనో గోరెనో అయితే సరే గానీ, ఒక కుక్కని మోసుకుని వెళ్తున్నారు? మీరు సరిగ్గా చేసుకోలేదా, ఏమిటి?" అని అడిగాడు.

అప్పుడు ఆ బ్రాహ్మణుడు అది కుక్క కాదు మేక, నీవు సరిగ్గా చూడు నీకే తెలియటం లేదు అని అంటూ అక్కడినుండి ముందుకు వెళ్ళిపోయాడు.

ఇంకొంత దూరం వెళ్లిన తరువాత రెండో మోసగాడు దారిలో బ్రాహ్మణుడిని పలకరిస్తూ "ఏమిటీ గాడిద పిల్లని భుజాన పెట్టుకుని మరీ మోసుకువెళుతున్నారు? ఇంకేమి దొరకలేదా ఏమిటి?" అని అడిగాడు.

మేకను పట్టుకుని గాడిద పిల్ల అని అంటావు ఏమిటి? అని కోప్పడి ఆ బ్రాహ్మణుడు తన గ్రామం వెళ్ళసాగాడు.
మరికొంత దూరం వెళ్లిన తరువాత మూడో మోసగాడు బ్రాహ్మణుడితో ఇదేమిటి చచ్చిపోయిన గేదెను తీసుకు వెళ్తున్నారు? అని అడిగాడు. దానితో ఆ బ్రాహ్మణుడిలో అనుమానం మొదలయ్యింది. ఒకరు కాదు ముగ్గురు ఇది మేక కాదు అంటూ చెప్పారు. ఇది నిజంగానే మేక కాదేమో అని సందేహపడి ఆ మేకను ఇక్కడే వదిలేస్తాను అని అనుకుని ఆ మేకను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. 

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Confidence Is the Key Telugu Stories

దానిని ఆ బ్రాహ్మణుడు వదిలేసిన వెంటనే వాళ్ళ పథకం పారిందని ఆ ముగ్గురు మోసగాళ్లు ఆనందంగా ఆ మేకను తీసుకెళ్ళి దాన్ని చక్కగా వండుకు తిన్నారు.

అందుకే అన్నారు పెద్దలు "ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు." అని

ఆ బ్రాహ్మణుడు ఆ ముగ్గురు మోసగాళ్ల మాటలకి తన కళ్ళని నమ్మకుండా తన ఆత్మవిశ్వాసాన్ని వదిలి ఆ మేకని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. అంటే ఎప్పుడూ మన ఆత్మవిశ్వాసాన్ని వదలకూడదు అని అర్థం.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Tuesday, June 8, 2021

Telugu stories From grandmaz Stories

Telugu stories From grandmaz Stories

Grandmas Stories presents you telugu stories

అపాయంలో ఉపాయం

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

అనగనగా ఒక కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి ఉండేది. ఆ అడవిలో అనేక జంతువులు కలిసి మెలిసి ఉండేవి. ఆ అడవికి రాజైన సింహం చెడ్డది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

దానికి నచ్చినట్టు అడవిలో ఉన్న జంతువుల్ని చంపి తిన్నంత తిని మిగిలింది వదిలేసేది.

ఇలా కొన్ని రోజుల జరిగిన తరువాత ఆ అడవిలో జంతువులు తగ్గిపోవటం మొదలైంది.
దాంతో మిగిలిన జంతువుల్లో భయం మొదలైంది. అవి కూడా ఆ సింహపు అన్యాయమైన వేటకి బలుతాయేమోనని భయపడసాగాయి.

అవన్నీ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమావేశంలో జంతువులన్నీ ఒక నిర్ణయం తీసుకున్నాయి "అందరం ఒకేసారి చనిపోయేకంటే రోజుకి ఒక్కొక్కరిగా సింహానికి ఆహారంగా వెళ్ళటానికి" నిర్ణయించుకున్నాయి.
ఆ మాటే సింహం దగ్గరికి వెళ్లి చెప్పాయి. " సరే మీ ఇష్టం" అని సింహం చెప్పింది.

అప్పటినుంచి రోజుకి ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్తున్నాయి. అలా కొన్ని రోజులు గడిచాయి అప్పుడు ఒక కుందేలు వంతు వచ్చింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

దానితో కుందేలు విచారంగా సింహం గుహ దగ్గరికి వెళ్తూ ఉంది. ఆ దారిలో కుందేలుకి ఒక పాడుపడిన బావి కనిపించింది.
అది ఏమిటా అని కుందేలు తొంగి చూసింది. ఆ నీళ్లలో దాని ప్రతిబింబం కనిపించింది.
అప్పుడు దానికి చటుక్కున ఒక ఆలోచన వచ్చింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories
సరే అని సింహం దగ్గరికి వెళ్ళింది.

అప్పుడు కుందేలు సింహంతో "రాజా దారిలో వస్తుండగా నాకు నీలాగే ఇంకో సింహం కనిపించింది. అది నన్ను తినేయబోతే, నీ ఆహారం అని తప్పించుకు వచ్చాను" అని చెప్పగానే సింహానికి చాలా కోపం వచ్చింది.

వెంటనే సింహం "అదెక్కడ ఉంది నాకు చూపించు దాన్ని ఇప్పుడే చంపేస్తాను." అని లోపంతో అరిచింది.

పథకం పారటంతో కుందేలు సింహాన్ని ఆ పాడుబడిన బావి దగ్గరికి తీసుకెళ్లింది.
అప్పుడు కుందేలు "ఆ సింహం ఈ బావిలోనే ఉంది. బాబోయ్!! అమ్మోయ్!! నేను దాని దగ్గరికి వెళ్ళను ," అని తెలివిగా దూరంగా ఉండిపోయింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

అసలే కోపం మీద ఉన్న సింహం ఇంక ఏమి ఆలోచించకుండా ఆ బావి దగ్గరికి వెళ్లి అందులోకి తొంగి చూసింది. బావిలో దాని ప్రతిబింబం దానికే కనిపించింది.
ఇదే కుందేలు చెప్పిన మరొక సింహం అనుకుని దానిని భయపెడదామని గట్టిగా అరిచింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

దాని అరుపు దానికే వినిపించి ఆ బావిలోని రెండవ సింహం దీని మీదకి అరిచింది అని అనుకుంది.

వెంటనే ఇంక ఆలస్యం చేయకుండా, ఏమి ఆలోచించకుండా సింహం లోపలున్న మరొక సింహాన్ని చంపటానికి బావిలోకి దూకింది. బావిలోకి దూకిన సింహం చచ్చింది.

ఇంకేముంది తన పథకం చక్కగా పారిందని, సింహం పీడా విరగదయ్యిందని కుందేలు సంతోషంగా వెళ్లి మిగిలిన జంతువులకి చెప్పగానే అవి కూడా ఆనందించి "అపాయంలో ఉపాయం"ఉపయోగించి కుందేలు ఆ అడవిలోని జంతువులనన్నిటినీ కాపాడిందని ఎంతో అభినందించాయి.
అందుకే అన్నారు పెద్దలు " అపాయంలో ఉపాయం" అని.

అంటే ఎవరైనా ఏదైనా అపాయంలో ఉన్నప్పుడు ఏదైనా చక్కటి ఉపాయంతో ఆ అపాయం నుంచి తప్పించుకున్నప్పుడు ఈ సామెతని ఉపయోగిస్తారు.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Monday, June 7, 2021

An Interesting Story of Sri Krishnadevaraya From Telugu stories

An Interesting Story of Sri Krishnadevaraya From Telugu stories

Grandmas Stories presents you telugu stories

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

శ్రీకృష్ణదేవరాయలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విజయనగర సామ్రాజ్యాన్ని పాలించినటువంటివాళ్లలో ముఖ్యమైన రాజు. భారతావనిలో దరిదాపులా దక్షిణాపథాన్నంతా తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు.

 సాహిత్యం, కవిత్వం, మొదలైన విషయాలలో కూడా శ్రీకృష్ణదేవరాయలు నిజమైన దిట్ట. తాను స్వయంగా "ఆముక్తమాల్యద" రచించాడు.

ఇప్పుడు ఒక రోజు జరిగిన సాహిత్య కార్యక్రమంలోని విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక రోజున శ్రీకృష్ణదేవరాయలు అష్ట దిగ్గజాలతో కూడి ఉన్నటువంటి నిండు సభలో ఈ విధంగా ఒక తర్క సమస్యని సభా సదుల ముందు ఉంచాడు.

"రామునికి ముగ్గురు తమ్ముళ్లు, ధర్మరాజుకి నలుగురు తమ్ముళ్లు, రాముడి తమ్ముళ్లు గొప్పవారా, లేక ధర్మరాజు తమ్ముళ్లు గొప్పవారా?" దీనికి సమాధానం చెప్పమన్నాడు.

దీనికి కొంతమంది రాముడి తమ్ముళ్లు గొప్పవారన్నారు. శ్రీకృష్ణదేవరాయలు కారణమేమిటని అడిగితే చెప్పలేకపోయారు. మరికొంతమంది ధర్మరాజు తమ్ముళ్లు గొప్పవారని చెప్పారు. వీళ్ళు కారణం చెప్పలేకపోయారు.
అప్పుడు అందరూ, ప్రభూ మీరే దీనికి సమాధానం చెప్పండన్నారు.

అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు సమాధానం ఇస్తూ రాముడికంటే రాముడి తమ్ముళ్లు ముగ్గురూ శక్తి తక్కువవాళ్ళు, అందుకని వాళ్ళు రాముడికి అనుకూలంగా ఉండటంలో విశేషం ఏమిలేదు. కానీ ధర్మరాజు తమ్ముళ్లు నలుగురూ జగదేకవీరులు, నాలుగు పక్కలా సమస్త సామ్రాజ్యాలనీ జయించారు, నలుగురు తమ్ముళ్లు ధర్మరాజు కంటే మహావీరులైనప్పటికీ ధర్మరాజు మాటకి లోబడి ఉన్నారు.

అందుకని రాముడి తమ్ముళ్ల కంటే ధర్మరాజు తమ్ముళ్లు గొప్పవారు. ఇంతలో సభలోంచి ఒక వ్యక్తి ప్రభూ ఈ జన్మలోకూడా మీరు పాండవ పక్షపాతులే అని అన్నాడు.
శ్రీకృష్ణదేవరాయలు అతని మాటలకు ఎంతో సంతోషపడి అక్షర లక్షలు ధనం ఇచ్చి సత్కరించాడు. ఇంతకీ సభలోని వ్యక్తి చెప్పిన దాని అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడే మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలుగా పుట్టాడని ఆ వ్యక్తి మాటలకి అర్థం.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Recent posts

The Big Fat Cat And The Mice: A Great Idea

The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...

Popular posts