The Magic competition Grandma Stories Telugu stories
Grandmas Stories presents you telugu stories
గారడీవాడికే బురిడీ గారడీ
మాయా నగరి అనే ఊరిలో మాయలోడు అనే ఒక గారడీవాడు ఉండేవాడు. అతను ఎంతో గొప్ప గారడీలు చేసేవాడు. చూసేవారు వారి కళ్ళను వారే నమ్మలేకపోయేవారు. చెట్టును పక్షిగా మార్చేవాడు, పక్షిని, సింహంగా మార్చేవాడు, ఒక్కొక్కసారి తానే ఎన్నో వింత వింత ఆకారాలుగా మారి చూపించేవాడు.
కానీ అతనికి అతనికంటే గొప్ప గారడీవాడు ఈ భూమ్మీదే లేడని చాలా గర్వం.
మాయలోడు ఎన్నో రాజాస్థానాలలో ప్రదర్శనలు చేశాడు. కొన్ని రోజలకి అతనిలో ఇంత శక్తి ఉండి గారడీలు చేసుకుంటూ బ్రతకటం ఏమిటి తాను తలుచుకుంటే ఈ భూమినే తనకు నచ్చినట్టు ఆడించవచ్చు కదా అనే దురాలోచన పుట్టింది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, The Magic competition Grandma Stories Telugu stories |
ఆలా ఎన్నో రాజ్యాలు వాడి సొంతమయ్యాయి. ఇక మాయాపురి వంతు వచ్చింది. మాయాపురి కూడా గారడీ వాళ్ళకి పేరుపొందింది. కానీ మాయలోడు గారడీ స్థాయి వారెవరికీ లేదు. మాయలోడు గారడీ పోటీ రోజు రానే వచ్చింది. మాయాపురిలోని గారడీ వాళ్ళందరూ అక్కడికి వచ్చి పాల్గొన్నారు గట్టి పోటీ ఇస్తున్నారు కానీ గెలవలేకపోతున్నారు.
మిగిలిన రాజ్యాల రాజులందరూ మాయాపురి గారడీవాళ్ళ శక్తి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, The Magic competition Grandma Stories Telugu stories |
సరే అని మాయాపురిలోని గారడీ వాళ్ళందరూ సమావేశం అయ్యారు, ఈ మాయలోడిని ఎలా ఓడించాలి అని అందరూ కలసి ఆలోచించసాగారు. ఈ మాయలోడిని వారు తప్ప ఇంక ఎవరూ ఓడించలేరని వారికీ తెలుసు, అందరు కలసి మరుసటి రోజు ఉదయం పోటీకి బురిడీ అనే గారడీ వాడిని పంపాలని అనుకున్నారు. వాడు ఎంతో తెలివైనవాడు, సమయస్ఫూర్తి కలవాడు.
తరువాత రోజు ఉదయం బురిడీ మాయలోడుతో పోటీకి వచ్చాడు. మాయలోడు ఎప్పటిలాగే తన అద్భుతమైన విద్యలు ప్రదర్శించటం మొదలుపెట్టాడు. బురిడీ కూడా వాడికి తగిన విధంగా సమాధానమిస్తున్నాడు. ఒకరు నీళ్లలోంచి నిప్పు పుట్టిస్తే, ఇంకొకరు, గాలిలోంచి భవనం సృష్టించారు. ఒకరు పిల్లిని ఎలుక చేస్తే, ఇంకొకరు, ఎలుకని చిలుక చేశారు ఇలా ఒకరినిమించి ఇంకొకరు గారడీ విద్యను ప్రదర్శిస్తున్నారు. మధ్యాహ్న సమయానికి మాయలోడు ఇక లాభం లేదనుకుని తాను కుర్చీ, కుందేలు, ఇంకా కొన్ని రకాల వస్తువులుగా మారి చూపించాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, The Magic competition Grandma Stories Telugu stories |
గెలవాలన్న తొందరలో మాయలోడు ఏమీ ఆలోచించకుండానే వెంటనే చిన్న లడ్డూగా మారిపోయాడు.
ఇంకేముంది బురిడీ వెంటనే లడ్డూని తీసుకుని తన నోట్లో వేసుకున్నాడు.
ఇక మాయలోడు లేదు, వాడి దురాశతో కూడిన సవాల్ లేదు !!!!!
అందరూ బురిడీ తెలివికి మెచ్చుకున్నారు. ఇప్పటిదాకా మాయలోడు గెలుచుకున్న రాజ్యాలన్నీ ఎవరివో వారు తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
అందరూ కలసి బురిడీకి బోలెడంత సొమ్ము, అతను జీవితాంతం ఏ రాజ్యంలోనైనా రాజ మర్యాదలతో జీవించవచ్చు అని గొప్పగా సన్మానించారు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, The Magic competition Grandma Stories Telugu stories |
చూశారా పిల్లలూ తన దగ్గర అంత శక్తి, విద్యా ఉండి, మాయలోడు గర్వం, దురాశతో, తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు.
hi grandmas stories I am from Canada your site is a delight to read thank you 👍👍
ReplyDelete