Grandmas stories presents you telugu stories
Grandma's Stories welcomes you with stories for everyone. Telugu stories, moral stories in telugu, proverbial stories in telugu, telugu jaanapada kathalu, telugu folk stories, telugu neeti kathalu, animal stories in telugu, anecdotal stories in telugu,
Saturday, May 8, 2021
Thursday, May 6, 2021
Slow And Steady Wins The Race: The Cliché But From Grandma Stories | Grandma Telugu Stories Hare And Tortoise
నిదానమే ప్రధానం
దండకారణ్యం అనే అడవిలో అన్ని జంతువులూ చక్కగా కలసి మెలసి ఉండేవి. ఆ అడవికి రాజైన సింహం తన ప్రజలైన అన్ని జంతువులని చాలా బాగా చూసుకునేది.
ఆ ఆడవిలోకి ఒక కుందేలు కొత్తగా వచ్చింది. దానికి తాను అత్యంత వేగంగా పరుగెత్తగలదని ఎంతో గర్వం. ఒకరోజు చెరువులో నీళ్లు తాగుతుంటే ఒక తాబేలు అటువైపుగా నెమ్మదిగా నడుచుకుంటూ రావటం కనిపించింది. ఇంకేముంది అసలే గర్విష్టైన కుందేలు తాబేలుని చూసి నవ్వటం మొదలుపెట్టింది.
తాబేలు, "మిత్రమా!! ఎందుకు నవ్వుతున్నావ్ ?" అని అడిగింది.
అప్పుడు గర్విష్టి కుందేలు తాబేలు దగరికి వెళ్లి వేళాకోళంగా ఇలా అనసాగింది, " సరదాకి మనం ఇద్దరం ఒక పరుగు పందెం పెట్టుకుందాం, ఆ పరుగు పందెంలో గెలిచినవారికి ఒక సంవత్సరంపాటు ఓడిపోయినవారు ఆహారం తెచ్చిపెట్టాలి." అని.
దానికి తాబేలు సరే!! అంది.
ఈ వార్త క్షణాల్లో అడవిలోని జంతువులన్నిటికి తెలిసింది. ఇంక పోటీ తేదీ, స్థలం, పోటీ ఎక్కడినుంచి ఎక్కడికి అని నిర్ణయించారు. గర్విష్టి కుందేలు తనకు సాటి పోటీ లేదు అనుకోని ఇంక సంవత్సరం పాటు తాను ఆహారం కోసం వెతకాల్సిన పనిలేదని కలలు కనసాగింది.
కళ్ళు మూసి తెరిచేసరికి పోటీ రోజు రానే వచ్చింది. అనుకున్న సమయానికి అనుకున్న స్థలానికి గర్విష్టి కుందేలు, తాబేలు ఇంకా అడవిలోని జంతువులన్నీ చేరాయి.
సింహం న్యాయనిర్ణేతగా పోటీ మొదలైంది, చూస్తుండగానే కుందేలు దూసుకుపోయింది.
గర్విష్టి కుందేలు "కాస్త అలసట తీర్చుకుందాం!! ఆ సోంబేరి తాబేలు ఎప్పటికి నన్ను దాటేను," అని ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకుందామని ఆగింది. ఇంకేముంది అప్పటికే పరిగెత్తి అలసిన గర్విష్టి కుందేలుకి మంచి నిద్ర వచ్చి నిద్రపోయింది.
మరి తాబేలేమో! నిదానంగా ఎక్కడా ఆగకుండా పోటీ గమ్య స్థలానికి చేరుకొని తన పరుగు పూర్తిచేసింది. విచిత్రమేమిటంటే తాబేలుకి కుందేలు ఎక్కడ కనిపించలేదు.
ఇంతలో కుందేలుకి మెలుకువ వచ్చి గమ్య స్థలానికి పరుగెత్తి వెళ్ళింది. అప్పటికే అక్కడి చేరుక్కన్న తాబేలును చూసి ఆశ్చర్యపోయింది.
పోటీ ముగియటంతో సింహం తాబేలుని పోటీ విజేతగా ప్రకటించింది. అడవిలోని జంతువులన్నీ ఆనందంతో చప్పట్లు కొట్టి తాబేలుని మెచ్చుకున్నాయి.
గర్వభంగమైన కుందేలు తాబేలుకి క్షమాపణలు చెప్పి ఆ సంవత్సరమంతా తానే తాబేలుకి ఆహారం తెచ్చి పెట్టి తన తప్పు సరిదిద్దుకుంది.
అందుకే అన్నారు పెద్దలు, "నిదానమే ప్రధానం" అని.
చూసారా పిల్లలూ!! ఆ గర్విష్టి కుందేలు చివరికి నిదానమే ప్రధానం అని తెలుసుకుంది.
ఈ సామెత కథ మీ అందరూ చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀
Do You Know The Story Of An Ambitious Student? NO, Then Continue Reading........ Telugu Stories Grandma Stories Must Read Stories
Grandmas Stories presents you telugu stories
చెరపకురా చెడేవు
శారదా విద్యానికేతన్లో ఆరవ తరగతి చదువుతున్న రాము ఎప్పుడూ క్లాస్ లో ఫస్ట్ రాంక్లో నిలుస్తుండేవాడు. అదే తరగతిలో ఉన్న సోము ఎంత చదివినా సెకండ్ రాంక్ వస్తుండేది. అది రాము పట్ల సోముకి అసూయని కలిగించింది.
అప్పుడు సోము ఎలాగైనా రాముకి ఫస్ట్ రాంక్ రాకుండా చేయాలని ఆలోచించసాగాడు. మెల్లగా రాముతో స్నేహం చేయసాగాడు. ఆలా రోజు సోము రాము వాళ్ళింటికి వెళ్లి ఆడుకుందాం అంటూ రాముని చదవనీయకుండా ఆటలాడుకుంటూ కాలం గడిపేలా చేయసాగాడు.
సోము ఇంటికి వెళ్లి రాత్రంతా కూర్చుని చదువుకునేవాడు.
ఇంతలో త్రైమాసిక పరీక్షలు వచ్చాయి. సోము ఈసారి క్లాస్ ఫస్ట్ తనదే అని ధీమాతో ఉన్నాడు.
సోము ఆత్రంగా ఎదురుచూస్తున్నా త్రైమాసిక పరీక్షా ఫలితాలు రానే వచ్చాయి.
ఆశ్చర్యంగా ఈసారి కూడా ఏకసంథాగ్రాహి రామునే క్లాస్ ఫస్ట్ వచ్చాడు.
సోముకి ఫోర్త్ రాంక్ వచ్చింది. ఇంక సోముకి ఏడుపాగలేదు.
అలా ఏడుస్తూనే రాము దగ్గరికి వెళ్లి సోము ఏడుపు, ఆశ్చర్యం, ప్రశ్నింపు కలసిన స్వరంతో,"నువ్వు రోజు నాతో ఆడుకున్నావు కదా నీకు ఫస్ట్ రాంక్ ఎలా వచ్చింది????" అని అడిగాడు .
అప్పుడు రాము," నేను టీచర్ చెప్పేటప్పుడే ఏంతో శ్రద్ధగా విని దానిని మననం చేసుకుంటూ ఉంటాను. పరీక్షల ముందు ఇంకొక సారి తిరిగి చదువుతాను. అదే పరీక్షల్లో రాస్తాను." అని చెప్పాడు.
అప్పుడు సోము "చెరపకురా చెడేవు!!" అని అర్థం చేసుకుని ఇంకెప్పుడూ తన బాగు కోసం ఎవరినీ తప్పుదారి పట్టించకూడదని అనుకున్నాడు.
అందుకే అన్నారు పెద్దలు,"చెరపకురా చెడేవు!" అని.
ఈ సామెత కథ మీ అందరూ చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀
Monday, May 3, 2021
10 Most Commonly Used Telugu Proverbs
10 Most Commonly Used Telugu Proverbs
- ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట!!
- ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా!!
- మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు!!
- కందకు లేని దురద కత్తిపీటకా!!
- ఆడలేనమ్మా మద్దెలు ఓడు అన్నట్టు!!
- ఇంట్లో పిల్లి వీధిలో పులి!!
- ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరౌతారు!!
- చెరపకురా చెడేవు!!
- ఎవరు తీసిన గోతిలో వారే పడతారు!!
- ఆలస్యం అమృతం విషం!!
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀
Don't Do This Mistake In Friendship | Telugu Stories From Telugu saamethalu Grandma Stories
Grandmas stories presents you telugu stories
పిల్లలూ!!! తెలివిగా తన మిత్రునికి బుద్ధి చెప్పిన సోమయ్య కథ వింటారా! సరే ఇంక కథలోకి వెళదామర్రా!!!
కమలాపురంలో సోమయ్య, భీమయ్య అనే ఇనుప వ్యాపారస్తులు ఉండేవారు. సోమయ్య ఒకసారి కాశీకి వెళుతూ తన దగ్గర ఉన్న ఇనుమంతా భీమయ్య దగ్గర పెట్టి బధ్రపరచమన్నాడు. ఇంక సోమయ్య నిశ్చింతగా కాశీకి వెళ్ళాడు.
సోమయ్య కాశీకి వెళ్లిన కొంత కాలానికి ఇనుము రేటు పెరగటంతో భీమయ్యలో అత్యాశ పుట్టి సోమయ్య ఇనుము కూడా అమ్మేశాడు.
ఇంతలో కాశీ నుంచి తిరిగి వచ్చిన సోమయ్య తన ఇనుముని తనకు తిరిగి ఇమ్మని భీమయ్యని అడిగాడు.
అప్పుడు భీమయ్య ఏమీ ఎరగనివాడల్లే, "అయ్యయ్యో!! ఏమి చెప్పను సోమయ్య! నేను ఎంతో భద్రంగా పెట్టిన నీ ఇనుమంతా ఎలుకలు తినేశాయి!!" అని అన్నాడు.
స్నేహితుడి మోసం అర్థం చేసుకున్న సోమయ్య ఇంకేమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. తన మిత్రునికి బుద్ధి చెప్పాలనుకున్నాడు.
కొంత కాలం గడిచిన తరువాత సోమయ్య, తన ఇంటిలో శుభకార్యానికి భీమయ్యని రమ్మని పిలుస్తాడు. భీమయ్య వేరే పని వలన వెళ్లలేక తన కొడుకుని సోమయ్య ఇంటికి పంపుతాడు.
కొంత సేపు గడిచిన తరువాత సోమయ్య పరిగెత్తుకుంటూ భీమయ్య ఇంటికి వెళ్లి, "అయ్యయ్యో!! భీమయ్య ఎంత పని జరిగిందయ్యా!! మా ఇంటి బయట ఆడుకుంటున్న నీ కొడుకుని గద్దలు తన్నుకుపోయాయి. అరెరే! నేనేమీ చేయలేకపోయాను!!" అన్నాడు.
అప్పుడు భీమయ్య, "ఎక్కడైనా గద్దలు పిల్లల్ని ఎత్తుకుపోతాయా!!" అని సోమయ్యని అడుగుతాడు.
వెంటనే సోమయ్య, "ఎక్కడైనా ఎలుకలు ఇనుముని తింటాయా!!" అని భీమయ్యను అడుగుతాడు.
"కుక్క కాటుకు చెప్పు దెబ్బ" తిన్న భీమయ్యకు బుద్ధి వచ్చి సోమయ్య ఇనుము అమ్మగా వచ్చిన డబ్బంతా సోమయ్యకి ఇచ్చేస్తాడు.
ఇంతలో భీమయ్య కొడుకు ఇంటికి తిరిగి వస్తాడు. కొడుకుని ఆనందంగా దగ్గరికి తీసుకుని తనకి బాగా బుద్ధి చెప్పిన తన మిత్రుడు సోమయ్యని మెచ్చుకుంటాడు.
అందుకే అన్నారు పెద్దలు, "కుక్క కాటుకి చెప్పు దెబ్బ" అని.
ఒకరు ఎవరికైనా ఏదైన అపకారం తలపెడితే దానికి తగిన విధంగా బుద్ధి చెప్పటాన్ని ఈ సామెత రూపంలో చెప్పటం జరిగింది.
ఈ సామెత కథ మీ అందరూ చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.
Sunday, May 2, 2021
Greedy:To Be Or Not To Be .......Continue Reading This Story | Telugu Stories For Kids
Grandmas Stories presents you telugu stories
పిల్లలూ!! దురాశతో తనకున్న గొడ్డలిని కూడా పోగొట్టుకున్న రామయ్య కథ వింటారా!!! సరే కథ మొదలెడదాం!!!!
అనగనగా రాజాపురం అనే గ్రామంలో గోపయ్య, రామయ్య అనే వారు ఉండేవారు. గోపయ్య, రామయ్య ఇద్దరూ గ్రామానికి దగ్గరగా ఉన్న అడవిలో కట్టెలు కొట్టి పక్కనే ఉన్న టౌనులోని సంతలో ఆ కట్టెలు అమ్ముతూ ఉండేవారు. ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు సంతృప్తిగా బ్రతుకుతూ ఉండేవారు.
ఒక రోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళిన గోపయ్య చెట్టు ఎక్కి కొమ్మని గొడ్డలితో కొడుతుండగా అతని చేతిలో ఉన్న గొడ్డలి కాస్త జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది.
"అరెరే!! నాకున్న ఒక్కగానొక్క గొడ్డలి నదిలో పడిపోయింది ఇప్పుడు ఏమి చేయాలి భగవంతుడా" అనుకుంటూ బాధపడసాగాడు.
గోపయ్య మొర విని నదీ దేవతా ప్రత్యక్షమయ్యి ఒక బంగారు గొడ్డలిని చూపించి, "ఇదేనా నీ గొడ్డలి" అని అడుగుతుంది
అప్పుడు గోపయ్య ఆ గొడ్డలి తనది కాదు అని నిజాయితీగా చెప్తాడు.
అప్పుడు ఆ నదీ దేవత వెండి గొడ్డలిని గోపయ్యకి చూపించి, "ఇదేనా నీ గొడ్డలి" అని అడుగుతుంది.
అప్పుడు గోపయ్య ఆ గొడ్డలి తనది కాదు అని నిజాయితీగా చెప్తాడు.
అప్పుడు నదీ దేవత గోపయ్య నదిలో పారేసుకున్న గొడ్డలి చూపించి ఇదేనా నీ గొడ్డలి అని అడుగుతుంది.
నదీ దేవత చేతులో తన గొడ్డలి చూసి మురిసిపోయిన గోపయ్య ఎంతో ఆనందంగా అదే తన గొడ్డలి అని చెప్తాడు.
గోపయ్య నిజాయితిలికి మెచ్చిన నదీ దేవత ఎంతో సంతోషించి అతని గొడ్డలితోపాటు బంగారు, వెండి గొడ్డళ్లు కూడా అతనికి ఇస్తుంది.
ఆనందంగా ఇంటికి చేరుకున్న గోపయ్య జరిగిన కథ తన భార్యకి చెప్తాడు.
వారి మాటల్ని చాటుగా విన్న రామయ్య తాను కూడా నదీ దేవత దగ్గరినుంచి బంగారు గొడ్డలి తెచ్చుకుందామని అడవికి వెళ్లి చెట్టు ఎక్కి గొడ్డలి నదిలో పాడేసుకొని ఏడవసాగాడు.
అప్పుడు నదీ దేవత ప్రత్యక్షమయ్యి బంగారు గొడ్డలి చూపించి, "ఇదేనా నీ గొడ్డలి" అని అడిగినప్పుడు, "అవును తల్లి!! ఆ గొడ్డలి నాదే", అన్నాడు దురాశాపరుడు రామయ్య.
రామయ్య చెప్పిన అబద్ధానికి కోపం వచ్చిన నదీ దేవత గొడ్డలి ఇవ్వకుండానే అదృశ్యమైంది.
దాంతో రామయ్య నెత్తిన చేతులు పెట్టుకుని,"అయ్యయ్యో!!! తన దురాశే తనకు దుఃఖము తెచ్చింది" అని బాధపడ్డాడు.
అందుకే అన్నారు పెద్దలు,"దురాశ దుఃఖమునకు చేటు" అని.
అంటే ఇతరులని చూసి ఈర్ష్య పడి బాధపడుతూ ఉండేవాళ్ళని గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.'
Saturday, May 1, 2021
Are You Dreaming? - Be Careful And Read This Story | Must Read Telugu Stories Saamethalu
Gradamas Stories presents you telugu stories
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
వీరవాసరం అనే గ్రామంలో పురుషోత్తం అనే వ్యాపారి ఉండేవాడు. అతను చాలా అత్యాసాపరుడు. ఒకరోజు అతను దుకాణం నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అతనికి కింద పడి ఉన్న ఒక వంద రూపాయల నోటు కనిపించింది. వెంటనే పురుషోత్తం కళ్ళు మెరిసాయి. అటు ఇటు దొంగ చూపులు చూసి చటుక్కున వంద రూపాయల నోటు జేబులో పెట్టుకున్నాడు.
వంద నోటు దొరికిన ఉత్సాహంతో పురుషోత్తం ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో భోజనాల వెళ అవ్వటంతో భార్య భోజనానికి పిలిచి అతనికి ఇష్టమైనవన్నీ వడ్డించింది. తృప్తిగా తిని లేచిన పురుషోత్తం తనకి దొరికిన వంద నోటుని తడుముకుంటూ ఆనందంగా నిద్రపోయాడు.
నిద్రపోయిన పురుషోత్తంకి తనకి దొరికిన వంద నోటుతో ఒక లాటరీ టిక్కెట్టు కొని, ఆ టిక్కెట్టుకు ఒక కోటి రూపాయలు లాటరీ వచ్చినట్టు, చాలా డబ్బు సంపాయించినట్టు, భార్యకి బోలెడు నగలు కొన్నట్టు, కలగన్నాడు. ఇంతలో నోట్లు లెక్క పెట్టుకుంటుండగా చేతిలోని వంద నోటు ఎగిరిపోతుంటే పట్టుకోవటానికి ప్రయత్నించిన పురుషోత్తం మంచం మీద నుంచి దుబుక్కున నేల మీద పడ్డాడు. ఇంకేముంది కల తుర్రున మాయమైంది. కళ్ళు తెరిచిన పురుషోత్తం "ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం " అనుకుంటూ నిట్టూర్చాడు.
అందుకే అన్నారు పెద్దలు "ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం", అని
అంటే ఒక విషయం మొదలు కూడా అవకుండానే దాని గురించి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని అనుకోవటన్నే ఈ సామెత రూపంలో చెప్పటం జరిగింది.
ఈ సామెత కథ మీ అందరూ చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.
Meet you all soon with another interesting Telugu saametha story.
Recent posts
The Big Fat Cat And The Mice: A Great Idea
The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...
Popular posts
-
Perasa Perayya Telugu Stories Grandma Stories Grandmas Stories presents you telugu stories పేరాశ పేరయ్య stories for kids, telugu sametha...
-
TRUE FRIENDSHIP TELUGU STORIES GRANDMA STORIES Grandmas Stories presents you telugu stories నిజమైన స్నేహం ఎప్పటికీ నిలుస్తుంది stories for...
-
Grandma stories presents you telugu stories మెరిసేదంతా బంగారం కాదు అనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో పెద్ద చెరువుంది. ఆ చెరువులో బోలెడు...