Gradamas Stories presents you telugu stories
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
వీరవాసరం అనే గ్రామంలో పురుషోత్తం అనే వ్యాపారి ఉండేవాడు. అతను చాలా అత్యాసాపరుడు. ఒకరోజు అతను దుకాణం నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అతనికి కింద పడి ఉన్న ఒక వంద రూపాయల నోటు కనిపించింది. వెంటనే పురుషోత్తం కళ్ళు మెరిసాయి. అటు ఇటు దొంగ చూపులు చూసి చటుక్కున వంద రూపాయల నోటు జేబులో పెట్టుకున్నాడు.
వంద నోటు దొరికిన ఉత్సాహంతో పురుషోత్తం ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో భోజనాల వెళ అవ్వటంతో భార్య భోజనానికి పిలిచి అతనికి ఇష్టమైనవన్నీ వడ్డించింది. తృప్తిగా తిని లేచిన పురుషోత్తం తనకి దొరికిన వంద నోటుని తడుముకుంటూ ఆనందంగా నిద్రపోయాడు.
నిద్రపోయిన పురుషోత్తంకి తనకి దొరికిన వంద నోటుతో ఒక లాటరీ టిక్కెట్టు కొని, ఆ టిక్కెట్టుకు ఒక కోటి రూపాయలు లాటరీ వచ్చినట్టు, చాలా డబ్బు సంపాయించినట్టు, భార్యకి బోలెడు నగలు కొన్నట్టు, కలగన్నాడు. ఇంతలో నోట్లు లెక్క పెట్టుకుంటుండగా చేతిలోని వంద నోటు ఎగిరిపోతుంటే పట్టుకోవటానికి ప్రయత్నించిన పురుషోత్తం మంచం మీద నుంచి దుబుక్కున నేల మీద పడ్డాడు. ఇంకేముంది కల తుర్రున మాయమైంది. కళ్ళు తెరిచిన పురుషోత్తం "ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం " అనుకుంటూ నిట్టూర్చాడు.
అందుకే అన్నారు పెద్దలు "ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం", అని
అంటే ఒక విషయం మొదలు కూడా అవకుండానే దాని గురించి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని అనుకోవటన్నే ఈ సామెత రూపంలో చెప్పటం జరిగింది.
ఈ సామెత కథ మీ అందరూ చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.
Meet you all soon with another interesting Telugu saametha story.
A good short story for kids from grandmas stories thank you Grandma more Telugu stories
ReplyDeleteReally good 🤩👍👍
ReplyDelete