Grandmas Stories presents you telugu stories
పిల్లలూ!! దురాశతో తనకున్న గొడ్డలిని కూడా పోగొట్టుకున్న రామయ్య కథ వింటారా!!! సరే కథ మొదలెడదాం!!!!
అనగనగా రాజాపురం అనే గ్రామంలో గోపయ్య, రామయ్య అనే వారు ఉండేవారు. గోపయ్య, రామయ్య ఇద్దరూ గ్రామానికి దగ్గరగా ఉన్న అడవిలో కట్టెలు కొట్టి పక్కనే ఉన్న టౌనులోని సంతలో ఆ కట్టెలు అమ్ముతూ ఉండేవారు. ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు సంతృప్తిగా బ్రతుకుతూ ఉండేవారు.
ఒక రోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళిన గోపయ్య చెట్టు ఎక్కి కొమ్మని గొడ్డలితో కొడుతుండగా అతని చేతిలో ఉన్న గొడ్డలి కాస్త జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది.
"అరెరే!! నాకున్న ఒక్కగానొక్క గొడ్డలి నదిలో పడిపోయింది ఇప్పుడు ఏమి చేయాలి భగవంతుడా" అనుకుంటూ బాధపడసాగాడు.
గోపయ్య మొర విని నదీ దేవతా ప్రత్యక్షమయ్యి ఒక బంగారు గొడ్డలిని చూపించి, "ఇదేనా నీ గొడ్డలి" అని అడుగుతుంది
అప్పుడు గోపయ్య ఆ గొడ్డలి తనది కాదు అని నిజాయితీగా చెప్తాడు.
అప్పుడు ఆ నదీ దేవత వెండి గొడ్డలిని గోపయ్యకి చూపించి, "ఇదేనా నీ గొడ్డలి" అని అడుగుతుంది.
అప్పుడు గోపయ్య ఆ గొడ్డలి తనది కాదు అని నిజాయితీగా చెప్తాడు.
అప్పుడు నదీ దేవత గోపయ్య నదిలో పారేసుకున్న గొడ్డలి చూపించి ఇదేనా నీ గొడ్డలి అని అడుగుతుంది.
నదీ దేవత చేతులో తన గొడ్డలి చూసి మురిసిపోయిన గోపయ్య ఎంతో ఆనందంగా అదే తన గొడ్డలి అని చెప్తాడు.
గోపయ్య నిజాయితిలికి మెచ్చిన నదీ దేవత ఎంతో సంతోషించి అతని గొడ్డలితోపాటు బంగారు, వెండి గొడ్డళ్లు కూడా అతనికి ఇస్తుంది.
ఆనందంగా ఇంటికి చేరుకున్న గోపయ్య జరిగిన కథ తన భార్యకి చెప్తాడు.
వారి మాటల్ని చాటుగా విన్న రామయ్య తాను కూడా నదీ దేవత దగ్గరినుంచి బంగారు గొడ్డలి తెచ్చుకుందామని అడవికి వెళ్లి చెట్టు ఎక్కి గొడ్డలి నదిలో పాడేసుకొని ఏడవసాగాడు.
అప్పుడు నదీ దేవత ప్రత్యక్షమయ్యి బంగారు గొడ్డలి చూపించి, "ఇదేనా నీ గొడ్డలి" అని అడిగినప్పుడు, "అవును తల్లి!! ఆ గొడ్డలి నాదే", అన్నాడు దురాశాపరుడు రామయ్య.
రామయ్య చెప్పిన అబద్ధానికి కోపం వచ్చిన నదీ దేవత గొడ్డలి ఇవ్వకుండానే అదృశ్యమైంది.
దాంతో రామయ్య నెత్తిన చేతులు పెట్టుకుని,"అయ్యయ్యో!!! తన దురాశే తనకు దుఃఖము తెచ్చింది" అని బాధపడ్డాడు.
అందుకే అన్నారు పెద్దలు,"దురాశ దుఃఖమునకు చేటు" అని.
అంటే ఇతరులని చూసి ఈర్ష్య పడి బాధపడుతూ ఉండేవాళ్ళని గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.'
Really good not to be greedy yup the story clearly tells that if you are greedy you loose everything keep posting more and more stories
ReplyDelete