Grandmas stories presents you telugu stories
పిల్లలూ!!! తెలివిగా తన మిత్రునికి బుద్ధి చెప్పిన సోమయ్య కథ వింటారా! సరే ఇంక కథలోకి వెళదామర్రా!!!
కమలాపురంలో సోమయ్య, భీమయ్య అనే ఇనుప వ్యాపారస్తులు ఉండేవారు. సోమయ్య ఒకసారి కాశీకి వెళుతూ తన దగ్గర ఉన్న ఇనుమంతా భీమయ్య దగ్గర పెట్టి బధ్రపరచమన్నాడు. ఇంక సోమయ్య నిశ్చింతగా కాశీకి వెళ్ళాడు.
సోమయ్య కాశీకి వెళ్లిన కొంత కాలానికి ఇనుము రేటు పెరగటంతో భీమయ్యలో అత్యాశ పుట్టి సోమయ్య ఇనుము కూడా అమ్మేశాడు.
ఇంతలో కాశీ నుంచి తిరిగి వచ్చిన సోమయ్య తన ఇనుముని తనకు తిరిగి ఇమ్మని భీమయ్యని అడిగాడు.
అప్పుడు భీమయ్య ఏమీ ఎరగనివాడల్లే, "అయ్యయ్యో!! ఏమి చెప్పను సోమయ్య! నేను ఎంతో భద్రంగా పెట్టిన నీ ఇనుమంతా ఎలుకలు తినేశాయి!!" అని అన్నాడు.
స్నేహితుడి మోసం అర్థం చేసుకున్న సోమయ్య ఇంకేమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. తన మిత్రునికి బుద్ధి చెప్పాలనుకున్నాడు.
కొంత కాలం గడిచిన తరువాత సోమయ్య, తన ఇంటిలో శుభకార్యానికి భీమయ్యని రమ్మని పిలుస్తాడు. భీమయ్య వేరే పని వలన వెళ్లలేక తన కొడుకుని సోమయ్య ఇంటికి పంపుతాడు.
కొంత సేపు గడిచిన తరువాత సోమయ్య పరిగెత్తుకుంటూ భీమయ్య ఇంటికి వెళ్లి, "అయ్యయ్యో!! భీమయ్య ఎంత పని జరిగిందయ్యా!! మా ఇంటి బయట ఆడుకుంటున్న నీ కొడుకుని గద్దలు తన్నుకుపోయాయి. అరెరే! నేనేమీ చేయలేకపోయాను!!" అన్నాడు.
అప్పుడు భీమయ్య, "ఎక్కడైనా గద్దలు పిల్లల్ని ఎత్తుకుపోతాయా!!" అని సోమయ్యని అడుగుతాడు.
వెంటనే సోమయ్య, "ఎక్కడైనా ఎలుకలు ఇనుముని తింటాయా!!" అని భీమయ్యను అడుగుతాడు.
"కుక్క కాటుకు చెప్పు దెబ్బ" తిన్న భీమయ్యకు బుద్ధి వచ్చి సోమయ్య ఇనుము అమ్మగా వచ్చిన డబ్బంతా సోమయ్యకి ఇచ్చేస్తాడు.
ఇంతలో భీమయ్య కొడుకు ఇంటికి తిరిగి వస్తాడు. కొడుకుని ఆనందంగా దగ్గరికి తీసుకుని తనకి బాగా బుద్ధి చెప్పిన తన మిత్రుడు సోమయ్యని మెచ్చుకుంటాడు.
అందుకే అన్నారు పెద్దలు, "కుక్క కాటుకి చెప్పు దెబ్బ" అని.
ఒకరు ఎవరికైనా ఏదైన అపకారం తలపెడితే దానికి తగిన విధంగా బుద్ధి చెప్పటాన్ని ఈ సామెత రూపంలో చెప్పటం జరిగింది.
ఈ సామెత కథ మీ అందరూ చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.
friendship is a divine gift if anyone cheated in friendship tht is equal to cheating GOD A friend in need is a frd in deed nice story nicely narrated ������������
ReplyDeleteYup.. Truly nice story from grandma stories I thoroughly enjoyed reading this telugu saametha katha... Keep posting more telugu stories grandma.... Thank you for posting this telugu folk story....
ReplyDelete