The Big Fat Cat And The Mice: A Great Idea
ఎవరు పిల్లికి గంట కడతారు?
రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కిరాణా దుకాణం నడిపేవాడు. ఆ ఊరిలో ఉన్న ఒకే ఒక్క కిరాణా దుకాణం అది. అందువలన ఊరందరు వచ్చి అక్కడే కిరాణా సరుకులు కొని పట్టుకెళ్ళేవారు.
రామారావు దుకాణం ఎప్పుడూ సరుకులతో నిండుగా ఉండేది. అందరికీ సరుకులకి అతని దుకాణమే కావటంతో ఆటను సరుకులు పెద్ద ఎత్తున నిలువ ఉంచేవాడు.
అందువలన, అతని దుకాణంలో ఎలుకల సమస్య ఎక్కువగా ఉండేది.
ఒక వేసవి కాలంలో ఆ సమస్య మరింత తీవ్రంగా మారింది.
రామారావు దుకాణంలో ఆ ఎలుకలు రుచికరమైన గోధుమలు, బియ్యం, పప్పులు, గింజలు, బ్రెడ్ మరియు వెన్న, బిస్కెట్లు తిని ఆనందంగా ఉన్నాయి.
బాగా తిని తినీ రోజురోజుకూ లావుగా తయారయ్యాయి.
ఆ వేసవి కిరాణా వ్యాపారి ఎలుకల బెడద కారణంగా కొంత నష్టాన్ని పొందాడు.
ఇక లాభం లేదనుకుని ఎలుకలని ఎలా వదిలించుకోవాలని ఆలోచించాడు.
మరుసటి రోజు, అతను తన దుకాణానికి ఒక పెద్ద గండు పిల్లిని దుకాణానికి తీసుకువచ్చాడు.
ఆ గండు పిల్లి ఎంతో చాకచక్యంగా దుకాణంలో ఉన్న ఎలుకల్ని పట్టుకుని తినటం మొదలుపెట్టింది.
ఇలా రోజులు గడిచిన కొద్దీ ఎలుకలు గణనీయంగా తగ్గిపోయాయి.
దీనితో ఎలుకలు ఆందోళన చెందాయి.
ఈ సమస్యపై చర్చించేందుకు వారు సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి.
"ఈ క్రూరమైన గండు పిల్లిని వదిలించుకుందాం" అని ఎలుకల నాయకుడు చెప్పాడు.
"కానీ ఎలా?"
ఇతర ఎలుకలు అడిగాయి.
అన్ని ఎలుకలూ తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాయి.
అప్పుడు ఒక ఎలుక ఇలా చెప్పింది, "మనము గండు పిల్లి మెడకు గంటను కట్టాలి. అప్పుడు అది మన దగ్గరకి వచ్చినప్పుడల్లా, గంట మోగుతుంది దానితో మనము వెంటనే మన బిలాలలోకి పరుగెత్తుతదాము." అన్నది.
ఇది విన్న ఎలుకలన్నీ చాలా సంతోషించాయి.
వారు ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభించారు.
కానీ వారి ఆనందం స్వల్పకాలికం.
ఒక ముసలి మరియు అనుభవమున్న ఎలుక వారి ఉల్లాసానికి అంతరాయం కలిగించి, "మూర్ఖులారా, ఆగండి, ముందు నాకు ఈ విషయం చెప్పండి, పిల్లికి ఎవరు గంట కడతారు?"
ఈ పెద్ద ప్రశ్నకు ఏ ఎలుక దగ్గర సమాధానం లేదు. దానితో అన్ని ఎలుకలూ నిరాశపడి ఆ దుకాణాన్ని వదిలి వెళ్లిపోయాయి.
ఆ గండు పిల్లి పుణ్యమా అని రామారావు ఆనందంగా తన దుకాణాన్ని నడుపుకున్నాడు.
అందుకే అన్నారు పెద్దలు "వివేకంతో ఆలోచించాలి." అని.