TO DO OR NOT DO TELUGU STORIES GRANDMA STORIES
పైకి బాణం వేస్తే బ్రహ్మ హత్య, కిందకి బాణం వేస్తే గో హత్య
పూర్వం రత్నగిరి సామ్రాజ్యాన్ని బలభద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. ప్రజలని తన కన్నా బిడ్డల్లా చూసుకునేవాడు. అవసరమైనంతవరకే పన్నులు వేసేవాడు. దేశంలో ఉన్న ప్రజలందరూ తమ రాజ్యం రామరాజ్యంలా ఉందని భావించేవారు రత్నగిరి సామ్రాజ్యం ఆయురారోగ్యములతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో సుసంపన్నంగా వెలిగిపోతుండేది.
ఆ రాజ్యం పక్కనే ఉన్నటువంటి రాజ్యానికి రాజైనటువంటి కుతూహలుడికి రత్నగిరి సామ్రాజ్య వైభవం గురించి తెలిసి చాలా ఈర్ష్య అసూయ పడ్డాడు. కుతూహలుడు మంత్రులందరితో ఆలోచించిన తరువాత రత్నగిరి సామ్రాజ్యం మీదికి దండెత్తటానికి నిర్ణయించి సమర సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈ వార్త రత్నగిరి రాజైన బలభద్రుడికి తెలిసింది.
బలభద్రుడు తన మంత్రులతో సేనాధిపతులతో బ్రాహ్మణ సంఘాలతో కుతూహలుడు తమ సామ్రాజ్యం మీదకి దండెత్తే విషయం గురించి చర్చించాడు.
అక్కడ చర్చలో జరిగింది ఏమిటంటే ఇప్పుడు ఆ రాజుతో యుద్ధం చేస్తే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగని అతనితో సంధి చేసుకుంటే కుతూహలుడికి సామంతుడిగా ఉండాలి మరియు తన సామ్రాజ్య వైభవాన్ని అంతా అతను లాగేసుకుంటాడు. ఒక రోజంతా ఆలోచించినా ఈ విషయం గురించి సరైన నిర్ణయానికి రాలేకపోయాడు.
చివరిలో బ్రాహ్మణా సంఘ నాయకుడు లేచి ఒక మాట చెప్పాడు ప్రభు నేను చెప్పినట్టు చేస్తే మన రాజ్యం పోగొట్టుకొనవసరం లేదు. జనక్షయం, ధన నష్టం ఉండవు. రాజు బలభద్రుడు ఆ సలహా ఏమిటో చెప్పమన్నాడు.
బ్రాహ్మణ సంఘ నాయకుడు వివరంగా చెప్పసాగాడు. ప్రభు మేము బ్రాహ్మలణుము పదివేల మంది ఉన్నాము మాకు పదివేల ఆవులు ఇవ్వండి పదివేలు బాణాలు పదివేల విల్లంబులు ఇవ్వండి. అని చెప్పాడు, మిగిలిన విషయం మేము చేసుకుంటాం అన్నాడు.
దేశ సరిహద్దు దగ్గరికి ఈ పది వేల మంది బ్రాహ్మణులూ, పది వేల ఆవులూ, విల్లంబులూ బాణాలతో చేరుకున్నారు.
శత్రు సైన్యం బ్రాహ్మణుల దగ్గరికి చురుకునేసమయానికి పదివేల మంది బ్రాహ్మణులూ ఆవులపై ఎక్కి కూర్చుని విల్లంబుతో బాణాలు ఎక్కుపెట్టి యుద్ధానికి తయారయ్యారు.
పొరుగు రాజైన కుతూహలుడు ఎదురుగా ఆవులపైన బ్రాహ్మణులు బాణాలు ఎక్కుపెట్టి ఉండటం చూసి నిర్ఘాంత పోయాడు.
కుతూహలుడు తన మంత్రులతో సైనికులతో ఎదురుగా ఉన్న పరిస్థితిని గురించి చర్చించాడు.
అందరూ ఒకే మాట చెప్పారు, అది ఏమిటంటే, ప్రభు పైకి బాణం వేస్తే బ్రహ్మ హత్య జరుగుతుంది, కిందకి బాణం వేస్తే గోహత్య జరుగుతుంది.
యుద్ధం చేయలేమని కుతూహలుడితో చెప్పారు.
అప్పుడు కుతూహలుడు తన సైన్యాన్ని తీసుకుని వెనుదిరిగాడు.
బ్రాహ్మణులందరూ సంతోషంగా రత్నగిరి రాజైన బలభద్రుడి దగ్గరికి చేరుకొని వాళ్ళ విజయాన్ని ప్రకటించారు.
బలభద్రుడు వాళ్లందరినీ సన్మానించి బహుమతులిచ్చాడు.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀
No comments:
Post a Comment