Asatyam Adaradu Telugu Stories Grandma Stories
Grandmas Stories presents you telugu stories
అసత్యం ఆడరాదు
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Asatyam Adaradu Telugu Stories Grandma Stories
భువనగిరిలో ప్రకాశం, వనజ అనే దంపతులు ఉండేవారు. వారికి వికాస్, లత అనే ఇద్దరు పిల్లలు. వికాస్ పెద్దవాడు, చురుకైనవాడు, చదువులో, ఆటల్లో అన్నింట్లో ముందుండేవాడు. లత చిన్నది ఈమె కూడా బాగా తెలివైనది.
ప్రకాశం అదే ఊరిలోని మిల్లులో పనిచేసేవాడు. అతనికి చెప్పింది వినే భార్య, ఆనీ ముత్యాల్లాంటి పిల్లలు అని అందరు అనేవారు.
ఒక రోజు ప్రకాశం ఇంటికి వస్తూ దారిలో సీతా ఫలాలు కనిపిస్తే కొని ఇంటికి తీసుకువెళ్లాడు.
పెద్దవాడు ప్రకాశం సీతా ఫలాలు ఇంతకు ముందు తిన్నాడు. కానీ చిన్నది లత సీతా ఫలాలు ఎప్పుడూ తినలేదు. అవి తెచ్చినప్పటి నుంచీ అవి ఎప్పుడు తిందామా అని ఎదురుచూడసాగింది.
వాళ్ల అమ్మ వనజ సీతా ఫలాలు సాయంత్రం పెడతానని చెప్పింది. లత ఎంత సేపైనా సాయంత్రం అవకపోయేసరికి ఒక పండు ఎవరూ చూడకుండా పక్కకి తీసుకువెళ్లి తినేసింది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Asatyam Adaradu Telugu Stories Grandma Stories
ఏమీ ఎరగనిదానిలా సాయంత్రం వచ్చి వాళ్ళమ్మని సీతా ఫలాలు పెట్టమన్నది.
సరే పొద్దున్నుంచి ఎదురుచూసింది ఇక ఆగలేదని అందరినీ పిలిచి సీతా ఫలాలు పెడదామని చుస్తే అక్కడ ఒక పండు తగ్గి ఉన్నది.
వనజ పిల్లలిద్దరినీ అడిగింది , "ఒక పండు ఎవరు తిన్నారు?" అని.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Asatyam Adaradu Telugu Stories Grandma Stories
వికాస్, లత ఇద్దరూ తినలేదని చెప్పారు.
అప్పుడు ప్రకాశం "సీతా ఫలాలో రాళ్లు ఉంటాయి, ఆ రాళ్లు లోపల ఉండకూడదు, అవి వెంటనే బయటికి తీయాలి అందుకని అడుగుతున్నాను, ." అని అన్నాడు.
ఇది విన్న లత గబుక్కున "నేను ఆ రాళ్లు తీసేసి సీతాఫలం తిన్నాను." అని అన్నది.
అందరూ ఫక్కున నవ్వారు. అప్పుడు వనజ లతని దగ్గరికి తీసుకుని "నువ్వు సీతాఫలం తిన్న విషయం నీతో చెప్పించటానికి మీ నాన్న ఆలా అన్నారు. ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. " అని చెప్పింది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Asatyam Adaradu Telugu Stories Grandma Stories
అందుకే అన్నారు పెద్దలు అసత్యం ఆడరాదని.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀
No comments:
Post a Comment