Vidura Bhakti Grandma Stories Telugu Stories
విదుర భక్తి
పాండవులకు, కౌరవులకు సంధి చేయాలని శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వచ్చాడు. భీష్ముడూ, ద్రోణుడూ, మొదలైన వారంతా ఎదురువెళ్ళి శ్రీకృష్ణుడికి స్వాగతవచనాలు చెప్పారు. అందరూకలసి రాజసభకు వెళ్లారు.
అక్కడ శ్రీకృష్ణుడు పెద్దలందరికీ పేరు పేరునా నమస్కారం చేశాడు. సహవయస్క్యులని కుశల ప్రశ్నలు అడిగాడు.
భీష్ముడు శ్రీ కృష్ణునితో "మీరు ప్రయాణ బడలికలో ఉన్నారు, అన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం" అని అన్నాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Vidura Bhakti Grandma Stories Telugu Stories
దుశ్శాసనుడు శ్రీకృష్ణుడిని దుర్యోధనుడి మందిరానికి తీసుకువెళ్లాడు. అక్కడ దుర్యోధనుడు శ్రీ కృష్ణునితో మనం అందరం కలసి భోజనం చేద్దామన్నాడు.
అందుకు శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో "నీవు సంధికి ఒప్పుకున్న తరువాత ఇంట్లో భోజనం చేస్తాను" అని అన్నాడు.
ఆ తరువాత శ్రీకృష్ణుడు విదురునితో వాళ్ళింటికి వెళ్ళాడు. అక్కడ శ్రీకృష్ణుడు విదురునితో నాకు వెంటనే ఏదైనా ఆహారము కావాలని అన్నాడు.
విదురుడు చాలా సంతోషించి శ్రీకృష్ణుడిని ఒక ఆసనం మీద కూర్చోబెట్టాడు. విదురుడు అరటి పళ్ళు తీసుకుని వచ్చి భక్తి పారవశ్యంతో అరటిపండు తొక్కని వలిచి, అరిటి పండుని పారవేసి తొక్కలని శ్రీకృష్ణునికి ఇచ్చాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Vidura Bhakti Grandma Stories Telugu Stories
శ్రీకృష్ణుడు వాటినే చాలా ఆప్యాయంగా తిన్నాడు. ఇంతలో కుంతీదేవి అక్కడికి వచ్చి "ఇదేమిటి విదురా! అరటిపండు పడేసి, తొక్కలను శ్రీకృష్ణునికి ఇచ్చావు?" అని అడిగింది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Vidura Bhakti Grandma Stories Telugu Stories
వెంటనే శ్రీకృష్ణుడు "అత్తా! విదురుడు నా మీద ఎంతో భక్తితో, ప్రేమతో ఆ అరటి తొక్కలని ఇచ్చాడు, నేను వాటిని సంతోషంగా భుజించాను. ఏమి పెట్టారన్నది కాదు ప్రశ్న అందులో ఎంత ప్రేమ నిండి ఉంది అన్న విషయాన్నీ పరిగణలోకి తీసుకోవాలి.
దేవుడు భక్తుని భక్తిని చూస్తాడే తప్ప ఆడంబరాలకి ఆనందపడడు అన్నది ఈ కథ ద్వారా తెలియచేయటం జరిగింది.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀