Monday, June 21, 2021

MORAL STORY GRNADMA STORIES TELUGU STORIES

MORAL STORY  GRNADMA STORIES TELUGU STORIES

Grandmas Stories presents you telugu stories

అనుభవిస్తే తప్ప నొప్పి  తెలియదు

చిత్రపురం అనే ఊరిలో ఒక అల్లరి పిల్లాడు ఉండేవాడు. అతని పేరు నరేష్. అతనికి అన్నీ మంచి గుణాలే కానీ ఒకే ఒక్క చిన్న చెడు అలవాటు ఉండేది. అదేమిటంటే ఎవరినైనా మారుపేర్లు పెట్టి పిలుస్తుండేవాడు. అది అవతలి వాళ్ళకి ఎంత బాధ కలిగిస్తుందో అతనికి అర్థం అయ్యేది కాదు. 

నరేష్ మిగిలిన విషయాలలో మంచిగా ఉండేవాడు. పెద్దలని గౌరవించేవాడు, చిన్నలని చక్కగా ఆడించేవాడు. అందువలన ఎవరూ ఏమీ అనేవారు కారు, సరేలే అని సర్దుకుపోయేవారు.

ఆ ఉరిలో పాఠశాలలో పనిచేయటానికి కొత్తగా ఒక మాష్టారు వచ్చారు. అతని కూతురు రవళి ఆమె చిన్నదైనా చాలా తెలివైనది. రవళి కొంచెం పొట్టిగా ఉంటుంది. 
ఒక రోజు రవళి పాఠశాల నుంచి ఇంటికి వెళుతుంటే అక్కడే ఉన్న నరేష్ రవళిని చూసి "పొట్టి పిల్ల నీ పేరేంటి?" అని అడిగాడు. 

దానికి రావాలి ఎంతో కోపం వచ్చింది, కానీ ఎందుకులే అని ఇంటికి వెళ్ళిపోయింది. 

తరువాత రోజు నరేష్ గురించి అడిగి తెలుసుకుని అతన్ని మార్చాలని అనుకుని సాయంత్రం ఇంటికి వెళ్లే సమయానికి కొంత మంది పిల్లలతో అతను వెళ్లే దారిలో ఆడుకుంటూ నరేష్ అక్కడికి వచ్చే సమయానికి అతన్ని ఒక్కొక్కరూ ఒక్కొక్క పేరుతో పిలవటం మొదలుపెట్టారు. 

ఆలా పిలుస్తూండేసరికి నరేషుకి ఏడుపాగలేదు. అప్పుడు నరేషుకి అర్థమయ్యింది అవతలివారిని అలా పేర్లు పెట్టి పిలిస్తే ఎంత బాధ కలుగుతుందో. అప్పటినుంచి నరేష్ ఎవరినీ అలా పేర్లు పెట్టి పిలవకుండా అందరినీ వారి పేర్లతోనే పిలిచి చక్కగా ఉండటం మొదలుపెట్టాడు. 

అందుకే అన్నారు పెద్దలు "అనుభవిస్తే తప్ప నొప్పి  తెలియదు." అని. 

ఎవరినైనా నొప్పిస్తే ఆ నొప్పి వారికి వచ్చేదాకా తెలియదు.  


Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀




No comments:

Post a Comment

Recent posts

The Big Fat Cat And The Mice: A Great Idea

The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...

Popular posts