Tuesday, May 11, 2021

The Tale Of Little Lalita: One Nice trick Up The Sleeve:Telugu Samethalu Telugu Kathalu Grandma Stories

  Grandmas Stories Presents You Telugu Stories

నీవు నేర్పిన విద్యే నీరజాక్షా

telugu stories, youtube, telugu, sametalu, burra kathalu, pitta kathalu, telugu stories, telugu folk stories, telugu stories for kids, telugu samethalu, telugu sametha kathalu, telugu proverbs, grandmas stories, grandma stories, grandma's stories, grandma tales,telugu kathalu,


బరంపురంలో లలిత అనే ఏంతో తెలివైన అమ్మాయి ఉండేది. ఆ ఊరిలో వాళ్లందురు ఆమె తెలివికి ముచ్చట పడుతుండేవారు.

ఒకసారి వాళ్ల దూరపు బంధువు చుట్టపు చూపుకని లలితవాళ్ళింటికి వస్తాడు. అతను లలితకి బాబాయి వరస అవుతాడు.

సరే ఊరు చూపించమని వాళ్ళ నాన్న చెప్పటంతో ఒకరోజు పొద్దునే తయారయ్యి ఊరు చూడటానికి బయలుదేరతారు ఇద్దరు .

ఆ ఉరిలో చూడదగ్గ ప్రదేశాలు ఒక్కొక్కటి చూపిస్తుంది లలిత, ప్రతిదానికి బాబాయి ఎదో ఒక వంక పెడుతున్నాడు.
లలిత బాబాయిని ఆ ఊరిలో పెద్ద పార్కుకి తీసుకువెళ్ళింది అది చూసి బాబాయి,"ఆ సరేలే! ఇదేనా మా ఊరిలో ఇంతకంటే పెద్ద పార్కు ఉంది అన్నాడు." ఆహా! అని ఊరుకుంది లలిత.

లలిత వాళ్ళ ఊరిలోని చాలా ప్రదేశాలు చూపించింది. బాబాయి ఏ ఒక్కదాన్ని వదలకుండా ఎదో ఒక పుల్ల మాట ఆంటూనే ఉన్నాడు, ప్రతిదానికి వంక పెట్టాడు.

సరే ఇలా కాదని లలిత తరువాత రోజు పొద్దునే, బాబాయి టిఫినుకి కుర్చునేసరికి అక్కడికి వచ్చింది.
ఆ రోజు టిఫిను లలితే చేసింది. బాబాయికి టిఫిన్ వడ్డిస్తూ, "ఇది ఇడ్లీ అంటారు. మా ఊళ్ళో ఇది తెల్లగా ఉంటుంది బాబాయ్" అంది.

ఇంకా "ఏమోలే! మా చిన్న ఊరిలో ఇడ్లీలు మీ పెద్ద ఊరిలో ఇడ్లిలలా ఎమైనా ఎరుపు రంగులో ఉండి, గారే రుచిలో ఉంటాయా! ఏమిటి!" అంది.

వెంటనే బాబాయి "అదేమిటి తల్లి అలా అన్నావు ఇడ్లీ ఎక్కడైనా ఇడ్లీలానే ఉంటాయి. తెల్లగా మంచి మినప పప్పు రుచిలో అంతేగాని ఇడ్లీ గారేలా ఎందుకుంటాయి?" అన్నాడు.

తరువాత బాబాయి అలా పొలంలోకి వెళ్లి వద్దామనుకుంటుంటే లలిత కూడా వస్తానని బయలుదేరింది.

దారిలో కొబ్బరిబోండాలవాడు కాయలు కొడుతుంటే "రెండు కాయలు ఇవ్వు" అని తీసుకుని బాబాయి దగ్గరికి వెళ్ళింది లలిత.
"ఇదిగో బాబాయ్ మా ఉరి కొబ్బరిబోండం" అని ఇచ్చింది.
ఇచ్చి ఇలా అన సాగింది, "అబ్బా! మా ఉరి కొబ్బరిబోండం నీళ్లు ఎంత బాగున్నాయో తియ్యగా."

ఇంకా "ఏమోలే మీ ఊరిలో బోండంలో నీళ్లు ఉంటాయో, లేకపోతె దానికి మించి ఇంకేమన్నా ఉంటాయో, లోపల కొబ్బరి బదులు ఇంకేమన్నా అరిసెలు! బూరెలు! ఉంటాయేమో" అంది.

"ఇదేంటమ్మా లలిత ఎక్కడైనా కొబ్బరిబోండంలో నీళ్లు, కొబ్బరి కాకపొతే ఇంకేమి ఉంటాయి?" అన్నాడు బాబాయి.

ఆ రోజంతా లలిత ప్రతి విషయానికి ఇలానే అంటూ ఉంది. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి బాబాయి "అమ్మ లలితా నీవు పొద్దుట నుంచి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు?" అని అడిగాడు.

"అయ్యయ్యో!! బాబాయ్ మీ ఊరిలో మాట్లాడటం కుడా వేరేగా ఉంటుందా!!" అని అడిగేసరికి బాబాయికి విషయం అర్థమైంది.

అప్పుడు బాబాయికి "ఇప్పుడు అర్థం అయ్యింది తల్లి నాకు విషయం.నా మాటలు నాకే బాగా ఒప్పచెప్పావు, మీ ఉరి గొప్ప మీది మా ఉరి గొప్ప మాది. ఒకదానితో వేరొకదాన్ని పోల్చి కించపరచకూడదని నా పద్ధతిలోనే మాట్లాడి నాకు బాగా అర్థమయ్యేలాగా చేశావు, గడుగ్గాయి!" అని లలితను మెచుకున్నాడు బాబాయి .

telugu stories, YouTube, telugu, saametalu, burra kathalu, pitta kathalu, telugu stories, telugu folk stories, telugu stories for kids, telugu samethalu, telugu sametha kathalu, telugu proverbs, grandmas stories, grandma stories, grandma's stories, grandma tales,


అప్పుడు తెలివైన లలిత "నీవు నేర్పిన విద్యే నీరజాక్షా!! " అని నవ్వుతూ అంది.

అందుకే అన్నారు పెద్దలు నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అని.

అంటే ఎవరికైనా వారి పద్దతిలోనే సమాధానం చెప్పినప్పుడు ఈ సామెతని ఉపయోగిస్తారు.

ఈ సామెత కథ మీ అందరూ చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

2 comments:

  1. https://grandmazstories.blogspot.com/2021/05/telugu-samethalu-telugu-kathalu-grandma-stories.html?m=1 Telugu stories are very good for reading grandma stories post more telugu stories grandmaz stories

    ReplyDelete
  2. HI Grandma stories It is good to read stories from proverbs thanks for taking time to post all these wonderful telugu stories

    ReplyDelete

Recent posts

The Big Fat Cat And The Mice: A Great Idea

The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...

Popular posts