Grandma stories presents you telugu stories
అవంతీ నగర రాజ్యం విశాలమైనదని, మనోహరమైనదని పొరుగు రాజ్యాల్లో బాగా పేరుంది. ఆ రాజ్యాన్ని పాలించే రాజు మహేంద్రవర్మ ప్రజలని తన బిడ్డల్లా చూసుకుంటాడని అందరూ అనుకుంటారు.
ఒకసారి రాజు మహేంద్రవర్మ అంతఃపురంలో వజ్ర వైడూర్యాలు, రత్నాలతో పొదిగిన ఒక బంగారు నగ దొంగతనం జరిగింది.
"అరెరే!! ఏంతో సుభిక్షమైన శాంతి సామరస్యాలతో ఉండే నా రాజ్యంలో ఇంత పని ఎవరు చేశారు!" అని చాలా బాధపడ్డాడు మహేంద్రవర్మ.
వెంటనే రాజు తన మంత్రి సులోచనుడిని పిలిచి విషయం వివరించి ఆ నగ దొరికేటట్టుగా చర్యలు చేపట్టమని మంత్రిగారిని రాజు ఆదేశించాడు.
మంత్రిగారు బాగా ఆలోచించి ఎవరు లోపలికి రాలేని అంతఃపురంలో దొంగతనం జరిగిందంటే పనివాళ్లే చేసుంటారని మంత్రి భావించాడు.
ఆ మరునాటి ఉదయం పనివాళ్ళందరూ రాగానే మంత్రి వాళ్లందరికీ నాలుగు అంగుళాల చీపిరి పుల్ల ఇచ్చాడు.
మంత్రి ఈ విధంగా చెప్పాడు, "ఈ చీపురు పుల్లని మీరు ఒక్కొకటి తీసుకుని ఆ గదిలో పెట్టి రావాలి. ఎవరైతే దొంగతనం చేశారో వారి చీపురు పుల్ల ఒక అంగుళం పెరుగుతుంది."
పనివాళ్ళందరూ ఆ విధంగా చీపురు పుల్లని లోపల పెట్టారు. నిజంగా దొంగతనం చేసిన పనివాడు చీపురుపుల్లని ఒక అంగుళం ముక్క తుంచి లోపల పెట్టాడు. అందరి ముక్కలు నాలుగు అంగుళాలు ఉంటే దొంగతనం చేసినవాడు చీపురు పుల్ల మూడు అంగుళాలు ఉంది.
ఈ విధంగా దొంగ బయటపడ్డాడు.
రాజు మంత్రిని అభినందించాడు.
అందుకే అన్నారు పెద్దలు " గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు."
అంటే ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయాన్ని తనకి అన్వయించుకోవటాన్ని ఈ సామెత రూపంలో చెప్పారు.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
No comments:
Post a Comment