1) వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపఁదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుఁడెపొ నీతి పరుఁడు మహిలో సుమతీ!
భావం: ఈ పద్యంలో నీతివంతుడైనవాడు అందరూ చెప్పిన సలహాలు విని తొందరపడకుండా తాను స్వయంగా గ్రహించిన దాని ప్రకారం నడుచుకుంటాడు.
2) బలవంతుఁడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁజిక్కి చావదె సుమతీ!
భావం: ఈ పద్యంలో తానే బలవంతుడని అహంకారంతో విర్రవీగటం మంచిది కాదు ఎంతో బలమైన సర్పము కూడా చలిచీమల చేత చిక్కి చస్తుంది కదా అని చెప్పారు.
3) అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వర మీనీ వేల్పు, మోహరమునఁ దా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయుఁగదరా సుమతీ!
భావం: ఈ పద్యంలో మనం ఏమి వంటనే వదిలివేయాలో చెప్పారు. అవి ఏమిటంటే అవసరానికి ఆదుకోని చుట్టం, వరమీయని వేల్పు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు కదలని గుర్రం, వీటన్నింటిని తెలివైనవాడు వెంటనే వదిలి వేయాలి.
4) శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగాఁ
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులుబుట్ట నుడివెద సుమతీ!'
భావం:బద్దెన తన తోలి పద్యంలో శ్రీ రాముని శుభాశీస్సులతో చక్కగా నీతి పద్యాలు చెప్పాలని ప్రార్థించి ఆ రాముడే తన చేత ఆశువుగా పద్యాలు చెప్పిస్తాడని తను ధారాళంగా నీతి పద్యాలు చెప్తాడని, అవి బుద్ధిమంతులైన వారు ఆచరిస్తారు అని "సుమతి!" అనే పదాన్ని ప్రతి పద్యంలో వాడతానని ఈ తొట్ట తోలి పద్యంలో చెప్పారు.
5) అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరనుఁ గొల్చి మిడుకుట కంటెన్
వాడిగల యెద్దుల గట్టుక
మడి దున్నక బ్రతకవచ్చు మహిలో సుమతి!
భావం:జీతం ఇవ్వని యజమాని దగ్గర పనిచేయటం కంటే రెండు మంచి ఎద్దులతో వ్యవసాయం చేసుకోవటం మంచిది. పనికి తగిన ప్రతిఫలం రానిచోట ఉండకూడదని ఈ పద్యాలో చెప్పారు.
6) అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి ఊరు సొరకుము సుమతి!
భావం:అవసరమైతే డబ్బు సాయం చేసేవారు, వైద్యం చేసే వైద్యుడు, శుభకార్యాలు నిర్వహించే పండితుడు, వీరందరూ ఉన్న ఊరిలోనే ఉండమని ఈ పద్యంలో చెప్పారు. ఈ రోజులలోలాగా ఆ రోజాలలో బస్సులు, రైళ్లు, లేవు కాబట్టి ఈ సదుపాయాలు ఉన్న ఊరు నివాసయోగ్యమైనదిగా ఈ పద్యంలో చెప్పారు.
మెచ్చునదే నేర్పు, వాదుకు
వచ్చునదే కీడుసుమ్ము! వసుధను సుమతీ!
భావం:ఇతరులకి చెప్పగలిగినప్పుడే దానిని విద్య అంటారు, ఆ రాజులకాలంలో యుద్ధంలో ధైర్యంగా వెళ్లినవాడే ధీరుడు, గొప్ప కవులు మెచ్చినదే కవిత్వం, అనవసరమైన విషయాలలో వాదించకుండా ఉండటమే మంచిదని ఈ పద్యంలో చెప్పారు.
we live in Australia but your blog gave us an opportunity to read telugu stories . thank you keep it up. 👍👍❤️
ReplyDeleteGreat stories
ReplyDeletehello grandma!! this is really great site you are doing great job keep it up 👍👍☕
ReplyDeleteI am Faulkner from Australia Thank you Grandma for posting very good stories🎉🎉👍👍this is a really kid friendly site thank you keep posting👍👍
ReplyDeletevery good site
ReplyDelete