Confidence Is the Key Telugu Stories
Grandmas Stories presents you telugu stories
ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories
Confidence Is the Key Telugu Storiesఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మూఢ నమ్మకస్తుడు. అతను పక్క ఊరిలో ఉన్న వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్లి వాళ్ళని పలకరరించి, అక్కడ పని చూసుకుని తన గ్రామం తిరిగి వస్తుండగా ఆ ఊరిలోని షావుకారు ఆ బ్రాహ్మణుడికి ఒక మంచి బలమైన మేకని ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి ఆ మేకను తీసుకుని భుజాలపై పెట్టుకుని తిరిగి తన ఉరికి వస్తున్నాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Confidence Is the Key Telugu Stories
ఆలా వస్తున్న ఆ బ్రాహ్మణుడిని ముగ్గురు మోసగాళ్లు చూశారు. ఆ బలిసిన మేకను చూసి వాళ్లకు దానిని ఆ బ్రాహ్మణుడి దగ్గరనుండి దానిని ఎలాగైనా తీసుకుని చక్కగా వండుకు తిందామనుకున్నారు. అప్పుడు ఆ ముగ్గురూ కలిసి ఒక పన్నాగం పన్నారు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Confidence Is the Key Telugu Stories
అది ఏమిటంటే ఆ ముగ్గురూ విడిపోయి మూడుచోట్ల ఆ బ్రాహ్మణుడితో మాట్లాడి మోసం మాటలు చెప్పి అతన్ని మోసగించి ఆ మేకను కాజేయాలనుకున్నారు.
ముందుగా ఒక మోసగాడు కొంతదూరం బ్రాహ్మణుడిని వెంబడించి కొంత దూరం వెళ్లిన తరువాత ఆ బ్రాహ్మణుడిని పలకరిస్తూ "అదేంటి ఏ మేకనో గోరెనో అయితే సరే గానీ, ఒక కుక్కని మోసుకుని వెళ్తున్నారు? మీరు సరిగ్గా చేసుకోలేదా, ఏమిటి?" అని అడిగాడు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు అది కుక్క కాదు మేక, నీవు సరిగ్గా చూడు నీకే తెలియటం లేదు అని అంటూ అక్కడినుండి ముందుకు వెళ్ళిపోయాడు.
ఇంకొంత దూరం వెళ్లిన తరువాత రెండో మోసగాడు దారిలో బ్రాహ్మణుడిని పలకరిస్తూ "ఏమిటీ గాడిద పిల్లని భుజాన పెట్టుకుని మరీ మోసుకువెళుతున్నారు? ఇంకేమి దొరకలేదా ఏమిటి?" అని అడిగాడు.
మేకను పట్టుకుని గాడిద పిల్ల అని అంటావు ఏమిటి? అని కోప్పడి ఆ బ్రాహ్మణుడు తన గ్రామం వెళ్ళసాగాడు.
మరికొంత దూరం వెళ్లిన తరువాత మూడో మోసగాడు బ్రాహ్మణుడితో ఇదేమిటి చచ్చిపోయిన గేదెను తీసుకు వెళ్తున్నారు? అని అడిగాడు. దానితో ఆ బ్రాహ్మణుడిలో అనుమానం మొదలయ్యింది. ఒకరు కాదు ముగ్గురు ఇది మేక కాదు అంటూ చెప్పారు. ఇది నిజంగానే మేక కాదేమో అని సందేహపడి ఆ మేకను ఇక్కడే వదిలేస్తాను అని అనుకుని ఆ మేకను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Confidence Is the Key Telugu Stories
దానిని ఆ బ్రాహ్మణుడు వదిలేసిన వెంటనే వాళ్ళ పథకం పారిందని ఆ ముగ్గురు మోసగాళ్లు ఆనందంగా ఆ మేకను తీసుకెళ్ళి దాన్ని చక్కగా వండుకు తిన్నారు.
అందుకే అన్నారు పెద్దలు "ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు." అని
ఆ బ్రాహ్మణుడు ఆ ముగ్గురు మోసగాళ్ల మాటలకి తన కళ్ళని నమ్మకుండా తన ఆత్మవిశ్వాసాన్ని వదిలి ఆ మేకని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. అంటే ఎప్పుడూ మన ఆత్మవిశ్వాసాన్ని వదలకూడదు అని అర్థం.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀
No comments:
Post a Comment