Arhatani Batti Andalam Telugu Stories For Kids
Grandmas Stories presents you telugu stories
గాడిద గాడిదే, గుర్రం గుర్రమే
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Arhatani Batti Andalam Telugu Stories For Kids
ఆదిత్యుడనే రాజు వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి. అతని రాజ్యమంతా సుఖ శాంతులతో ఆయురారోగ్యములతో, విద్యా, పాండిత్యాలతో, అన్ని రకాలుగా సుభిక్షంగా ఉన్నది.
ఒక రోజున రాత్రి సమయంలో అంతఃపురంలో ఒక దొంగ ప్రవేశించి కొన్ని బంగారు వస్తువులు తీసుకుని పారిపోతుండగా రాజు ఆదిత్యుడు అతన్ని పట్టుకుంటానికి ప్రయత్నించాడు. దొంగ జుట్టు ఆదిత్యుడి చేతికి చిక్కింది. దొంగ ఆదిత్యుడి చేతిలో ఉన్న జుట్టు కోసేసుకుని పారిపోయాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Arhatani Batti Andalam Telugu Stories For Kids
వెంటనే రాజు మంత్రులందరినీ పిలిపించి జరిగినదంతా వారికి చెప్పాడు. ఆదిత్యుడు మంత్రులకి ఈ జుట్టుని బట్టీ ఆ దొంగని పట్టుకోవాలని సూచించాడు.
ఆదిత్యుడి ఆలోచనకు జవాబు ఏమీ చెప్పలేక మంత్రులు నిశ్శబ్దంగా ఉండిపోయారు.
అప్పుడే అక్కడికి వచ్చి అది విన్న రాజు క్షురకుడు ఇదెంత భాగ్యం ప్రభూ సాయంకాలానికల్లా దొంగని పట్టేస్తాను అని ఆదిత్యునితో చెప్పి ఆ జుట్టు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Arhatani Batti Andalam Telugu Stories For Kids
క్షురకుడు సాయంకాలానికల్లా నిజంగా దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుని ఆదిత్యుడి దగ్గరకు వచ్చాడు. నిజంగా అతని చేతుల్లోంచి తప్పించుకుపోయిన దొంగ అతనే. ఆదిత్యుడు ఆ దొంగని చూసి చాలా ఆశ్చర్యపోయాడు.
ఆదిత్యుడు క్షురకునితో ఇతన్ని పట్టుకోవటం ఎలా సాధ్యమయ్యిందని అడిగాడు.
అప్పుడు క్షురకుడు ప్రభూ, ఒకరి జుట్టులాగా ఇంకొకరి జుట్టు ఉండదు. అందుకని ఈ దొంగని పట్టుకోవటంలో పెద్ద సమయం పట్టలేదు అని అన్నాడు.
ఆదిత్యుడు క్షురకుని తెలివితేటలకు ఎంతో ఆశ్చర్యం చెంది ఈ రోజు నుంచీ నువ్వే నా ప్రధాన మంత్రివి అని అన్నాడు.
Arhatani Batti Andalam Telugu Stories For Kids
ఆ విధంగా కొంత కాలం గడిచింది, శత్రు సైన్యాలు తన రాజ్యం మీదకి దండెత్తుతున్నాయని వేగుల ద్వారా ఆదిత్యునికి తెలిసింది.
వెంటనే ఆదిత్యుడు క్షురకుణ్ణి పిలిపించి మన రాజ్యం మీదకి శత్రు సైన్యాలు దండెత్తుతున్నాయి వాళ్ళని మనం ఎలా ఎదురుకోవాలి అని అడిగాడు.
వంటనే క్షురకుడు ఇప్పుడే వస్తాను ప్రభూ అని చెప్పి బయటికి వెళ్లి కొంత సమయం తరువాత రెండు పెట్టెలతో రాజు సమక్షానికి తిరిగి వచ్చాడు.
Arhatani Batti Andalam Telugu Stories For Kids
వెంటనే ఆదిత్యుడు ఇప్పుడు ఏమి చేద్దామని మళ్ళీ అడిగాడు. దానికి క్షురకుడు ఈ పరిపాలన యుద్ధాలు మనకెందుకు ప్రభూ ఇది మా నాన్నగారి మంగళి పొది, మరొకటి నా మంగళి పొది (అంటే క్షవరం చేసే పని మెట్లు అన్నమాట దాన్ని మంగళి పొది అనేవారు). మనిద్దరమూ ఇక్కడినుంచి తప్పించుకు పారిపోయి మనం ఎక్కడికైనా చేరుకొని క్షురక వృత్తి చేసుకుంటూ హాయిగా జీవిద్దాం ప్రభూ అని చెప్పాడు.
అప్పుడు ఆదిత్యునికి తాను చేసినది ఎంత తెలివి తక్కువ పనో అర్థం అయ్యింది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Arhatani Batti Andalam Telugu Stories For Kids
వెంటనే ఆదిత్యుడు పాత మంత్రులని పిలిచి తనని మన్నించమని కోరి మంత్రుల సలహాతో శత్రువుని తరిమి కొట్టి తన రాజ్యంలో తిరిగి శాంతిని స్థాపించాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, Arhatani Batti Andalam Telugu Stories For Kids
అందుకే అన్నారు పెద్దలు "గాడిద గాడిదే, గుర్రం గుర్రమే" అని.
అంటే గాడిద బరువు ఎక్కువ మొయ్యగలదు కదా అని దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు గాడిద మీద వెళ్ళము కదా!! గుర్రం వేగం గాడిదకు వస్తుందా!! అర్హతని బట్టి అందలం ఎక్కించాలని దాని అర్థం.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀