An Interesting Story of Sri Krishnadevaraya From Telugu stories
Grandmas Stories presents you telugu stories
శ్రీకృష్ణదేవరాయలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విజయనగర సామ్రాజ్యాన్ని పాలించినటువంటివాళ్లలో ముఖ్యమైన రాజు. భారతావనిలో దరిదాపులా దక్షిణాపథాన్నంతా తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు.
సాహిత్యం, కవిత్వం, మొదలైన విషయాలలో కూడా శ్రీకృష్ణదేవరాయలు నిజమైన దిట్ట. తాను స్వయంగా "ఆముక్తమాల్యద" రచించాడు.
ఇప్పుడు ఒక రోజు జరిగిన సాహిత్య కార్యక్రమంలోని విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక రోజున శ్రీకృష్ణదేవరాయలు అష్ట దిగ్గజాలతో కూడి ఉన్నటువంటి నిండు సభలో ఈ విధంగా ఒక తర్క సమస్యని సభా సదుల ముందు ఉంచాడు.
"రామునికి ముగ్గురు తమ్ముళ్లు, ధర్మరాజుకి నలుగురు తమ్ముళ్లు, రాముడి తమ్ముళ్లు గొప్పవారా, లేక ధర్మరాజు తమ్ముళ్లు గొప్పవారా?" దీనికి సమాధానం చెప్పమన్నాడు.
దీనికి కొంతమంది రాముడి తమ్ముళ్లు గొప్పవారన్నారు. శ్రీకృష్ణదేవరాయలు కారణమేమిటని అడిగితే చెప్పలేకపోయారు. మరికొంతమంది ధర్మరాజు తమ్ముళ్లు గొప్పవారని చెప్పారు. వీళ్ళు కారణం చెప్పలేకపోయారు.
అప్పుడు అందరూ, ప్రభూ మీరే దీనికి సమాధానం చెప్పండన్నారు.
అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు సమాధానం ఇస్తూ రాముడికంటే రాముడి తమ్ముళ్లు ముగ్గురూ శక్తి తక్కువవాళ్ళు, అందుకని వాళ్ళు రాముడికి అనుకూలంగా ఉండటంలో విశేషం ఏమిలేదు. కానీ ధర్మరాజు తమ్ముళ్లు నలుగురూ జగదేకవీరులు, నాలుగు పక్కలా సమస్త సామ్రాజ్యాలనీ జయించారు, నలుగురు తమ్ముళ్లు ధర్మరాజు కంటే మహావీరులైనప్పటికీ ధర్మరాజు మాటకి లోబడి ఉన్నారు.
అందుకని రాముడి తమ్ముళ్ల కంటే ధర్మరాజు తమ్ముళ్లు గొప్పవారు. ఇంతలో సభలోంచి ఒక వ్యక్తి ప్రభూ ఈ జన్మలోకూడా మీరు పాండవ పక్షపాతులే అని అన్నాడు.
శ్రీకృష్ణదేవరాయలు అతని మాటలకు ఎంతో సంతోషపడి అక్షర లక్షలు ధనం ఇచ్చి సత్కరించాడు. ఇంతకీ సభలోని వ్యక్తి చెప్పిన దాని అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడే మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలుగా పుట్టాడని ఆ వ్యక్తి మాటలకి అర్థం.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀
No comments:
Post a Comment