An Intelligent Host Telugu Stories Grandma Stories
Grandmas Stories presents you telugu stories
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, An Intelligent Host Telugu Stories Grandma Stories
ఒకటిని రెండు రెండుని ఒకటి
పూర్వం కుంతల దేశంలోరామి శెట్టి అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను చాలా బాగా వ్యాపారం చేసేవాడు. అతని వ్యాపార మెళకువల కు సాటి వర్తకులు ఎంతో ఆశ్చర్యపోయేవారు. అతని వ్యాపార నైపుణ్యం ఎంతటిదంటే అతని దగ్గర కొనటానికి వచ్చిన వారు అందరూ తప్పకుండా కొనుగోలు చేయవలసిందే ఆ విధంగా అందరినీ తన మాటల ప్రభావంతో బుట్టలో పడేసేవాడు. ఒక రోజున రామి శెట్టి వాళ్ళ బంధువు కాశీ అనే అతను వాళ్ళ దుకాణానికి వచ్చాడు.
అప్పుడు మధ్యాహ్న భోజన సమయం. రామి శెట్టి అతని బంధువు కాశీని భోజనం చేయటానికి వాళ్ళింటికి తీసుకువెళ్లాడు. కాశీ రాకకు రామి శెట్టి అతని భార్య చాలా సంతోషించారు. కొంత సమయం తరువాత రామి శెట్టి తన భార్యతో ఒకటిని రెండు రెంటిని ఒకటి చేయమన్నాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, An Intelligent Host Telugu Stories Grandma Stories
వచ్చిన బంధువుకు అది ఏమిటో అర్థం కాలేదు. ఎదో ఒకటి మాట్లాడుతూ రామి శెట్టి మరియు కాశీ సాయంకాలం ఆరు గంటలవరకూ కూర్చున్నారు. అప్పుడు రామి శెట్టి భార్య "ఏమండీ వంట సిద్ధమయ్యింది, భోజనానికి ఇద్దరూ రండి" అని అన్నది.
ఇద్దరూ భోజనం చేసారు. కాశీ తిరిగి ప్రయాణం అవుతూ రామి శెట్టిని ఈ విధంగా అడిగాడు, " ఇందాక మీరు మీ భార్యతో మాట్లాడేటప్పుడు ఒకటిని రెండు రెంటిని ఒకటి చేయమన్నారు, దాని అర్థం ఏమిటో నాకు తెలియలేదు దయచేసి నాకు వివరించండి.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, An Intelligent Host Telugu Stories Grandma Stories
అది విన్న రామి శెట్టి నవుతూ అదేమీ పెద్ద విశేషం కాదు అయినా నీవు అడిగావు కాబట్టి నీకు వివరిస్తానన్నాడు. దానికి అర్థం ఏమిటంటే మొదటిది ఒకటిని రెండు చేయమనడం, అంటే రెండుపూటల భోజనాన్ని ఒక పూత భోజనంగా మార్చమనటం, అందువలనే సాయంకాలం ఆరు గంటలకి వడ్డించింది. ఇక రాత్రికి నువ్వు తినలేవు కదా!! రెండో విషయం ఒకటిని రెండుగా చేయమనటం దాని అర్థం ఏమిటంటే ఒకే కూరని రెండు రకాలుగా వండమనటం. అప్పుడు రెండు రకాల కూరలు వడ్డించినట్టుగా ఉంటుంది కదా.
అది విన్న కాశీ తెల్లమొహం వేసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀
No comments:
Post a Comment