Perasa Perayya Telugu Stories Grandma Stories
Grandmas Stories presents you telugu stories
పేరాశ పేరయ్య
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Perasa Perayya Telugu Stories Grandma Stories |
శ్రీరంగపురిలో పేరాశ పేరయ్య అనే ఒక పేరాశాపరుడు ఉండేవాడు. అతను నిత్యావసర సరుకుల వ్యాపారం చేసేవాడు. ఆ మొత్తం ఊరికి పేరాశ పేరయ్య ఒక్కడే సరుకులు అమ్మేవాడు, ఇక అతని అన్యాయానికి అడ్డు, ఆపు లేదు. నాణ్యమైన సరుకుని కల్తీ చేసి అమ్మేవాడు. పాలలో నీళ్లు కలిపేవాడు, బియ్యంలో వడ్లు కలిపేవాడు, ఇలా ప్రతీది కల్తీ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించేవాడు.
ఆ ఊరిలో అందరికీ పేరాశ పేరయ్య గురించి బాగా తెలుసు. అతను పిల్లకి బిచ్చం వెయ్యడని, పరమ పిసినారి అని.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Perasa Perayya Telugu Stories Grandma Stories
ఒక రోజు పేరాశ పేరయ్య పక్క ఊరికి వెళుతూ దారి మధ్యలో ఉన్న అడవిలో దారి తప్పిపోతాడు. అక్కడ తిరిగి ఊరికి దారి వెతుకుతూ తిరుగుతుండగా ఒక గుహ కనిపించింది. అది ఏమిటా అని అందులోకి వెళ్లి చూస్తాడు పేరయ్య. అక్కడ లోపలి కొద్ది దూరం వెళ్ళగానే అతని కళ్ళు మూసుకునేంత మెరుపులాగా కాంతివంతంగా ఉంది. పేరాశ పేరయ్య అది ఏమిటా అని ఆత్రంగా వెళ్లి చూస్తాడు అతని కళ్ళు నమ్మలేకపోయేటంత బంగారం, వజ్రాలు, వైఢుర్యాలు, కుప్పలుగా పోసి ఉన్నాయి.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Perasa Perayya Telugu Stories Grandma Stories
ఇంకేముంది పేరాశ పేరయ్య తన బుద్ధి బయటపెట్టుకుంటాడు. తాను అడవిలో దారి తప్పిన విషయం కానీ, మళ్ళీ ఎలా ఇంటికి చేరుకోవాలని కానీ గుర్తురాలేదు పేరయ్యకు.
త్వర త్వరగా తాను తీసుకోగలిగినన్ని నగలు వజ్రాలు, తీసుకుని అక్కడి నుంచి బయటికి వస్తాడు.
నిదానంగా దారి చూసుకుంటూ తిరిగి అడవిలోంచి ఉరి దారిలోకి వస్తాడు. ఇలా వచ్చేటప్పుడు మోయలేక కొంచెం కొంచెం అక్కడక్కడా తాను తీసుకున్న బంగారు వస్తువులను విడుస్తూ వస్తాడు.
ఇక్కడ విషయం ఏమిటంటే ఆ గుహలో బంగారం వజ్రాలు ఆ ప్రాంతంలోని పేరుమోసిన గజ దొంగలవి, వాళ్ళు కొల్లగొట్టిన దొంగ సొమ్మంతా ఆ గుహలో పెట్టి పోతుంటారు. పేరయ్య గుహలోకి వెళ్లిన సమయంలో వాళ్ళందరూ ఎక్కడో దారి దోపిడీ చేయటానికి వెళ్ళటంవల్ల పేరయ్య అక్కడి నుండి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇది తెలియని పేరయ్య దారి పొడుగునా ఆ బంగారు వస్తువులు వదులుతూ వెళ్ళాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Perasa Perayya Telugu Stories Grandma Stories
ఎలాగో అలాగా పేరయ్య ఇంటికి చేరుకుంటాడు. తాను దారిలో పడవేస్తూ ఇంటికి తెచ్చుకున్న సొమ్ము పేరయ్యకు తృప్తినీయలా. సరే తాను ఎలగూ కొంత బంగారు నాణేలు, నగలూ, దారిలో వదులుతూ వచ్చాడు కదా, ఈ సారి దారి వెతుక్కుంటూ మళ్ళీ వెళ్లి బండెడు సొమ్ము తెచ్చుకుందామనుకుంటాడు.
కానీ పేరయ్యకు తెలియని విషయం ఏమిటంటే అక్కడ ఆ గజ దొంగలు గుహకి తిరిగి చేరుకుని దారిలో వదిలిన గుర్తులు చూసి ఎవరో వారి గుహకి వచ్చి కొంత సొమ్ము తీసుకుని వెళ్లారు అని అర్థం అయింది.
కానీ వాళ్ళు త్వరపడకుండా వేచి ఉన్నారు, ఆ గుర్తుకు పెట్టుకుని వెళ్లినవాడు తిరిగి వస్తే పట్టుకుని చంపేద్దామని అనుకున్నారు.
ఇది తెలియని పేరయ్య ఒక బండి కట్టుకుని తిరిగి ఆ దారిలోనే వెతుక్కుంటూ వెళ్తాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Perasa Perayya Telugu Stories Grandma Stories
గుహకి దగ్గరకు వస్తుండగా పేరయ్యకి పెద్దగా మాటలూ, అరుపులూ వినిపిస్తాయి. దానితో పేరయ్య ఆగి బండి పెక్కన పొదల్లో పెట్టి గుహ దగ్గరకు వెళ్లి చూస్తాడు.
అక్కడ గజ దొంగలు వారి దోపిడీ సొమ్ము లెక్కపెడుతూ ఆ గుహలోకి వచ్చి వెళ్లినవాడు తిరిగి వస్తే వాడిని ఎలా చంపాలా అని మాట్లాడుకొవటం పేరయ్య విని అక్కడి నుంచి మెల్లగా బండి దగ్గరికి చేరుకొని బతుకుజీవుడా అంటూ తన ఇంటికి చేరుకుంటాడు.
మొత్తానికి తన పేరాశ తనకు ఎంత గతి పట్టించేదో తెలుసుకుని ఇంక నుంచి తనకు ఉన్నదానితో తృప్తిగా ఉండాలనుకుంటారు పేరాశ పేరయ్య.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Perasa Perayya Telugu Stories Grandma Stories
అతనిలో వచ్చిన మంచి మార్పుకు కారణం తెలియని ఊరి ప్రజలు ఆనందిందించారు, కానీ పేరయ్యని మాత్రం పేరాశ పేరయ్య అని పిలవటం మాత్రం ఆపలేదు.
అందుకే అన్నారు పెద్దలు "పేరాశ పనికిరాదని"
అంటే మనకి ఉన్నదానితో తృప్తిగా ఉండాలి, ఆశ ఉండాలి కానీ పేరాశ పనికిరాదు, అది ప్రాణాంతకం అని అర్థం.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Perasa Perayya Telugu Stories Grandma Stories
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀