KINDNESS IS A VIRTUE TELUGU STORIES GRANDMA STORIES
దయాగుణం ఎంతో గొప్పదని
Grandmas Stories presents you telugu stories
ఒకప్పుడు చాలా క్రూరమైన ఒక రాజు ఉండేవాడు. అతని దగ్గర చాలా మంది బానిసలూ ఉండేవారు. వాళ్ళని ఆ రాజు చాలా క్రూరంగా హింసించేవాడు. వాళ్ళని బాగా చూసేవాడు కాదు. వాళ్లలో ఒక బానిసను రాజు ఇంకా క్రూరంగా చూసేవాడు. అతనికి కొంతకాలానికి ఆరోగ్యం పాడైపోయింది. దానితో ఆతను ఆ రాజ్యం నుండి పారిపోయాడు. ఆలా పారిపోయి ఒక దట్టమైన ఆడవిలోకి వెళ్ళాడు.
ఆ అడవిలో ఒక గుహలో దాక్కున్నాడు. అప్పుడు ఆ గుహలో బాధతో పెద్దగా అరుస్తున్న సింహం కనిపించింది. అతనికి చాలా భయమేసింది. అయినా ధైర్యం చేసి సింహం దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఆ సింహం కాలిలో ముళ్ళు గుచ్చుకుని బాధతో అరుస్తుందని అర్థం అయ్యింది.
అప్పుడు ఆ బానిస సింహం కాలిలో ముల్లు తీసాడు. ముల్లు తీయగానే దాని బాధ తగ్గి అరవటం మానేసింది. ఇంతలో రాజు ఆ బానిసను వెతికి పట్టుకుని రమ్మని సైనికులను పంపించాడు.
ఆ సైనికులు అన్ని చోట్లా వెతికి చివరికి అడవిలో కూడా వెతకటం మొదలు పెట్టారు. అప్పుడు అడవిలో ఈ బానిస వాళ్ళకి కనిపించగానే పట్టుకుని రాజు దగ్గరికి తీసుకెళ్లి అప్పచెబుతారు.
అప్పుడు ఆ రాజు సైనికులతో ఇతనిని తీసుకువెళ్లి జనం ముందు నిలబెట్టి బాగా ఆకలిగా ఉన్న సింహం ముందు పడేయమని చెబుతాడు.
అతను ఆ రాజ్యంలోనుంచి పారిపోయినందుకు ఈ శిక్ష విధిస్తున్నాను అని చెప్పాడు. ఆ రాజు ఆజ్ఞ ప్రకారం సైనికుడు వెళ్లి బోనులో ఉన్న సింహాని తెచ్చి ఈ బానిసని దానికి ఆహారంగా నిలబెట్టాడు.
ఆ బానిస ఇంక తనకి చావు తథ్యం అని అనుకున్నాడు. కానీ ఆ సింహం ఇంతకుముందు అతను ఆ అడవిలో కాపాడిన సింహం.
ఆ సింహం ఈ బానిసని చూడగానే గుర్తుపట్టి అతన్ని చంపకుండా అతని దగ్గరికి వెళ్లి అతన్ని నాకటం మొదలుపెడుతుంది. ఎంతసేపటికీ ఆ సింహం అతన్ని చంపదు.
తనని కాపాడినందుకు ఆ బానిస దేవుడికి దణ్ణం పెట్టుకుంటాడు .
అప్పుడు ఆ రాజు ఆ బానిసని అడుగుతాడు, "ఆ సింహం నిన్ను ఎందుకు చంపలేదు అని"
అప్పుడు ఆ బానిస ఇంతకుముందు అడవిలో ఆ సింహాన్ని తాను కాపాడాడు, అందువల్ల ఆ సింహం అతన్ని ఏమీ చేయలేదు అని చెప్పాడు.
ఇది విన్న రాజు ఒక జంతువు ఇంత కరుణతో ప్రవర్తిస్తే, అతను ఇన్ని రోజులూ ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించాడా అని ఎంతో సిగ్గుపడి మార్పు చెంది మంచిగా మారతాడు.
అప్పటినుంచి ఆ రాజ్యంలో ప్రజలు అందరు సంతోషంగా ఉండసాగారు.
అందుకే అన్నారు పెద్దలు "దయాగుణం ఎంతో గొప్పదని"
అంటే ఎవరైనా ఏదైనా బాధలో ఉంటే వారికి దయతో సహాయం చేయాలి అని.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀
No comments:
Post a Comment