Saturday, May 29, 2021

Grandma Telugu Stories From Telugu Proverbs

Grandmas Stories presents you telugu stories

Grandma Telugu Stories From Telugu Proverbs

అర్థం చేసుకునే భర్త ఉంటే ఆ భార్యకి అన్నీ కలిసి వస్తాయి

stories for kids,telugu samethalu,grandma stories,telugu neeti kathalu,telugu proverbs,must read telugu stories,telugu stories,grandmaz stories,telugu kathalu,moral stories telugu,
రాజారావు, రమణి ఇద్దరూ భార్యా భర్తలు. రాజారావు పెద్ద వ్యాపారస్తుడు. రమణి చాలా అందంగా, వినయంగా ఉందని మధ్యతరగతి అమ్మాయైనా తనకి బాగా నచ్చి రాజారావు ఆమెని వివాహం చేసుకున్నాడు.
ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నా రమణికి తన భర్తతో ఎక్కువసేపు గడపాలని ఉండేది.

కానీ రాజారావు పెద్ద వ్యాపారస్తుడు అవటంతో అతనికి ఆ పనుల ఒత్తిడి వలన ఎక్కువసేపు ఆఫీసులో గడపాల్సి వచ్చేది, ఇంటికి వచ్చేసరికి పొద్దుపోయేది. రమణి ప్రతి రోజూ భర్త గురించి ఎదురుచూసి అతను త్వరగా ఇంటికి రానందుకు బాధపడేది.


ఇలా ఉండగా వారి ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఒక చిన్న గుడిసె ఉండేది. అందులోకి కొత్తగా భార్య, భర్త వచ్చి చేరారు. వాళ్ళు రోజూ పొద్దున్నే పనిలోకి వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత ఆనందంగా ఇద్దరూ కలిసి ఇంటి పని చేసుకునేవారు.

రోజూ రమణి వీళ్ళని చూస్తూ తన భర్త కూడా తనతో అలా ఉండాలని కోరుకుంటూ భర్తని సతాయించటం మొదలుపెట్టింది. రాజారావు ఎంత ప్రయత్నించినా అతనికి త్వరగా రావటం కుదరటంలేదు. ఇక భార్య బాధ చూడలేక ఒక పని చేయాలని అనుకున్నాడు.

stories for kids,telugu samethalu,grandma stories,telugu neeti kathalu,telugu proverbs,must read telugu stories,telugu stories,grandmaz stories,telugu kathalu,moral stories telugu,

ఒక రోజు తెల్లవారు ఝామున 950 రూపాయలు డబ్బు మూట తీసుకువచ్చి పక్కనేవున్న గుడిశె దగ్గరకి వెళ్లి వారి గుమ్మం ముందు పెట్టి వచ్చాడు.

తెల్లవారి పనిలోకి వెళదామని లేచిన భార్య భర్తలిద్దరూ, తలుపు తీసి గుమ్మం ముందున్న మూటని చూసి, అందులోని డబ్బు చూసి ఆశ్చర్యపడి వెంటనే లెక్కపెట్టుకున్నారు. అందులో 1000 రూపాయలకి 50 రూపాయలు తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఆ భార్యా భర్తలిద్దరూ ఆ 950 రూపాయలని ఎక్కువగా పనిచేసయినా 1000 రూపాయలు చేయాలని అనుకుని, ఆ రోజు ఎక్కువగా పనిచేసి ఇంటికి ఆలస్యంగా వచ్చారు.

ఇంక ఆ రోజు నుంచి డబ్బు ఎక్కువగా సంపాయించాలనే కోరిక వాళ్లలో కలిగి, వారిద్దరూ ఎక్కువగా పని చేసి ఆలస్యంగా ఇంటికి రావటం మొదలుపెట్టారు. వాళ్ళు ఇంటి దగ్గర సరదాగా గడపటం తగ్గిపోయింది.

ఇది రోజూ చూస్తున్న రమణి ఎంతో బాధపడి అదే విషయం భర్త రాజారావుతో చెప్పింది. అది విన్న రాజారావు తన ఎత్తు పారినందుకు మనసులోనే సంతోషపడి, భార్యని ఓదారుస్తూ నువ్వేం బాధపడకు సంపాదించుకోవాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రావు, ఇప్పడు సంపాయించకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తారు.

నేను కూడా ఇక నుండి సాధ్యమైనంత వరకు ఇంటికి త్వరగా వస్తాననటంతో రమణి భర్త తనను అర్థం చేసుకున్నందుకు ఎంతో సంతోషపడింది.

stories for kids,telugu samethalu,grandma stories,telugu neeti kathalu,telugu proverbs,must read telugu stories,telugu stories,grandmaz stories,telugu kathalu,moral stories telugu,

అందుకే అన్నారు పెద్దలు "అర్థం చేసుకునే భర్త ఉంటే  అన్నీఆ భార్యకి కలిసి వస్తాయని."

అంటే పై కథలో చెప్పిన విధంగా భార్య భర్తలిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సుఖంగా జీవించటం అని.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

No comments:

Post a Comment

Recent posts

The Big Fat Cat And The Mice: A Great Idea

The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...

Popular posts