Showing posts with label Telugu Moral Stories. Show all posts
Showing posts with label Telugu Moral Stories. Show all posts

Thursday, February 9, 2023

The Three Fools Story: Must Read Telugu Moral Stories

The Three Fools Story: Must-Read Telugu Moral Stories

విద్యా, వినయం, విచక్షణతో జీవించాలి

ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో విద్యాధరుడు, వినయధరుడు, సర్వమిత్రుడు, సత్యధరుడు అనే నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు. వారు మంచి స్నేహితులుగా పెరిగారు. విద్యాధరుడు, వినయధరుడు మరియు సర్వమిత్రుడుచాలా తెలివైనవారు.
 
కానీ సత్యధరుడుఎక్కువ సమయం తింటూ, నిద్రిస్తూ గడిపేవాడు. అతన్ని అందరూ మూర్ఖుడిగా భావించేవారు.

The Three Fools Story: Must-Read Telugu Moral Stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu prover

ఒకసారి గ్రామంలో కరువు వచ్చింది. పంటలన్నీ నాశనమయ్యాయి. నదులు, సరస్సులు ఎండిపోవడం ప్రారంభించాయి. గ్రామములో ప్రజలు ప్రాణాలను కాపాడుకునేందుకు ఇతర గ్రామాలకు వెళ్లడం ప్రారంభించారు.

"మనం కూడా త్వరగా వేరే ప్రదేశానికి మారాలి, లేకపోతే మనం కూడా చాలా మందిలాగే చనిపోతాము" అన్నాడు విద్యాధరుడు. వారంతా అతనితో ఏకీభవించారు.

"అయితే సత్యధరుడు సంగతేంటి?" అడిగాడు విద్యాధరుడు.

"అతను మనతో రావటం అవసరమా? అతనికి నైపుణ్యం లేదా అభ్యాసం లేవు. అతన్ని మనతోతీసుకెళ్లలేము" అని సర్వమిత్రుడు సమాధానమిచ్చారు.
"అతను మనకు భారంగా ఉంటాడు."

"అతన్ని వదిలెయ్యడం ఎలా? వాడు మన దగ్గరే పెరిగాడు" అన్నాడు వినయధరుడు.
"మనం సంపాదించినది నలుగురికీ సమానంగా పంచుకుందాము."

సత్యధరుడుని తమ వెంట తీసుకెళ్లేందుకు అందరూ అంగీకరించారు.

కావాల్సిన వస్తువులన్నీ సర్దుకుని దగ్గర్లోని ఊరికి బయలుదేరారు.
దారిలో ఒక అడవి దాటవలసి వచ్చింది. వారు అడవి గుండా వెళుతుండగా, వారికి ఒక జంతువు ఎముకలు కనిపించాయి. వారు ఆసక్తిగా ఎముకలను నిశితంగా పరిశీలించడానికి ఆగిపోయారు.

"అవి సింహం ఎముకలు" అన్నాడు వినయధరుడు. మిగిలినవారు అంగీకరించారు.

"మన అభ్యాసాన్ని పరీక్షించడానికి ఇది ఒక గొప్ప అవకాశం" అని విద్యాధరుడు అన్నాడు.

"నేను ఎముకలను కలిపి ఉంచగలను." అలా చెప్పి, అతను ఎముకలను ఒక సింహం యొక్క అస్థిపంజరాన్నిగాఏర్పరిచాడు.

సర్వమిత్రుడు అన్నాడు, "నేను దానికి కండరాలు మరియు కణజాలం తెప్పించగలను." వెంటనే ఒక నిర్జీవమైన సింహం వారి ముందు ఉంది.

"నేను ఆ శరీరానికి ప్రాణం పోయగలను" అన్నాడు వినయధరుడు. 

కానీ అతను కొనసాగించడానికి ముందు, సత్యధరుడు అతన్ని ఆపడానికి దూకాడు.
"వద్దు. వద్దు! ఆ సింహానికి ప్రాణం పోస్తే అది మనందరినీ చంపేస్తుంది" అని అరిచాడు. అది సింహం క్రూర జంతువు, ఆ సింహానికి ప్రాణం పోస్తే మనకి హాని చేస్తుంది. అని అన్నాడు.

"అయ్యో పిరికివాడా! నా నైపుణ్యాలను పరీక్షించకుండా, నన్ను ఆపలేవు" కోపంగా అరిచాడు వినయధరుడు. "నిన్ను వెంట రానివ్వమని నేను ఇతరులను అభ్యర్థించాను, కాబట్టి నీవు మాతో ఇక్కడ ఉన్నావు. కావాలంటే నువ్వు ఆ చెట్టు ఎక్కి కూర్చో, నేను దీనికి ప్రాణం పోస్తాను." అని అన్నాడు.

"కాబట్టి దయచేసి నన్ను ముందుగా ఆ చెట్టు ఎక్కనివ్వండి," అని భయపడిన సత్యధరుడు సమీపంలోని చెట్టు వైపు పరిగెత్తాడు.సత్యధరుడు చెట్టు ఎక్కి ఎత్తైన కొమ్మపైన కూర్చోగానే, వినయధరుడు సింహానికి ప్రాణం పోశాడు. కూర్చోగానే గర్జనతో లేచింది.

సింహం ముగ్గురు బ్రాహ్మణులపై దాడి చేసి చంపింది.

చెట్టు పైకి ఎక్కి కూర్చున్న సత్యధరుడు పిరికివాడైన విచక్షణతో బ్రతికిపోయాడు.

దీనివలన మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే విద్య, విచక్షణ సమన్వయంతో జీవించాలి.

''విద్యా, వినయం, విచక్షణతో జీవించాలి.''

Comonsense: ఇంగిత జ్ఞనం

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Thursday, May 27, 2021

Telugu Moral Stories From Grandma

Grandmas Stories presents you telugu stories

Telugu Moral Stories From Grandma

విచక్షణతో కూడిన కోరిక శ్రేయస్కరం

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, telugu

సత్యపురం అనే ఊరిలో పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి భార్య ఒక కూతురు ఉన్నారు. అతనికి చాలా బంగారం సంపాదించాలనే ఆశ ఉండేది. ఆ ఆశతో పాపయ్య శివుడి గురించి తపస్సు చేశాడు.

కొంత కాలానికి శివుడు ప్రత్యక్షం అయ్యి పాపయ్యను "ఎం కావాలో కోరుకో పాపయ్య" అన్నాడు.

పాపయ్య వెంటనే "తాను ముట్టుకున్నదంతా బంగారం కావాలి" అని అన్నాడు.

ఒక నిమిషం ఆలోచించి కోరుకోమని శివుడు హెచ్చరించాడు.

కానీ పాపయ్య వినలేదు తనకు బంగారు వరమే కావాలన్నాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, telugu moral stories

శివుడు "తథాస్తు!!!!!" అని మాయమయ్యాడు.
పాపయ్య తన ఇంటికి వచ్చాడు. ఇల్లంతా తడిమి చూశాడు. ఇల్లు అంతా బంగారం అయిపోయింది.

ఇంట్లో అన్నివస్తువులు తడిమి చూశాడు, అన్నీ బంగారం అయిపోయాయి.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, telugu moral stories

ఇంతలో పాపయ్య కూతురు నాన్న అంటూ దగ్గరికి వచ్చింది.

తన కూతురుని ఆనందంగా ఎత్తుకున్నాడు, ఇంకేముంది కూతురు కూడా బంగారం అయిపోయింది.

ఇంట్లోకి వెళ్లి మంచి నీళ్లు తాగుదామనుకుని నీళ్లు గ్లాసులోంచి నోట్లో పడిందే, మంచినీళ్లు కూడా బంగారం అయిపొయింది.

ఇదంతా చూస్తున్న పాపయ్య భార్య వచ్చి దీని వలన మీరు ఏమి సాధించగలిగారు అని బాధపడసాగింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, telugu moral stories

బాధపడుతున్న పాపయ్య తనకు తెలియకుండానే తన చేతులు తన నెట్టి మీద పెట్టుకున్నాడు. తాను కూడా బంగారం అయిపోయాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, telugu moral stories

అందుకే అన్నారు పెద్దలు "విచక్షణతో కూడిన కోరిక శ్రేయస్కరం" అని.

హద్దులు మీరినటువంటి ఆశ నరకం అవుతుంది.
ఏదైనా కోరుకునేటప్పుడు విచక్షణని ఉపయోగించాలని దీని వలన మనం తెలుసుకోవాలి.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Wednesday, May 26, 2021

GRANDMA TELUGU TALES

Grandmas Stories presents you telugu stories

GRANDMA TELUGU TALES

దుష్టులకి దూరంగా ఉండాలి

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

విద్యారణ్య అడవిలో ఒక తోడేలు ఉండేది. ఆ తోడేలు మిగతా అన్ని జంతువులనీ మోసం చేస్తూ ఉండేది. ఒక రోజున తోడేలు దృష్టిలో బాగా బలిసిన కోతి కనిపించింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

తోడేలుకు కోతి యొక్క గుండెను తినాలనిపించింది. అప్పటినుంచి తోడేలు కోతితో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

మిగతా జంతువులు తోడేలుతో స్నేహం పనికిరాదని కోతికి చెప్పాయి. కానీ కోతి వాటి మాట వినలేదు. ఈ విధంగా కొన్ని రోజులు జరిగాయి. 

బాగా నమ్మకం ఏర్పడిన తరువాత ఒక రోజున తోడేలు కోతిని దిట్టమైన అడవిలోకి తీసుకుని వెళ్ళింది. అక్కడ తోడేలు కోతితో చాలా రోజులుగా నీ గుండెకాయ తినాలని ఉంది అందుకే నీతో స్నేహం చేశాను. ఇప్పుడు నీ గుండెకాయ తినేస్తాను అని అన్నది.

అప్పుడు కోతి తన తోటి జంతువులు చెప్పిన మాట విననందుకు బాధపడింది. కోతి తెలివిగా అలోచించి ఇలా చెప్పింది, "మిత్రమా!! నీకు నా గుండెని ఇచ్చేదానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు ఇంతలా అడగాలా!! కానీ నా గుండె చెట్టు మీద పెట్టి వచ్చాను. నీవు నాతో వస్తే నా గుండె నీకు ఇచ్చేస్తాను. "

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

దీనికి మూర్ఖురాలైన తోడేలు సంతోషంగా ఒప్పుకుని కోతితో పాటు చెట్టు దగ్గరికి వచ్చింది.

ఆ సమయానికి మిగతా జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి, కోతి మిగతా జంతువులన్నిటికీ జరిగిన విషయం చెప్పింది. అన్ని జంతువులూ కలసి తోడేలును తన్ని తరిమేశాయి.

అందుకనే "దుష్టులకు దూరంగా ఉండమని" చెప్తారు.

అంటే ఎవరైనా చెడ్డవారు అని తెలిసి వారితో స్నేహం చేయటం మంచిది కాదు అని అర్థం. పై కథలో చెప్పినట్టు చెడు ప్రవ్రుత్తి కలిగినవారిని ఎప్పుడూ నమ్మకూడదు అని అర్థం.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Monday, May 24, 2021

Telugu Stories A Father's Lesson To His Son

Grandmas Stories presents you telugu stories

తండ్రి కొడుకుకి చెప్పిన గుణపాఠం

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, telugu kathalu, moral stories telugu,

శ్రీపురంలో సోమశేఖరుడనే ధనిక వర్తకుడు ఉండేవాడు. అతను విదేశాలలో కూడా వర్తకం చేసేవాడు. ఊరిలో అతను దాన ధర్మాలు చేస్తాడని అడిగినవాళ్ళకి తగిన విధంగా సాయం చేస్తాడని మంచి పేరుంది.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu, grandmaz stories,

సోమశేఖరుడికి ఒక్కగానొక్క కొడుకు, అతని పేరు శివశేఖరుడు. లేక లేక కలిగిన సంతానం అవటం వలన ఇంట్లో అంతా శివశేఖరున్ని ఎంతో గారాబంగా చూసుకునేవారు. ఆ ఇంట్లో శివశేఖరుడి ఎంతంటే అంత. అతను అడిగింది క్షణాల్లో అతని ముందు తెచ్చి పెట్టేవారు.

 దీంతో అతను బాగా సోమరిపోతులా, ఎందుకూ పనికిరానివాడిలా తయారయ్యాడు.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu, grandmaz stories,

శివశేఖరుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా కానీ తండ్రి సోమశేఖరుడు చేసే వర్తకం ఏ మాత్రం రాలేదు. సోమశేఖరుడికి తాను పెద్దవాడయ్యాడు తన తరువాత తన కొడుకు వ్యాపారాన్ని చుస్కోలేడు అనే చింత బాధించసాగింది.

సోమశేఖరుడు ఎన్నో విధాలుగా తన కొడుకుని మార్చాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక లాభంలేదనుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు.

సోమశేఖరుడు తన కొడుకుతో "నాయన నేను మన ఉన్నిని విదేశాలలో అమ్మి వస్తాను. అప్పటిదాకా నీవు ఇక్కడి వ్యవహారాలు చూసుకో, ఏదైనా అవసరం వస్తే ఇక్కడ నా మిత్రులు నీకు సహాయం చేస్తారు." అని చెప్పి రష్యాకు ఓడలో బయలుదేరతాడు.

కొన్ని రోజుల తరువాత సోమశేఖరుడు వెళుతున్న నౌక ప్రమాదానికి గురైందని నౌకలోని అందరూ చనిపోయారని వార్త వచ్చింది.

శివశేఖరుడు ఇది విని ఎంతో బాధపడ్డాడు. కానీ అతనికి వ్యాపారం చేయటం రాదు. ఎలాగూ తన తండ్రి మిత్రులు ఉండనేఉన్నారు వారు తనకు ఎప్పటికీ సహాయం చేస్తూనే ఉంటారు అని అనుకుని నిశ్చింతగా ఉండసాగాడు.

కొన్ని రోజులకి తన తండ్రి మిత్రులందరూ ఒక్కొక్కరిగా సహాయం చేయటం మానేస్తారు. చివరికి ఎవ్వరు సహాయం చేయట్లేదని శివశేఖరుడు నిదానంగా వర్తక విద్యని నేర్చుకోవటం మొదలుపెడతాడు.

కొద్ది రోజులలోనే వ్యాపారంలోని కిటుకులన్నీ నేర్చుకుని తన తండ్రిలాగా విదేశీ వర్తకం చేసే స్థాయికి ఎదుగుతాడు.
శివశేఖరుడు తన తండ్రి ఆశించినదానికంటే ఎంతో చురుకుగా వ్యాపారం చేస్తుంటాడు. ఆతను కూడా తన త్నడ్రిలాగా వ్యాపారంలో, ఊరిలో మంచి పేరు తెచ్చుకుంటాడు.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu, grandmaz stories,

ఇలా ఉండగా ఒక రోజు తన తండ్రి సోమశేఖరుడు ఇంటికి తిరిగి వస్తాడు. తండ్రిని చూసి శివశేఖరుడు ఎంతో ఆనందించి తన వ్యాపార ప్రతిభ గురించి, ఇంకా ఇన్ని రోజులు ఉరిలో తాను చేసిన మంచి పనుల గురించి అన్నీ తండ్రికి వివరంగా చెబుతాడు.

ఇవన్నీ విన్న సోమశేఖరుడు తన కొడుకు తననే మించిపోయాడు అని సంతోషించి ఇలా చెప్తాడు, "నాయన నేను లేకపోతేకానీ నీవు దారిలోకి రావని నేను ప్రయాణిస్తున్న నౌకకి ప్రమాదం జరిగిందని, అందులోని అందరూ చనిపోయారని నీతో చెప్పమన్నాను, నా మిత్రులతో కొన్ని రోజుల తరువాత నీకు సహాయం చేయటం మానేయమని చెప్పాను. అలా చేస్తే కానీ నీవు దారిలోకి రావని ఈ పని చేశాను."

ఇది విన్న కొడుకు శివశేఖరుడు ఎంతో ఆశ్చర్యపోయి "మరి మీరు ఇన్ని రోజులూ ఎక్కడ ఉన్నారు? ఏమి చేశారు?" అని అడిగాడు.

దానికి సోమశేఖరుడు నవ్వి "నేను నా ఆప్త మిత్రుని ఇంట్లో ఉంటూ నీ ఉన్నతిని గురించి నా మిత్రులద్వారా తెలుసుకుంటూ ఉన్నాను." అని అన్నాడు.

తన తండ్రి తన బాగు కోసం ఎంత శ్రమపడ్డాడు అని శివశేఖరుడు బాధపడి తన తండ్రికి క్షమాపణలు చెప్పి అలా చేసినందుకు తనని సరైన దారిలోకి నడిపినందుకు శివశేఖరుడు తన తండ్రి సోమశేఖరుడికి ధన్యవాదాలు చెప్పాడు.

అప్పటినుంచి శివశేఖరుడు తండ్రికి అన్ని విషయాలలో సహాయంగా ఉంటూ ఆనందంగా జీవించాడు.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Sunday, May 23, 2021

Grandma Telugu Stories From Proverbs

Grandmas Stories presents you telugu stories

పెద్దలమాట చద్దిమూట

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu, grandmaz stories,

శ్రావణపురంలో శరభయ్య అనే చేయి తిరిగిన రైతు ఉండేవాడు. అతను సేంద్రియ వ్యవసాయంలో అనేక పద్దతులతో అద్భుతమైన పంటలని పండిస్తూ ఉండేవాడు.

 అతని నాణ్యమైన పశు సంపద కూడా ఉండేది. ఇదంతా అతని కష్టార్జితం.

శరభయ్య ప్రతి రోజు తెల్లవారుఝామునే లేచి వ్యవసాయ పనులు మొదలు పెట్టి, పనివారికి పని పురమాయించి, వారు ఆ పని సరిగ్గా చేశారో లేదో చూసుకుని, ఇంకా ఏమి కొత్త పద్ధతులతో వ్యవసాయం చేస్తే పంట మరింత మెరుగుపడుతుంది అని కొత్త ప్రయోగాలు చేసి, ఇలా అన్ని పనులు పూర్తిచేసుకుని పొద్దుపోయిన తరువాత ఇంటికి చేరుకునేవాడు.

ఒక్క మాటలో శరభయ్యకి వ్యవసాయం అంటే పంచ ప్రాణాలు. అటువంటి శరభయ్యకి రమేష్,ఉమేష్ అనే ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రమేష్కి దేశ భక్తి ఎక్కువ, ఎప్పుడూ దేశం కోసం ఏమైనా చేయాలి, అందుకోసం సైన్యంలో చేరాలి అని అనుకునేవాడు. ఇంక రెండో కొడుకు ఉమేష్కి వ్యాపారం చేయటం అంటే ఇష్టం.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu, grandmaz stories,

తన తరువాత తన పొలాన్ని, పశు సంపదని ఎవరు చూసుకుంటారు అని శరభయ్యకి ఒకటే చింతగా ఉండేది.

ఇక ఒకరోజు శరభయ్య పెద్ద కొడుకు రమేష్ని పిలిచి "నాయన నీవు భవిష్యత్తులో ఏమి చేయాలనుకుంటున్నావు?" అని అడిగాడు.

దానికి రమేష్ "నేను సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను నాన్న" అని ఖచ్చితంగా చెప్పాడు.
శరభయ్య సరే అని చెప్పి పెద్ద కొడుకుని సైన్యంలోకి పంపాడు.
కొంత కాలం తరువాత శరభయ్య చిన్న కొడుకు ఉమేష్ని పిలిచి "నాయన, నీ అన్నయ్య సైన్యంలో చేరాడు, ఇక నాకు సాయంగా ఉండాల్సింది నీవే, నీకు ఇష్టమైన వ్యాపారం చేసుకుందువుకానీ అప్పటిదాకా నాకు వ్యవసాయంలో సాయం చెయ్యి." అని అడిగాడు.

ఉమేష్కి తన నాన్న చెప్పింది బాగానే అనిపించింది, అందువలన దానికి ఒప్పుకుని శరభయ్యకి వ్యవసాయంలో సాయంగా ఉంటూ వచ్చాడు.

కొంత కాలానికి శరభయ్య చనిపోయాడు. చనిపోతూ ఉమేష్తో "నాయన నా ఆస్తిని నీ అన్నయ్యతో సరి సమానంగా పంచుకో, పొలాన్ని, పశువుల్ని కన్న బిడ్డల్లా చూసుకో" అని చెప్పి చనిపోయాడు.

ఉమేష్ కొంత కాలం అన్నీ బాగానే చూసుకున్నాడు, తరువాత పట్నంలో వ్యాపారం పెట్టాలని పొలాన్ని, పశువుల్ని కౌలుకి చూసుకుంటానికి ఇచ్చేసి పట్నంలో కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు.

మొదట్లో అంతా బాగానే ఉంది. కొంత కాలం గడిచేసరికి కౌలుకి ఇచ్చిన వాళ్ళు డబ్బు సరిగ్గా పంపటం మానేశారు. వ్యాపారంలో నష్టం వచ్చింది. ఇంక చేసేది లేక తిరిగి తన ఊరు శ్రావణపురానికి చేరుకున్నాడు.

అక్కడ తన పొలం కౌలుకి తీసుకున్నవాడు వాడిన ఎరువులూ, రసాయనాల వల్ల పంట ఎంతో క్షీణించి ఉంది. పశువులు పట్టించుకునేవాళ్ళు లేక అనారోగ్యంతో, బక్కచిక్కి ఉన్నాయి. అంటే ఇన్ని రోజులూ కౌలుకి తీసుకున్నవాడు తన తండ్రి పొలాన్ని, పశువులని సరిగ్గా చేసుకోలేదని అర్థమయ్యింది.

ఇక ఆలస్యం చేయకుండా తన తండ్రి కన్న బిడ్డలా చూసుకున్న తన పొలాన్ని, పశువులని తానే స్వయంగా సాగు చేయటం, బాగోగులు చూసుకోవటం మొదలుపెట్టాడు.
మళ్లీ శరభయ్య పొలానికి పూర్వ కళ వచ్చింది. తన తండ్రిలాగే సేంద్రియ సాగులో కొత్త పద్దతులతో రెట్టింపు పంట పండించసాగాడు.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu, grandmaz stories,

ఇంతలో సైన్యంలో చేరిన ఉమేష్ అన్నయ్య రమేష్ తిరిగి ఇంటికి వచ్చాడు. ఉమేష్ తన తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆస్తిని ఇద్దరికీ సమానంగా పంచాడు. 

అన్నదమ్ములిద్దరూ పెళ్లి చేసుకుని తమ కుటుంబాలతో పొలాన్ని, పశు సంపదని చక్కగా చూసుకుంటూ ఎంతో సంతోషంగా జీవించారు.

అందుకే అన్నారు పెద్దలు, "పెద్దలమాట చద్దిమూట" అని.

అంటే పెద్దవాళ్ళు చెప్పింది విని అది సరిగ్గా ఆచరిస్తే ఎంతో మేలు జరుగుతుందని ఈ సామెత అర్థం. పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకుని పిల్లలకి మంచి చెబుతారు. అది విని ఆచరిస్తే తరువాతి తరాలవారికి మంచిదని అర్థం.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Saturday, May 22, 2021

Telugu Moral Stories From Grandma

Grandma stories presents you  telugu stories 

మెరిసేదంతా బంగారం కాదు

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu, grnadmaz stories,

అనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో పెద్ద చెరువుంది. ఆ చెరువులో బోలెడు చేపలు ఉండేవి. ఆ చేపలని తినటానికి ఒక కొంగ చాలా ప్రయత్నాలు చేసింది, ఐనా దానికి ఒక్క చేప కూడా చిక్కలేదు.

అప్పుడు ఆ దొంగ కొంగ ఏంతో ఆలోచించి ఒక పథకం పన్నింది.

ఆ కొంగ రోజు చెరువులో ఒంటికాలి మీద నిలుచుని జపం చేస్తున్నట్టుగా నటించేది. ఆ చెరులోని చేపలు కొన్ని రోజులు దూరంగా ఉండి ఈ కొంగ ఏమి చేస్తుందా అని ఆసక్తిగా గమనించసాగాయి.

ఇలా కొన్ని రోజులు గడిచాయి, ఆ దొంగ కొంగ తనపాటికి తాను కొంగ జపం చేస్తూ చేపల్ని పట్టించుకోకుండా ఉండేది.
కొన్ని రోజులకి ఆ చెరువులోని చేపలు ఆ కొంగ ఏమి చేస్తుందిలే, అది ఎప్పుడూ కొంగ జపం చేసుకుంటూ ఉంటోంది అని దాని దగ్గరగా తిరగటం మొదలుపెట్టాయి. ఐనా కొంగ పట్టించుకోకుండా దొంగ కొంగ జపం చేసుకుంటూ ఉంది.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu

మరికొన్ని రోజులకి ఆ చెరువులోని చేపలు ఆ కొంగతో మాట్లాడటం మొదలుపెట్టాయి. "ఓ మిత్రమా!! నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది. మమ్మల్ని తినటం కూడా మానేసి నీవు జపం చేసుకుంటున్నావ్." అని అడిగాయి.

దానికి దొంగ కొంగ " మిత్రులారా!! నాకు ఒక ముని చెరువులో ఒంటికాలి మీద జపం చేస్తే ఆకలి దప్పికలు ఉండవని చెప్పాడు అందుకే నేను ఇలా జపం చేస్తున్నాను." అని అంది.

ఇది విన్న చేపలు, ఓహో ఈ కొంగ పూర్తిగా మారిపోయింది, ఇంక వాటిని ఈ కొంగ తినదు అని అనుకుని దాని దగ్గరగా భయంలేకుండా తిరగటం మొదలుపెట్టాయి.
ఇంక ఆ దొంగ కొంగ చేపలతో ఏంతో స్నేహంగా మాట్లాడటం మొదలుపెట్టింది.

సరైన అవకాశం కోసం చూస్తున్న ఈ దొంగ కొంగకి చేపలు తనని పూర్తిగా నమ్మి దాని దగ్గరే ఉండటంతో తన పథకంలో తరువాతి భాగానికి తేర తీసింది.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu

ఒక రోజు ఆ దొంగ కొంగ చేపలన్నీ దాని చుట్టూ ఆడుకుంటుండగా ఆ చేపలతో ఇలా అనసాగింది, "మిత్రులారా!! నా తపశ్శక్తితో ఒక విషయం చూశాను. త్వరలో ఈ చెరువు ఎండిపోబోతోంది మీరు ఇంకా ఇక్కడే ఉంటే చనిపోతారు. మీరు నా మిత్రులు కాబ్బట్టి ఈ విషయాన్ని మీతో చెప్తున్నాను." అని అంది.

ఈ విషయం విన్న చేపలు ఏంతో భయపడ్డాయి. అప్పుడు ఈ దొంగ కొంగ "సరే నేను చెప్పవలసిన విషయం చెప్పాను. ఇంక సెలవు మిత్రులారా!! ఈ చెరువుకి దగ్గరలో ఇంకొక పెద్ద చెరువు ఉంది, నేను అక్కడికి వెళిపోతున్నాను." అని అంది.

ఈ మాట విని ఈ చేపలు ఇంకా భయానికి లోనయ్యాయి. ఇదే అవకాశముగా భావించి ఆ కొంగ చేపలతో "మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని ఒక్కొక్కరిగా నా నోట్లో పెట్టుకుని ఆ చెరువులోకి తీసుకువెళతాను." అని అంది.

ఇది విన్న చేపలు కొంత సేపు ఆలోచించుకుని ఆ దొంగ కొంగని నమ్మి సరే అన్నాయి.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu

ఇంక ఒక్కొక్క చేపని తీసుకువెళ్లి దగ్గరలోని కొండ మీద తినేయటం మొదలుపెట్టింది.

ఇలా జరుగుతుండగా ఒక రోజు ఆ చెరువులోని ఒక ఎండ్రగబ్బ వంతు వచ్చింది. అన్ని చేపల్లాగే ఈ ఎండ్రగబ్బని కూడా ఆ దొంగ కొంగ తీసుకువెళ్ళసాగింది. ఆ దొంగ కొంగ తినే కొండ సమీపిస్తుండగా ఈ ఎండ్రగబ్బకి అక్కడ ఏ చెరువు కనిపించలేదు, పైగా కొంగ తినివేయగా మిగిలిన చేపల ఎముకలు కనిపించాయి.

దాంతో ఎండ్రగబ్బ తెలివిగా "మిత్రమా నాకు నీ నోటిలోంచి జారిపోతున్నట్టుగా అనిపిస్తోంది ఎక్కడైనా కొంచెం ఆపితే నీ మెడకు చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటాను" అని అంది.

ఈ దొంగ కొంగ దాని ఆహారం కింద పడిపోతుందేమోనని ఎండ్రగబ్బని ఒకచోట దించి దాని మెడ చుట్టూ గట్టిగా పట్టుకోమని చెప్తుంది.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu

తెలివైన ఎండ్రగబ్బ ఇదే అవకాశం అనుకోని ఆ దొంగ కొంగ మెడ కొరికి దాన్ని చంపివేసింది.

ఆ ఎండ్రగబ్బ ఎంతో తెలివిగా, తనని, ఆ చెరువులోని మిగిలిన చేపలని కాపాడింది. అప్పుడు అది ఆ దొంగ కొంగని చూసి "మెరిసేదంతా బంగారం కాదు." అని అనుకుంది.

అందుకే అన్నారు పెద్దలు "మెరిసేదంతా బంగారం కాదు" అని

అంటే ఎవరైనా ఏంతో మంచిగా నటించి అవతలివాళ్ళని మోసం చేయబోతే ఈ సామెతని ఉపయోగిస్తారు.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Friday, May 21, 2021

Telugu Stories For Everyone

Telugu Stories For Everyone

Grandma stories presents you telugu stories

తేలుకుట్టిన దొంగ

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu

పాండ్య దేశపు రాజు మాల్యవంతుడు. అతని మంత్రి పేరు బొమ్మరాయడు. ఒకసారి బొమ్మరాయుడు ఒక పని నిమిత్తం వేరే రాజ్యానికి వెళుతుండగా పూట కూళ్లమ్మ బసలో బాగా తెలివైన ఒక వ్యక్తి కనిపించాడు. 

బొమ్మరాయుడు అతన్ని దగ్గరికి పిలిచి అతని చేయి చూసి చాలా ఆశ్చర్యం చెందాడు. అతని హస్తరేఖల్లో పాండ్య దేశపు రాజుకి అల్లుడయ్యే అవకాశాలు కనిపించాయి. బొమ్మరాయుడు ఆలోచన ఏమిటంటే రాజు కుమార్తెను తన కొడుకుకి చేసుకుని రాజ్యాన్ని కైవసం చేసుకోవాలనే దురాలోచన ఉంది. ఈ వ్యక్తి చేతుల్లో రాజుకి అల్లుడయ్యే రేఖని చూసి అతన్ని చంపేయాలనుకున్నాడు.

బొమ్మరాయుడు ఒక లేఖపై ఇలా రాశాడు "ఈ లేఖ తెచ్చినవానికి విషము ఇమ్ము." అని ఆలా రాసి ఆ యువకుడిని పిలిచి "ఈ లెఖను నీవు తీసుకుని వెళ్లి రాజధాని నగరంలో ఉన్న నా కుమారుడికి ఇవ్వు నీకు మంచి జరుగుతుంది" అని చెప్పాడు.
మంత్రి వేరే పని మీద వెళ్ళిపోయాడు.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,
ఆ యువకుడు ఆ లేఖను జాగ్రత్తగా తన నడుము వస్త్రంలో దోపుకుని రాజధాని నగరానికి చేరుకొని అంతఃపురానికి దగ్గరగా ఉన్న తోటలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆగాడు. అలసట వలన ఆ యువకునికి నిద్ర పట్టింది.

 మంత్రి కుమార్తె పేరు విషయ. ఆమె అదే సమయంలో ఈ యువకుడు విశ్రాంతి తీసుకుంటున్న తోటలోకి వచ్చింది.
ఈ యువకుడి అందానికి దిగ్భ్రాంతి చెందింది విషయ. ఆమె అతని దగ్గరికి వెళ్లి అతని దగ్గర ఉన్న ఉత్తరాన్ని చూసింది. ఆ ఉత్తరాన్ని నిదానంగా బయటికి తీసి చదివింది. తన తండ్రి అతనిని ఎందుకు చంపమన్నాడో అర్థంకాలేదు.

 విషయ అతన్ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. చెలికత్తెలతో విషయ ఆలోచించి ఆ లేఖలో "విషము" అనే పదాన్ని "విషయ" అనే పదంగా మార్చింది.

ఇప్పుడు ఆ లేఖలోని భావం ఏమిటంటే "ఈ లేఖ తెచ్చినవానికి విషయనిమ్ము."
విషయ ఆ లేఖను మరల అతని దగ్గర పెట్టేసి తన భవనానికి వెళ్ళిపోయింది.
ఆ యువకుడు ఆ లేఖను మంత్రి కుమారుడి చేతికి ఇచ్చాడు. మంత్రి కుమారుడు తన చెల్లెలికి అంత తొందరగా ఎందుకు వివాహం చేయాలి అని ఆశ్చర్యపోయాడు.

ఎంతైనా అతను మంత్రి కుమారుడు కదా, లేఖ తెచ్చిన యువకుణ్ణి "ఈ లేఖ ఇచ్చి మా నాన్నగారు నీకు ఇంకేమైనా చెప్పమన్నారా?"అని అడిగాడు.

ఆ యువకుడు "ఈ లేఖ ఇచ్చినందువల్ల నాకు మంచి జరుగుతుందని చెప్పామన్నారు." అని అన్నాడు.
వెంటనే మంత్రి కుమారుడు ఆ యువకునికి, తన చెల్లెలికి వివాహం జరిపించాడు.

వివాహ వేడుకలు జరుగుతుండగానే బొమ్మరాయుడు ఇంటికి తిరిగి వచ్చాడు. అక్కడ ఉన్న పరిస్థితులకి అతను ఆశ్చర్యపడి తన కొడుకుని వివరాలు అడిగాడు. "మీరు లేఖలో రాసినట్టుగా వారిద్దరికీ వివాహం జరిపించాను." అని మంత్రి కుమారుడు చెప్పాడు.

అది విన్న మంత్రి ఆ లేఖను ఒకసారి తీసుకురమ్మన్నాడు. ఆ లేఖలో తాను "విషము" అని రాసినదాన్ని "విషయ"గా మార్చబడి ఉన్నది.

ఆ తరువాత బొమ్మరాయుడు "తేలుకుట్టిన దొంగలాగా" నిశ్శబ్దముగా ఉన్నాడు.

కొద్ది రోజులలోనే రాజు మాల్యవంతుడు ఆ యువకుడి తెలివితేటలను గుర్తించి తన కూతురుని ఆ యువకునికిచ్చి వివాహం చేశాడు.

ఈ విధంగా మాల్యవంతుడి తరువాత ఈ యువకుడు రాజయ్యాడు, మంత్రి కుమారుడు మంత్రి అయ్యాడు.
అందుకనే అదృష్టవంతుల్ని ఎవరూ చెరపలేరు అని అంటారు.

అందుకే అన్నారు పెద్దలు "తేలుకుట్టిన దొంగ" అని.

అంటే ఎవరైనా ఏదైనా తప్పు చేసి ఆ తప్పు వలన వారికే బాధకలిగినా దానిని బయటపెట్టకుండా దాచి ఉంచితే ఈ సామెతని ఉపయోగిస్తారు.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Sunday, May 16, 2021

Grandma Stories Telugu Story

 Grandma stories presents you telugu stories

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,

అవంతీ నగర రాజ్యం విశాలమైనదని, మనోహరమైనదని పొరుగు రాజ్యాల్లో బాగా పేరుంది. ఆ రాజ్యాన్ని పాలించే రాజు మహేంద్రవర్మ ప్రజలని తన బిడ్డల్లా చూసుకుంటాడని అందరూ అనుకుంటారు. 

ఒకసారి రాజు మహేంద్రవర్మ అంతఃపురంలో వజ్ర వైడూర్యాలు, రత్నాలతో పొదిగిన ఒక బంగారు నగ దొంగతనం జరిగింది.
"అరెరే!! ఏంతో సుభిక్షమైన శాంతి సామరస్యాలతో ఉండే నా రాజ్యంలో ఇంత పని ఎవరు చేశారు!" అని చాలా బాధపడ్డాడు మహేంద్రవర్మ.
వెంటనే రాజు తన మంత్రి సులోచనుడిని పిలిచి విషయం వివరించి ఆ నగ దొరికేటట్టుగా చర్యలు చేపట్టమని మంత్రిగారిని రాజు ఆదేశించాడు. 

మంత్రిగారు బాగా ఆలోచించి ఎవరు లోపలికి రాలేని అంతఃపురంలో దొంగతనం జరిగిందంటే పనివాళ్లే చేసుంటారని మంత్రి భావించాడు.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,

ఆ మరునాటి ఉదయం పనివాళ్ళందరూ రాగానే మంత్రి వాళ్లందరికీ నాలుగు అంగుళాల చీపిరి పుల్ల ఇచ్చాడు.

మంత్రి ఈ విధంగా చెప్పాడు, "ఈ చీపురు పుల్లని మీరు ఒక్కొకటి తీసుకుని ఆ గదిలో పెట్టి రావాలి. ఎవరైతే దొంగతనం చేశారో వారి చీపురు పుల్ల ఒక అంగుళం పెరుగుతుంది."

పనివాళ్ళందరూ ఆ విధంగా చీపురు పుల్లని లోపల పెట్టారు. నిజంగా దొంగతనం చేసిన పనివాడు చీపురుపుల్లని ఒక అంగుళం ముక్క తుంచి లోపల పెట్టాడు. అందరి ముక్కలు నాలుగు అంగుళాలు ఉంటే దొంగతనం చేసినవాడు చీపురు పుల్ల మూడు అంగుళాలు ఉంది.

ఈ విధంగా దొంగ బయటపడ్డాడు.

రాజు మంత్రిని అభినందించాడు.

అందుకే అన్నారు పెద్దలు " గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు."

అంటే ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయాన్ని తనకి అన్వయించుకోవటాన్ని ఈ సామెత రూపంలో చెప్పారు.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Recent posts

The Big Fat Cat And The Mice: A Great Idea

The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...

Popular posts