Thursday, May 6, 2021

Slow And Steady Wins The Race: The Cliché But From Grandma Stories | Grandma Telugu Stories Hare And Tortoise

నిదానమే ప్రధానం

దండకారణ్యం అనే అడవిలో అన్ని జంతువులూ చక్కగా కలసి మెలసి ఉండేవి. ఆ అడవికి రాజైన సింహం తన ప్రజలైన అన్ని జంతువులని చాలా బాగా చూసుకునేది.


ఆ ఆడవిలోకి ఒక కుందేలు కొత్తగా వచ్చింది. దానికి తాను అత్యంత వేగంగా పరుగెత్తగలదని ఎంతో గర్వం. ఒకరోజు చెరువులో నీళ్లు తాగుతుంటే ఒక తాబేలు అటువైపుగా నెమ్మదిగా నడుచుకుంటూ రావటం కనిపించింది. ఇంకేముంది అసలే గర్విష్టైన కుందేలు తాబేలుని చూసి నవ్వటం మొదలుపెట్టింది.
తాబేలు, "మిత్రమా!! ఎందుకు నవ్వుతున్నావ్ ?" అని అడిగింది.

hare and tortoise story, tortoise wins, telugu stories, telugu stories for kids, telugu saamethalu


hare and tortoise story, tortoise wins, telugu stories, telugu stories for kids, telugu saamethalu







అప్పుడు గర్విష్టి కుందేలు తాబేలు దగరికి వెళ్లి వేళాకోళంగా ఇలా అనసాగింది, " సరదాకి మనం ఇద్దరం ఒక పరుగు పందెం పెట్టుకుందాం, ఆ పరుగు పందెంలో గెలిచినవారికి ఒక సంవత్సరంపాటు ఓడిపోయినవారు ఆహారం తెచ్చిపెట్టాలి." అని.


దానికి తాబేలు సరే!! అంది.


ఈ వార్త క్షణాల్లో అడవిలోని జంతువులన్నిటికి తెలిసింది. ఇంక పోటీ తేదీ, స్థలం, పోటీ ఎక్కడినుంచి ఎక్కడికి అని నిర్ణయించారు. గర్విష్టి కుందేలు తనకు సాటి పోటీ లేదు అనుకోని ఇంక సంవత్సరం పాటు తాను ఆహారం కోసం వెతకాల్సిన పనిలేదని కలలు కనసాగింది.


కళ్ళు మూసి తెరిచేసరికి పోటీ రోజు రానే వచ్చింది. అనుకున్న సమయానికి అనుకున్న స్థలానికి గర్విష్టి కుందేలు, తాబేలు ఇంకా అడవిలోని జంతువులన్నీ చేరాయి.
సింహం న్యాయనిర్ణేతగా పోటీ మొదలైంది, చూస్తుండగానే కుందేలు దూసుకుపోయింది.


గర్విష్టి కుందేలు "కాస్త అలసట తీర్చుకుందాం!! ఆ సోంబేరి తాబేలు ఎప్పటికి నన్ను దాటేను," అని ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకుందామని ఆగింది. ఇంకేముంది అప్పటికే పరిగెత్తి అలసిన గర్విష్టి కుందేలుకి మంచి నిద్ర వచ్చి నిద్రపోయింది.

hare and tortoise story, tortoise wins, telugu stories, telugu stories for kids, telugu saamethalu



మరి తాబేలేమో! నిదానంగా ఎక్కడా ఆగకుండా పోటీ గమ్య స్థలానికి చేరుకొని తన పరుగు పూర్తిచేసింది. విచిత్రమేమిటంటే తాబేలుకి కుందేలు ఎక్కడ కనిపించలేదు.


ఇంతలో కుందేలుకి మెలుకువ వచ్చి గమ్య స్థలానికి పరుగెత్తి వెళ్ళింది. అప్పటికే అక్కడి చేరుక్కన్న తాబేలును చూసి ఆశ్చర్యపోయింది.

hare and tortoise story, tortoise wins, telugu stories, telugu stories for kids, telugu saamethalu



పోటీ ముగియటంతో సింహం తాబేలుని పోటీ విజేతగా ప్రకటించింది. అడవిలోని జంతువులన్నీ ఆనందంతో చప్పట్లు కొట్టి తాబేలుని మెచ్చుకున్నాయి.


గర్వభంగమైన కుందేలు తాబేలుకి క్షమాపణలు చెప్పి ఆ సంవత్సరమంతా తానే తాబేలుకి ఆహారం తెచ్చి పెట్టి తన తప్పు సరిదిద్దుకుంది.


అందుకే అన్నారు పెద్దలు, "నిదానమే ప్రధానం" అని.


చూసారా పిల్లలూ!! ఆ గర్విష్టి కుందేలు చివరికి నిదానమే ప్రధానం అని తెలుసుకుంది.


ఈ సామెత కథ మీ అందరూ చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

No comments:

Post a Comment

Recent posts

The Big Fat Cat And The Mice: A Great Idea

The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...

Popular posts