TRUE FRIENDSHIP TELUGU STORIES GRANDMA STORIES
Grandmas Stories presents you telugu stories
నిజమైన స్నేహం ఎప్పటికీ నిలుస్తుంది
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, TRUE FRIENDSHIP TELUGU STORIES GRANDMA STORIES
అనగనగా ఒక అడవిలో ఒక నక్క, కొంగ స్నేహితులుగా ఉండేవి. ఒక రోజు నక్క కొంగని విందుకు తన ఇంటికి రమ్మని పిలిచింది.
ఆ నక్క తన స్నేహితుడైన కొంగతో తాను ఎటువంటి రకాల వంటలు చేసి పెడుతుందో గొప్పలుగా చెప్పింది. ఆ నక్క తనకు ఎంతో ఇష్టమైన చేపల కూర చేసి పెడుతుంది అని చెప్పింది.
ఇంక కొంగ సంతోషానికి అంతే లేదు. ఆనందంగా నక్క విందు కోసం ఎదురుచూసింది. ఆ రోజు రానే వచ్చింది, కొంగ ఉత్సాహంగా తనకి ఎంతో ఇష్టమైన చేపల కూర తినటానికి నక్క ఇంటికి వెళ్ళింది.
నక్క తాను చెప్పిన అన్ని వంటలూ సమయానికి చేసి కొంగ వచ్చిందే దానికి వడ్డించసాగింది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, TRUE FRIENDSHIP TELUGU STORIES GRANDMA STORIES
ఒక్కొక్కటీ వడ్డించసాగింది. చివర్తికి కొంగకి ఏంతో ఇష్టమైన చేపల కూర కూడా వడ్డించింది. అన్నీ వడ్డించిన తరువాత నక్క కొంగుతో "ఓ మిత్రమా ఇదిగో నీకు నా విందు చక్కగా తిను అని చెప్పి" తాను కూడా తినటం మొదలు పెట్టింది.
కొంగ ఆనందంగా తినటానికి తన పొడుగైన ముక్కుని నక్క వడ్డించిన పాత్రలలో పెట్టబోయింది కానీ కొంగ పొడుగాటి ముక్కుకి తినటానికి కుదరకుండా ఉన్నాయి. ఆ పాత్రలు వెడల్పుగా ఉండటంతో కొంగ తినలేకపోయింది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, TRUE FRIENDSHIP TELUGU STORIES GRANDMA STORIES
ఆలా నక్క తన ఆహారం మొత్తం తినేసింది. తిన్న తరువాత కొంగుని మిత్రమా ఎలా ఉంది నా వంట చేపల కూర నీకు నచ్చిందా అని అడిగింది.
దానికి కొంగ ఏమీ అనలేక అన్నీ బాగానే ఉన్నాయి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి కొంగ నక్కని తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది.
కొంగ కూడా నక్కకి ఎంతో ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతానని చెప్పింది. ఆ రోజు రానే వచ్చింది.
కొంగ ఇంటికి విందుకు వెళ్ళింది నక్క. ఇంక కొంగ వెంటనే ఆలస్యం చేయకుండా అన్నీ వడ్డించింది. అన్నీ వడ్డించిన తరువాత కొంగ నక్కతో " మిత్రమా ఇదిగో నీకు ఇష్టమైన కుందేలు మాంసం ఇంకా నాకు ఇష్టమైన చేపల కూర అన్నీ వడ్డించాను, ఇంక తిందాము" అని అన్నది.
సరే అని నక్క అనందంగా కొంగ వడ్డించిన వంటలు తిందామని తన మూతిని ఆ పాత్రలలో పెట్టటానికి చూసింది. కానీ ఆ పాత్రలు కొంగ పొడుగాటి ముక్కుకి సరిపోయేలా ఉన్నాయి నక్క ఎంత ప్రయత్నించినా తన మూతి అందులో పెట్టటానికి కుదరలేదు.
దానితో అది ఎంతో సేపు ప్రయత్నిస్తూనే ఉన్నది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, TRUE FRIENDSHIP TELUGU STORIES GRANDMA STORIES
ఇంతలో కొంగ తాను తినటం పూర్తి చేసి నక్కతో "మిత్రమా ఎలా ఉన్నాయి వంటలు అన్నీ రుచికరంగా ఉన్నాయా లేదా? ముఖ్యంగా నీకు ఇష్టమైన కుందేలు మాంసం ఎలా ఉంది అని అడిగింది.
దానికి నక్క తాను చేసిన పొరపాటు దానికి అర్థం అయ్యి " అయ్యో మిత్రమా నన్ను క్షమించు నీకు ఆ రోజు నేను నా మూతికి సరిపోయే పాత్రలలో వడ్డించాను నీవు ఏమీ తినలేక పోయావు, ఇప్పుడు నేను నీ పొడుగాటి ముక్కుకి సరిపోయే పాత్రలలో తినలేకపోయాను, నాకు ఇప్పుడే అర్థం అయ్యింది"అని అన్నది.
దానితో కొంగ కూడా నన్ను క్షమించు మిత్రమా నీవు చేసింది నీకు అర్థంకావాలని నీవు చేసినట్టే నేనూ చేశాను ఇప్పుడు నేను నీ మూతికి సరిపడా వండిన పాత్రలలో నీకు వడ్డిస్తాను అని తన మిత్రుడు నక్కకి మంచి విందుని ఇచ్చింది కొంగ.
ఆ విధంగా నక్క తన స్నేహితుడిని ఎప్పుడు హేళన చేయకూడదని అర్థం చేసుకుంది.
అందుకే అన్నారు పెద్దలు, " నిజమైన స్నేహం ఎప్పటికీ నిలుస్తుంది. "
అంటే పైన కథలో చెప్పినట్టు కొంగ తన స్నేహితుడైన నక్కకి అది చేసిన తప్పు అర్థం అయ్యేలా చేసి దానిని మార్చింది. అలాగే నిజమైన స్నేహితుడు ఎప్పుడూ తాన స్నేహితులలో తప్పులని సరిదిద్ది వారి స్నేహాన్ని కాపాడుకుంటాడు.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀
Great story grandma 👍 thank you so much for reminding me of my grandmother 😀👍👍🥺
ReplyDelete