Thursday, May 20, 2021

Must Read Telugu Tales And Telugu Stories

Grandma stories presents you telugu stories

నిజమైన దానశీలి

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,

ఉజ్జయిని నగరంలో ఒక శివాలయం ఉంది. అక్కడ నిత్య పూజలు, హోమాలు బాగా జరుగుతాయని మంచి పేరుంది. అది ఏంతో మహిమగల గుడి అని అందరూ అంటారు.

ఆ గుడి పూజారి ఏంతో నియమ నిష్ఠలతో పూజ చేస్తాడు. ఒక రోజు ఆ గుడి పూజారి పూజ ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఆకాశంలోంచి పెద్ద శబ్దంతో మెరుపు మెరిసింది.

అది ఏమిటా అని పూజారి కళ్ళు నులుముకుని ఆకాశంకేసి చూశాడు. ఏంతో ధగద్ధగ్గాయమైన వెలుగులతో ఒక తొమ్మిది చదరపు గజాలు ఉండే బంగారు పళ్లెం అతని కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యింది.

అప్పుడు ఆ పూజారి శివనామస్మరణ చేస్తూ దాని దగ్గరికి వెళ్లి చూశాడు.

దానిపై ఇలా రాసి ఉంది, " ఎవరైతే నిస్వార్థ చింతనతో దాన ధర్మాలు చేస్తారో వారికే ఈ పళ్లెం చెందుతుంది. అర్హత ఉన్నవారు ముట్టుకుంటేనే ఈ పళ్ళెము బంగారు పళ్లెంగా ఉంటుంది, లేకపోతే రాయిగా మారిపోతుంది. లోకాస్సమస్తా సుఖినోభవంతు."

ఇక ఆ రోజు నుంచి పూజారి దానికి అర్హత ఉన్నవాడికోసం వెతకటం ప్రారంభించాడు.

ఈ వార్త క్షణంలో ఆ చుట్టు పక్కల ఊళ్లలో కూడా వ్యాపించింది. ఇంక ఆ బంగారు పళ్ళాన్ని పొందటానికి దూర దూరాలనుంచి జమీందారులు, దాన ధర్మాలు చేసేవారు, దురాశపరులు, ఎంతో మంది వచ్చి ఆ బంగారు పళ్ళాన్ని ముట్టుకోవటం అది రాయిగా మారితే నిరాశగా వెనుదిరగటం జరుగుతోంది.

ఇలా కొన్ని రోజులు గడిచింది. ఈ వింత ఏమిటా అని పూజారి ఆలోచించాడు. అప్పుడు అర్థమైంది పూజారికి "ఓహో! ఇది ఎక్కడో ఉండే వారికి చెందినదైతే ఇక్కడ ఎందుకు ప్రత్యక్షం అవుతుంది. అంటే ఆ నిస్వార్థ దానశీలి ఇక్కడే ఎక్కడో ఉంది ఉంటాడు" అని అనుకున్నాడు.
సరే ఇంక ఆ నిస్వార్థ దానశీలిని వెతికే బాధ్యత తానే స్వయంగా తలకెత్తుకున్నాడు.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,

ఉజ్జయినీలోనే ప్రతాపుడనే ఒక శ్రామికుడున్నాడు. అతను శ్రామికుడే ఐనా తనకు ఉన్న దానిలోనే ఇతరులకి సాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఒక రోజు అతను గుడి దగ్గర ఉన్న బీద బిక్కితో మాట్లాడుతుంటే పూజారి చూసి అతనితో "ఎవరు నాయనా నువ్వు? నువ్వు క్రమం తప్పకుండ ప్రతి వారం ఇక్కడ బీద బిక్కీకి సాయం చేయటం చూస్తున్నాను." అని అడుగుతాడు.

అప్పుడు ప్రతాపుడు "నేను ఒక శ్రామికుడని, నాకు ఉన్నదానిలోనే నాకన్నా లేనివారికి ఏంతో కొంత సాయం చేస్తుంటాను." అని చెప్తాడు.

ఇంక పూజారికి అర్థమయ్యింది ఈ ప్రతాపుడే ఆ నిస్వార్థ దానశీలి అని. అప్పుడు ప్రతాపుడితో పూజారి బంగారు పళ్లెం విషయం అంతా చెప్పి వచ్చి దానిని ముట్టుకోమంటాడు.
అప్పుడు ప్రతాపుడు ఏంతో వినయంగా "అయ్యా!! నేను అంతటి గొప్పదానికి అర్హుడనని మీరు అనుకుంటే ధన్యవాదాలు. కానీ నేను దానిని ఆశించట్లేదు. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి వచ్చి ప్రయత్నిస్తాను." అని అంటాడు.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,

వెంటనే పూజారి ప్రతాపుడిని ఆ బంగారు పళ్లెం దగ్గరికి తీసుకెడతాడు.

ఇంకేముంది అందరూ చూస్తుండగానే ప్రతాపుడు ఆ పళ్ళాన్ని తన చేతులలోకి తీసుకోవటం ఆ బంగారు పళ్లెం బంగారంగానే ఉండటం జరిగిపొయినింది.

ఇంక పూజారి తనకు ఆ ఈశ్వరుడిచ్చిన బాధ్యతను సక్రమంగా పూర్తిచేసినందుకు, ఆ బంగారు పళ్లెం నిజమైన నిస్వార్థ దానశీలికి చెందటంతో ఏంతో ఆనందపడ్డాడు.

ప్రతాపుడు ఆ బంగారు పళ్ళాన్ని చక్కగా విధి విధానాలతో పూజిస్తూ దాని ద్వారా వచ్చిన సిరి సంపదల్ని చక్కగా దాన ధర్మాలు చేస్తూ గొప్ప దానశీలిగా పేరుతెచ్చుకున్నాడు.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Sunday, May 16, 2021

Grandma Stories Telugu Story

 Grandma stories presents you telugu stories

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,

అవంతీ నగర రాజ్యం విశాలమైనదని, మనోహరమైనదని పొరుగు రాజ్యాల్లో బాగా పేరుంది. ఆ రాజ్యాన్ని పాలించే రాజు మహేంద్రవర్మ ప్రజలని తన బిడ్డల్లా చూసుకుంటాడని అందరూ అనుకుంటారు. 

ఒకసారి రాజు మహేంద్రవర్మ అంతఃపురంలో వజ్ర వైడూర్యాలు, రత్నాలతో పొదిగిన ఒక బంగారు నగ దొంగతనం జరిగింది.
"అరెరే!! ఏంతో సుభిక్షమైన శాంతి సామరస్యాలతో ఉండే నా రాజ్యంలో ఇంత పని ఎవరు చేశారు!" అని చాలా బాధపడ్డాడు మహేంద్రవర్మ.
వెంటనే రాజు తన మంత్రి సులోచనుడిని పిలిచి విషయం వివరించి ఆ నగ దొరికేటట్టుగా చర్యలు చేపట్టమని మంత్రిగారిని రాజు ఆదేశించాడు. 

మంత్రిగారు బాగా ఆలోచించి ఎవరు లోపలికి రాలేని అంతఃపురంలో దొంగతనం జరిగిందంటే పనివాళ్లే చేసుంటారని మంత్రి భావించాడు.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,

ఆ మరునాటి ఉదయం పనివాళ్ళందరూ రాగానే మంత్రి వాళ్లందరికీ నాలుగు అంగుళాల చీపిరి పుల్ల ఇచ్చాడు.

మంత్రి ఈ విధంగా చెప్పాడు, "ఈ చీపురు పుల్లని మీరు ఒక్కొకటి తీసుకుని ఆ గదిలో పెట్టి రావాలి. ఎవరైతే దొంగతనం చేశారో వారి చీపురు పుల్ల ఒక అంగుళం పెరుగుతుంది."

పనివాళ్ళందరూ ఆ విధంగా చీపురు పుల్లని లోపల పెట్టారు. నిజంగా దొంగతనం చేసిన పనివాడు చీపురుపుల్లని ఒక అంగుళం ముక్క తుంచి లోపల పెట్టాడు. అందరి ముక్కలు నాలుగు అంగుళాలు ఉంటే దొంగతనం చేసినవాడు చీపురు పుల్ల మూడు అంగుళాలు ఉంది.

ఈ విధంగా దొంగ బయటపడ్డాడు.

రాజు మంత్రిని అభినందించాడు.

అందుకే అన్నారు పెద్దలు " గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు."

అంటే ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయాన్ని తనకి అన్వయించుకోవటాన్ని ఈ సామెత రూపంలో చెప్పారు.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Saturday, May 15, 2021

Telugu Stories A Must Read Story

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,

సీతపారంలో అమృత అనే ఒకావిడ ఉంది. ఆవిడ ఒక మధ్యతరగతి గృహిణి, ఐనప్పటికీ అందరిదగ్గర బాగా గొప్పలు పోతూ ఉంటుంది. ఆమె భర్త ఎంత చెప్పిన ఆ అలవాటు మానుకోదు. ఇది కాక ఎవరింటికి వెళ్లినా వాళ్ళ ఇంటికో, వాళ్ళ జీవన విధానంలోనో లేకపోతతే ఇంకేదైనా విషయంలోనో ఏదో ఒక వంక పెట్టడం ఆవిడకి బాగా అలవాటు.

పెళ్ళికి పేరంటానికి బంధువులకి, తెలిసిన వాళ్లకి, ఆమెను పిలవక తప్పదాయె. ఇంక ఎదోఒకటిలే అని కొంతమంది, ఆమె భర్త మొహం చూసి కొంతమంది పిలిచేవారు.

ఇదిలా ఉండగా ఒకసారి అమృత తన కొడుకు పుట్టిన రోజు జరపాలనుకుంది. భర్త తాహతుకి మించి ఆలోచిస్తుంది అమృత. కాదంటే ఎక్కడ భార్య బాధపడుతుందో అని ఒప్పుకుంటాడు అమృత భర్త.

ఇంక అమృత ఆనందానికి అంతులేదు. తెలిసినవారందరినీ పేరు పేరున పిలిచింది అమృత.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,

పుట్టిన రోజు రానే వచ్చింది పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారు. అమృత ఒక్కొక్కళ్ళని పలకరించడం మొదలు పెట్టింది.
ఇన్ని రోజులు అనిపించుకున్న వారికి అమృతని అనటానికి మంచి అవకాశం దొరికింది.

ఇంకేముంది ఒకళ్ళు అమృత ఇంటి గురించి అవహేళన చేస్తే, ఇంకొకళ్ళు ఆమె చేసిన ఏర్పాట్ల గురించి, ఇంకొకరు ఆమె భర్త ఆదాయం గురించి, ఇలా అందరు తలో మాట అని వెళ్లారు.

అప్పటి దాకా ఏడుపు పంటి బిగువున పెట్టుకుని ఉన్న అమృత అందరూ వెళ్ళిపోయిన వెంటనే భర్త దగ్గర కూర్చుని ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది.

అప్పుడు అమృత భర్త "నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది." అని అన్నాడు.

కనువిప్పు కలిగిన అమృత ఆ తరువాత ఎప్పుడు ఎవరిని ఎత్తిపొడవటం కానీ, అనవసరంగా చులకన చేసి మాట్లాడటం కానీ చేయలేదు.

అమృతలో వచ్చిన ఈ మార్పుకి అందరు ఏంతో సంతోషించారు.

అందుకే అన్నారు పెద్దలు "నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది." అని.

అంటే ఎవరైనా ఎప్పుడు అందరితో మంచిగా మాట్లాడాలి, మెలగాలి అని అప్పుడే అవతలివారి నుంచి మనకి తిరిగి గౌరవం లభిస్తుంది అని ఈ సామెత రూపంలో చెప్పారు.

ఈ సామెత కథ మీ అందరూ చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Thursday, May 13, 2021

Telugu Stories The Kindness Of Sri Rama

Grandmas stories presents you Telugu Stories

శ్రీ రాముని ఔదార్యం 

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,

శ్రీ రాముడు గొప్పవాడనటానికి చాలా నిదర్శనాలు రామాయణంలో వాల్మీకి చూపించాడు.
ఇప్పుడు చెప్పే విషయం కూడా ఆ గొప్పతనాల్లో ఒకటి.
కైకేయి వరాల మేరకు శ్రీ రాముడు పట్టాభిషేకం మానుకుని అరణ్య వాసానికి బయలుదేరుతున్న నేపథ్యంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు శ్రీ రాముడిని చూడటానికి వచ్చాడు. వెంటనే శ్రీ రాముడు తాను చేస్తున్న పని ఆపి వృద్ధ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చాడు.
శ్రీ రాముడు వృద్ధ బ్రాహ్మణుడికి నమస్కరించి తన నుంచి కావలసినటువంటి సహాయం అడగమన్నాడు.
అందుకు వృద్ధ బ్రాహ్మణుడు శ్రీ రాముడితో "రామా నిన్ను చూద్దామని వచ్చాను ఇప్పుడు నిన్ను చుసిన తరువాత నిన్ను ఒకసారి దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది." అని ఆన్నాడు.
వెంటనే శ్రీ రాముడు వృద్ధ బ్రాహ్మణుణ్ణి దగ్గరికి తీసుకున్నాడు. ఆ తరువాత వృద్ధ బ్రాహ్మణుడు యవ్వనవంతుడయ్యాడు.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,

బ్రాహ్మణుణ్ణి ఏమైనా కోరిక కోరుకోమని శ్రీ రాముడు అడిగాడు. అందుకు బ్రాహ్మణుడు ఏమి వద్దన్నాడు.
తరువాత శ్రీ రాముడు ఇక్కడ ఉన్న ఈ కర్రని విసిరేస్తున్నాను ఇది ఎక్కడికెళ్ళిపడుతుందో అక్కడి దాక సంపదలన్నీ నీవే అని అన్నాడు.
ఆ కర్ర అన్ని చోట్ల తిరిగి శ్రీ రాముడి వద్దకే తిరిగి చేరింది.
శ్రీ రాముడు ఆ బ్రాహ్మణునికి తరతరాలకు సరిపోయేటంత సంపదిచ్చి పంపించాడు.
ఈ విషయంలో మనం తెలుసోకవలసిన నీతి ఏమిటంటే మహారాజుగా జరగవలసిన పట్టాభిషేకం శ్రీ రాముడికి ఆగిపోయి సకల కష్టాలతో కూడుకున్నటువంటి అరణ్యవ్యాసానికి వెళుతున్న నేపథ్యంలో బ్రాహ్మణుడు వచ్చి అడిగిన దానికి ఏమాత్రం విసుగు కోపం లేకుండా రాముడు అతన్ని ఎంతో గౌరవించి పంపించాడు.
అప్పటినుండి ఇప్పటికి కూడా రామరాజ్యం అనే పేరు మారు మోగుతుంది.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,

శ్రీ రామ జయ రామ జయ జయ రామ.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Telugu Stories : The Great King Vikramarka

Grandmas stories presents you telugu stories.

రంభా!! ఊర్వశా!! : ఇద్దరిలో ఎవరు గొప్ప నాట్యగత్తె!!

telugu stories, youtube, telugu, sametalu, burra kathalu, pitta kathalu, telugu stories, telugu folk stories, telugu stories for kids, telugu samethalu, telugu sametha kathalu, telugu proverbs, grandmas stories, grandma stories, grandma's stories, grandma tales,telugu kathalu,

దేవతల రాజు దేవేంద్రుడు దేవేంద్రుని కొలువులో రంభ మరియు ఊర్వశి అని పేరుకలిగిన వాళ్ళు నృత్యం చేసేవారు.

చాలా కాలం గడిచిన తరువాత రంభ ఊర్వశి మధ్య పోటీ వచ్చింది.

వారిరువురిలో ఎవరు బాగా నృత్యం చేస్తారనే సమస్య వచ్చింది.

అప్పుడు దేవేంద్రుడు నాట్య శాస్త్రంలోని అన్ని పద్దతుల్లోనూ వారిద్దరి చేత నృత్యం చేయించాడు.
కానీ ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అని తేల్చలేకపోయారు. అదే సమయంలో నారదుడి వచ్చాడు.

telugu stories, youtube, telugu, sametalu, burra kathalu, pitta kathalu, telugu stories, telugu folk stories, telugu stories for kids, telugu samethalu, telugu sametha kathalu, telugu proverbs, grandmas stories, grandma stories, grandma's stories, grandma tales,telugu kathalu,

ఏమిటి దేవేంద్ర ఏమి ఆలోచిస్తున్నావని నారదుడు దేవేంద్రదుని ప్రశ్నించాడు.

అప్పుడు దేవేంద్రుడు వీరిద్దరిలో ఎవరు గొప్ప నాట్యగత్తె అని నేను తేల్చలేకపోతున్నాను అన్నాడు.

నారదుడు చిన్నగా నవ్వి ఇదేమి పెద్ద సమస్య ఏమి కాదు భలోకంలో విక్రమార్క మహారాజు ఉన్నాడు, అతను అరవై నాలుగు కళలోను దిట్ట.

అతన్ని నీవు ఆహ్వానిస్తే క్షణాల్లో నీ సమస్యని తీర్చేస్తాడు. అప్పుడు దేవేంద్రుడు తన సారథి మాతలికి తన రథం ఇచ్చి భూలోక ప్రభువైనటువంటి విక్రమార్కుడిని సగౌరవంగా తీసుకురమ్మని పంపించాడు.

telugu stories, youtube, telugu, sametalu, burra kathalu, pitta kathalu, telugu stories, telugu folk stories, telugu stories for kids, telugu samethalu, telugu sametha kathalu, telugu proverbs, grandmas stories, grandma stories, grandma's stories, grandma tales,telugu kathalu,

ఈ ఆహ్వనం విన్న వెంటనే విక్రమార్కుడు ముందు ఆశ్చర్యపడి ఆ తరువాత భట్టికి తనం కార్యక్రమాలన్నీ అప్పచేప్పి విక్రమార్కుడు ఇంద్ర సభకి వచ్చాడు
ఇంద్రుడు విక్రమార్కుడిని సగౌరవంగా ఆహ్వానించి ఒక ఆసనం మీద కూర్చోబెట్టాడు.

అప్పుడు దేవేంద్రుడు విక్రమార్కుడితో "రంభా ఉర్వశిలలో ఎవరు గొప్ప నాట్యకత్తె అనేది నేను తేల్చలేకపోయాను. నారదుడి సలహా మీద మిమ్మల్ని నేను ఆహ్వానించాను. మీరు ఈ సమస్యని పరిరిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను." అన్నాడు.

అప్పుడు విక్రమార్కుడు "దేవేంద్రా! రంభ ఊర్వశి ఇద్దరితో నాట్యం చేయించండి" అని చెప్పాడు.

రంభ ఊర్వశి ఇద్దరు ఇంద్ర సభకు వచ్చారు, విక్రమార్కుడు రెండు పూల మాలలను తెప్పించి రంభని ఉర్వశిని ఇద్దరినీ ధరించమన్నాడు. ఇద్దరు ధరించి నాట్యం మొదలువుపెట్టారు.

నాట్య శాస్త్రంలోని అన్ని రకాలుగాను ఇద్దరు నాట్యం చేశారు.

ఇద్దరి నాట్యం పూర్తైన తరువాత విక్రమార్కుడు ఈ విధంగా చెప్పాడు.

telugu stories, youtube, telugu, sametalu, burra kathalu, pitta kathalu, telugu stories, telugu folk stories, telugu stories for kids, telugu samethalu, telugu sametha kathalu, telugu proverbs, grandmas stories, grandma stories, grandma's stories, grandma tales,telugu kathalu,

"రంభ ఊర్వశి ఇద్దరు నాట్య శాస్త్రంలోని అన్ని విషయాల్లోనూ సమానులే హావ భావ ప్రకటనలలో కూడా ఇద్దరు సమానులే, రంభ మెడలోని దండ యథాతథంగా ఉంది. కానీ ఊర్వశి మెడలోని దండ నలిగిపోయింది.
దీనికి కారణం ఊర్వశి ఎదో విధంగా రంభని ఓడించాలనుకుంది.

ఊర్వశి యొక్క ఈ మానసిక సంక్షోభం వలన ఆమె మెడలోని దండ నలిగిపోయింది."

"కానీ రంభ తన శాస్త్రాధ్యయనాన్ని కేవలం నాట్యం చేయటానికి మాత్రమే ఉపయోగించింది."

"ఆమెలో ఎటువంటి భావాలు లేవు. అందికనే ఆమె మెడలోని దండ నలిగిపోలేదు."

"కాబట్టి ఇద్దరిలోను రంభ గొప్ప నాట్యగత్తె" అని చెప్పాడు.
విక్రమార్కుడు చెప్పిన సమాధానానికి ఊర్వశి కూడా ఒప్పుకుంది.

దేవేంద్రుడు విక్రమార్కుడిని సన్మానించి సగౌరవంగా విక్రమార్కుడి రాజ్యానికి పంపించాడు.

Meet you all soon with another interesting Telugu sameta story.

we try to post as many Telugu stories as we can

Read, listen and enjoy from Grandmas Stories 😀👍

Tuesday, May 11, 2021

The Tale Of Little Lalita: One Nice trick Up The Sleeve:Telugu Samethalu Telugu Kathalu Grandma Stories

  Grandmas Stories Presents You Telugu Stories

నీవు నేర్పిన విద్యే నీరజాక్షా

telugu stories, youtube, telugu, sametalu, burra kathalu, pitta kathalu, telugu stories, telugu folk stories, telugu stories for kids, telugu samethalu, telugu sametha kathalu, telugu proverbs, grandmas stories, grandma stories, grandma's stories, grandma tales,telugu kathalu,

బరంపురంలో లలిత అనే ఏంతో తెలివైన అమ్మాయి ఉండేది. ఆ ఊరిలో వాళ్లందురు ఆమె తెలివికి ముచ్చట పడుతుండేవారు.

ఒకసారి వాళ్ల దూరపు బంధువు చుట్టపు చూపుకని లలితవాళ్ళింటికి వస్తాడు. అతను లలితకి బాబాయి వరస అవుతాడు.

సరే ఊరు చూపించమని వాళ్ళ నాన్న చెప్పటంతో ఒకరోజు పొద్దునే తయారయ్యి ఊరు చూడటానికి బయలుదేరతారు ఇద్దరు .

ఆ ఉరిలో చూడదగ్గ ప్రదేశాలు ఒక్కొక్కటి చూపిస్తుంది లలిత, ప్రతిదానికి బాబాయి ఎదో ఒక వంక పెడుతున్నాడు.
లలిత బాబాయిని ఆ ఊరిలో పెద్ద పార్కుకి తీసుకువెళ్ళింది అది చూసి బాబాయి,"ఆ సరేలే! ఇదేనా మా ఊరిలో ఇంతకంటే పెద్ద పార్కు ఉంది అన్నాడు." ఆహా! అని ఊరుకుంది లలిత.

లలిత వాళ్ళ ఊరిలోని చాలా ప్రదేశాలు చూపించింది. బాబాయి ఏ ఒక్కదాన్ని వదలకుండా ఎదో ఒక పుల్ల మాట ఆంటూనే ఉన్నాడు, ప్రతిదానికి వంక పెట్టాడు.

సరే ఇలా కాదని లలిత తరువాత రోజు పొద్దునే, బాబాయి టిఫినుకి కుర్చునేసరికి అక్కడికి వచ్చింది.
ఆ రోజు టిఫిను లలితే చేసింది. బాబాయికి టిఫిన్ వడ్డిస్తూ, "ఇది ఇడ్లీ అంటారు. మా ఊళ్ళో ఇది తెల్లగా ఉంటుంది బాబాయ్" అంది.

ఇంకా "ఏమోలే! మా చిన్న ఊరిలో ఇడ్లీలు మీ పెద్ద ఊరిలో ఇడ్లిలలా ఎమైనా ఎరుపు రంగులో ఉండి, గారే రుచిలో ఉంటాయా! ఏమిటి!" అంది.

వెంటనే బాబాయి "అదేమిటి తల్లి అలా అన్నావు ఇడ్లీ ఎక్కడైనా ఇడ్లీలానే ఉంటాయి. తెల్లగా మంచి మినప పప్పు రుచిలో అంతేగాని ఇడ్లీ గారేలా ఎందుకుంటాయి?" అన్నాడు.

తరువాత బాబాయి అలా పొలంలోకి వెళ్లి వద్దామనుకుంటుంటే లలిత కూడా వస్తానని బయలుదేరింది.

దారిలో కొబ్బరిబోండాలవాడు కాయలు కొడుతుంటే "రెండు కాయలు ఇవ్వు" అని తీసుకుని బాబాయి దగ్గరికి వెళ్ళింది లలిత.
"ఇదిగో బాబాయ్ మా ఉరి కొబ్బరిబోండం" అని ఇచ్చింది.
ఇచ్చి ఇలా అన సాగింది, "అబ్బా! మా ఉరి కొబ్బరిబోండం నీళ్లు ఎంత బాగున్నాయో తియ్యగా."

ఇంకా "ఏమోలే మీ ఊరిలో బోండంలో నీళ్లు ఉంటాయో, లేకపోతె దానికి మించి ఇంకేమన్నా ఉంటాయో, లోపల కొబ్బరి బదులు ఇంకేమన్నా అరిసెలు! బూరెలు! ఉంటాయేమో" అంది.

"ఇదేంటమ్మా లలిత ఎక్కడైనా కొబ్బరిబోండంలో నీళ్లు, కొబ్బరి కాకపొతే ఇంకేమి ఉంటాయి?" అన్నాడు బాబాయి.

ఆ రోజంతా లలిత ప్రతి విషయానికి ఇలానే అంటూ ఉంది. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి బాబాయి "అమ్మ లలితా నీవు పొద్దుట నుంచి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు?" అని అడిగాడు.

"అయ్యయ్యో!! బాబాయ్ మీ ఊరిలో మాట్లాడటం కుడా వేరేగా ఉంటుందా!!" అని అడిగేసరికి బాబాయికి విషయం అర్థమైంది.

అప్పుడు బాబాయికి "ఇప్పుడు అర్థం అయ్యింది తల్లి నాకు విషయం.నా మాటలు నాకే బాగా ఒప్పచెప్పావు, మీ ఉరి గొప్ప మీది మా ఉరి గొప్ప మాది. ఒకదానితో వేరొకదాన్ని పోల్చి కించపరచకూడదని నా పద్ధతిలోనే మాట్లాడి నాకు బాగా అర్థమయ్యేలాగా చేశావు, గడుగ్గాయి!" అని లలితను మెచుకున్నాడు బాబాయి .

telugu stories, YouTube, telugu, saametalu, burra kathalu, pitta kathalu, telugu stories, telugu folk stories, telugu stories for kids, telugu samethalu, telugu sametha kathalu, telugu proverbs, grandmas stories, grandma stories, grandma's stories, grandma tales,

అప్పుడు తెలివైన లలిత "నీవు నేర్పిన విద్యే నీరజాక్షా!! " అని నవ్వుతూ అంది.

అందుకే అన్నారు పెద్దలు నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అని.

అంటే ఎవరికైనా వారి పద్దతిలోనే సమాధానం చెప్పినప్పుడు ఈ సామెతని ఉపయోగిస్తారు.

ఈ సామెత కథ మీ అందరూ చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Monday, May 10, 2021

Generosity of Sri Ramanujacharya: Sri Ranganatha Temple Telugu Moral Stories

Grandma stories presents you telugu stories
పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయిశ్చిత్తములేదు

telugu stories youtube,telugu saametalu,burra kathalu,pitta kathalu,telugu stories,Telugu Moral Stories,telugu folk stories,telugu stories for kids,

అవి శ్రీ రామానుజాచార్యులవారు శ్రీ రంగ క్షేత్ర నిర్వహణ బాధ్యత స్వీకరించిన రోజులు. అప్పటికే అక్కడి అర్చకులలో అవినీతి బాగా పెరిగిపోయి ఉంది.

శ్రీ రామానుజాచార్యులవారు ఎవరి అవినీతిని సహించేవారు కారు. దాంతో కోపం వచ్చిన అర్చకులు శ్రీ రామానుజాచార్యులని విషం పెట్టి చంపాలనుకుంటారు.
కానీ వాళ్లు స్వయంగా ఆ పని చేస్తే అనుమానం వస్తుందని ఒక స్త్రీ దగ్గరికి వెళ్లి ఆమెని శ్రీ రామానుజాచార్యులవారికి విషం కలిపిన భోజనం పెట్టమని అడుగుతారు.
ఆమె ముందు దానికి అంగీకరించదు, కానీ అవినీతి అర్చకులు ఆమెను బెదిరించి ఒప్పిస్తారు.

Telugu stories, grandmas stories, grandma’s stories, telugu stories for kids, telugu moral stories, grandma stories, grandma tales, moral stories telugu, telugu neethi kathalu, grandma’s bag of stories, betime stories in telugu, telugu kathalu,

సరే అనుకున్నట్టే ఆ స్త్రీ భక్తురాలినంటూ శ్రీ రామానుజాచార్యుల దర్శనార్థం వచ్చిందని చెప్పి శ్రీ రామానుజాచార్యుల వద్దకు వెళ్లి, "భోజనం పెడతాను స్వామి! మీరు ఈ భక్తురాలికి ఆ సేవా భాగ్యం కలిగించండి" అని అడుగుతుంది.

ఆమె ఆంత భక్తితో అడిగేసరికి శ్రీ రామానుజాచార్యులవారు సరే అన్నారు.

ఆ స్త్రీ ఒక మాతృమూర్తి! అసలే సంశయిస్తున్న ఆమెకి ఆ విషం కలిపిన భోజనం వడ్డించేటప్పుడు శ్రీ రామానుజాచార్యులలో తన బిడ్డలు కనిపించారు.

ఇంక ఆమె తట్టుకోలేకపోయింది, వెంటనే శ్రీరామానుజాచార్యులవారి పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ, "అయ్యా! తప్పైపోయింది మీరు ఈ భోజనం తినవద్దు. ఇందులో విషం కలపబడింది. తనకు ఇష్టం లేకపోయినా అవినీతి అర్చకులు తనను బెదిరించి తనతో ఈ పని చేయించారు. నా తప్పుని క్షమించండి" అని శ్రీరామానుజాచార్యులవారిని వేడుకుంది.

Telugu stories, grandmas stories, grandma’s stories, telugu stories for kids, telugu moral stories, grandma stories, grandma tales, moral stories telugu, telugu neethi kathalu, grandma’s bag of stories, betime stories in telugu, telugu kathalu, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయిశ్చిత్తములేదు

దయార్థహృదయులైన శ్రీ రామానుజాచార్యులవారు వెంటనే ఆమెని పైకి లేపి అమ్మా! ఇందులో నీ తప్పు ఏమి లేదని ఆమెని ఓదార్చి, ఆమె చేత ఈ పని చేయించాలని చూసిన ఆ అవినీతి అర్చకులని పిలిపించి "అయ్యో!! మీరు నా మీద ద్వేషంతో ఈ తల్లి చేత ఎంత పాపం చేయించబోయారు నాయనా !! ముందు ఆ తల్లి పాదాలపై పడి క్షమాపణ వేసుకోండి." అని అన్నారు.

అప్పుడు బుద్ధి వచ్చిన ఆ అవినీతి అర్చకులు ఆ తల్లిని తమ తప్పుకి క్షమించమని వేడుకుని ఇంకెప్పుడూ ఇటువంటి పని చేయము ఇంక నుంచి నీతిగా ఉంటాము అని శ్రీ రామానుజాచార్యులవారికి మాట ఇస్తారు. 

ఆ అర్చకుల పాశాత్తపాన్ని చూసిన శ్రీరామానుజాచార్యులవారు వాళ్ళని క్షమించి వదిలేశారు.

అందుకే అన్నారు పెద్దలు, "పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయిశ్చిత్తములేదు" అని.

అంటే ఎవరైనా తమ తప్పు తెలుసుకుని దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే ఆ సందర్భంలో ఈ సామెతని ఉపయోగిస్తారు.

అందుకే అన్నారు పెద్దలు," ఎవరు తీసిన గోతిలో వారే పడతారు" అని.

అంటే ఎవరైనా ఎవరికైనా అపకారం తలపెట్టాలనుకుంటే అది వారికే జరిగినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

ఈ సామెత కథ మీ అందరూ చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Recent posts

The Big Fat Cat And The Mice: A Great Idea

The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...

Popular posts