Telugu Sameta Katha Grandma Stories Telugu Stories
Grandmas Stories presents you telugu stories
చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Telugu Sameta Katha Grandma Stories Telugu Stories
వీరయ్య అనే రైతు సామర్లకోట అనే ఊరిలో ఉండేవాడు. అతను ఉన్నదానితో తృప్తిగా జీవిస్తున్నాడు. పొద్దుట లేచి పొలానికి వెళ్లి పనులు పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తన పిల్లలతో ఆడుకుని వారికి కథలు చెప్పి నిద్ర పుచ్చేవాడు.
ఇలా ఉండగా ఒక సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు. అప్పుడు వీరయ్య గత సంవత్సరం మిగిలిన ధాన్యం మీద ఆ సంవత్సరం వెళ్లబుచ్చాడు. మరుసటి సంవత్సరం వర్షాలు బాగా పడాలని ఆశించాడు, కానీ వర్షాలు అనుకున్నంతగా పడలేదు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Telugu Sameta Katha Grandma Stories Telugu Stories
వీరయ్య ఎలాగో అలాగ ఈ సారి పడిన వర్షాలతో ఎంతో కొంత పంట పండించి నష్టం రాకుండా చూసుకున్నాడు.
ఆ తరువాతి ఏడాది మళ్ళీ వర్షాలు పడలేదు. ఇంక ఈ సారి క్రితం సంవత్సరం ధాన్యం కూడా లేదాయే, వీరయ్యకు ఏమి చేయాలో తోచలేదు.
వ్యవసాయం తప్ప మరొకపని తెలియని వీరయ్య తనని ఈ గండంనుంచి గట్టెక్కించమని భగవంతుణ్ణి ప్రార్థించేవాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Telugu Sameta Katha Grandma Stories Telugu Stories
ఒక రోజు వీరయ్య, ఇక వర్షాలు పడకపోతే తాను చేసేది ఏమీ లేదని చింతిస్తూ నిద్రపోయాడు. కలలో ఒక వెలుగు కనిపించి "వీరయ్యా నీ ఇంటి పెరట్లో అరటి చెట్టు కింద ఆరు అడుగులు తవ్వితే నీకు లంకెల బిందెలు దొరుకుతాయి." అని చెప్పి ఆ వెలుగు మాయమయ్యింది.
వీరయ్య కల లోంచి గబుక్కున బయటకు వచ్చి కళ్ళు నులుముకుని చూస్తే భార్య, పిల్లలూ నిద్రపోతున్నారు. సరే, అనుకుని పొద్దున్నే లేచి పూజ చేసుకుని భార్య పంకజాక్షికి తనకు వచ్చిన కల గురించి చెప్పాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Telugu Sameta Katha Grandma Stories Telugu Stories
తరువాత వీరయ్య అతని భార్య ఇద్దరూ కలసి కలలో చెప్పినట్టు వారి పెరట్లోని అరటి చెట్టు కింద ఆరు అడుగుల లోతు తవ్వి చూశారు. కలలో చెప్పినట్టుగానే అక్కడ రెండు లంకెల బిందెలు నిండుగా బంగారంతో ఉన్నాయి. అది చూసి భార్యా, భర్తలిద్దరి కళ్ళూ నమ్మలేకపోయాయి. వీరయ్య అతని భార్య ఆ బంగారంతో నిండిన లంకెల బిందెలను చూసి ఎంతో సంతోషించారు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Telugu Sameta Katha Grandma Stories Telugu Stories
వారి మోర విని ఆ భగవంతుడు వారికీ సహాయం చేశాడని, ఇక వారి కష్టాలు, తొలగిపోయాయి అని అనుకుని ఎంతగానో ఆనందించారు.
అప్పుడు వీరయ్య "చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు" మన ఇంటిలో బంగారం పెట్టుకుని డబ్బు కోసం ఎక్కడెక్కడో తిరిగాము, అని అనుకున్నాడు.
వీరయ్య అతని భార్యా పిల్లలతో ఎప్పటిలాగే సంతోషంగా జీవించాడు.
చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అంటే మనకి కావలసినది మన దగ్గరే ఉన్న అది గమనించకుండా ఎక్కడెక్కడో వెతకటం అన్నమాట.
పై కథలో వీరయ్యకి కావలసిన ధనం అతని పెరట్లోనే ఉన్న అది తెలియనంత కాలం వీరయ్య డబ్బు కోసం ఎక్కడెక్కడో అడిగాడు. అందుకే అది దొరికిన వెంటనే వీరయ్య "చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు" అని అన్నాడు.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀
No comments:
Post a Comment