Penuki Pettanam Iste Telugu Stories Grandma Stories
Grandmas Stories presents you telugu stories
పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగింది
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Penuki Pettanam Iste Telugu stories grandma stories
సింహపురి రాజ్యంలో విక్రముడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని పాలనలో ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారు. ఒక రోజున విక్రముడు తన అంగ రక్షకుడితో కలిసి వేట గురించి అడవికి వెళ్ళాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Penuki Pettanam Iste Telugu stories grandma stories
ఆ అడవిలో కొంత సమయం వేటాడిన తరువాత రాజు విక్రముడికీ, అతని అంగరక్షకులకూ రెండు సింహాలు ఎదురుపడ్డాయి. విక్రముడి అంగరక్షకులు సింహాలని చూడగానే విక్రముడిని అక్కడే వదిలివేసి పారిపోయారు.
అక్కడే ఒక చెట్టు మీద ఉన్న ఒక కోతి ఆ సమయంలో పెద్దగా "కిచ, కిచ" అంటూ శబ్దం చేసింది. ఆ శబ్దం ఏమిటో అనుకుని సింహాలు పారిపోయాయి. ఇది గమనించిన విక్రముడు కోతి సింహాలని భయపెట్టింది అని అనుకున్నాడు. విక్రముడు ఆ కోతిని తన అంతఃపురానికి తీసుకువచ్చాడు. ఆ కోతికి బాగా తిండి పెడుతూ కత్తి యుద్ధం నేర్పాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Penuki Pettanam Iste Telugu stories grandma stories
ఒక రోజున నిండు సభలో విక్రముడు "ఈ రోజు నుండీ నాకు అంగరక్షకుల అవసరం లేదు, ఈ కోతే నాకు అంగరక్షకుడు" అని చెప్పాడు.
ఈ నిర్ణయాన్ని మార్చుకొనమని మంత్రులు విక్రముడికి సూచించారు. విక్రముడు వాళ్ళ మాట వినలేదు. అప్పుడు విక్రముడు కోతి వైపు తిరిగి "నా మీద ఈగకుడా వాలకుండా చూసుకోవలసిన బాధ్యత నీదే" అన్నాడు. దానికి కోతి సంతోషంగా తల ఊపింది. అప్పటినుండీ కోతి విక్రముడితోపాటు కత్తి పట్టుకుని తిరగసాగింది.
ఒక రోజు సాయంకాలం విక్రముడు తోటలో పడుకుని నిద్రపోతున్నాడు. కోతి కత్తి పట్టుకుని విక్రముడికి పహారా కాస్తున్నాడు. ఇంతలో విక్రముడు కంఠం మీద ఒక ఈగ వాలింది. విక్రముడు తన మీద ఈగ కూడా వాలకుండా చూసుకోమన్నారు కాబట్టి ఆ ఈగని చంపేయాలని, కోతి రాజు కంఠం మీద కత్తితో కొట్టింది. ఇంకేముంది రాజు విక్రముడు తల తెగిపోయి చనిపోయాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Penuki Pettanam Iste Telugu stories grandma stories
అందుకే అన్నారు పెద్దలు "పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగింది" అని
దీనివలన మనం తెలుసుకోవలసినది ఏమిటంటే మనం ఎప్పుడైనా సందర్భానుసారంగా, విచక్షణతో వ్యవహరించాలి. పై కథలో చెప్పినట్టు కోతి ని అంగరక్షుడిగా చేసి ఆ కోతికి పెత్తనం ఇచ్చిన రాజు చివరికి ఆ కోతి తెలివితక్కువతనం వల్ల చనిపోయాడు. అందువల్ల వివేకాన్ని,విచక్షణనీ ఎప్పుడూ విడువకూడదు.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀
No comments:
Post a Comment