Grandma stories presents you telugu stories
పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయిశ్చిత్తములేదు
అవి శ్రీ రామానుజాచార్యులవారు శ్రీ రంగ క్షేత్ర నిర్వహణ బాధ్యత స్వీకరించిన రోజులు. అప్పటికే అక్కడి అర్చకులలో అవినీతి బాగా పెరిగిపోయి ఉంది.
శ్రీ రామానుజాచార్యులవారు ఎవరి అవినీతిని సహించేవారు కారు. దాంతో కోపం వచ్చిన అర్చకులు శ్రీ రామానుజాచార్యులని విషం పెట్టి చంపాలనుకుంటారు.
కానీ వాళ్లు స్వయంగా ఆ పని చేస్తే అనుమానం వస్తుందని ఒక స్త్రీ దగ్గరికి వెళ్లి ఆమెని శ్రీ రామానుజాచార్యులవారికి విషం కలిపిన భోజనం పెట్టమని అడుగుతారు.
ఆమె ముందు దానికి అంగీకరించదు, కానీ అవినీతి అర్చకులు ఆమెను బెదిరించి ఒప్పిస్తారు.
సరే అనుకున్నట్టే ఆ స్త్రీ భక్తురాలినంటూ శ్రీ రామానుజాచార్యుల దర్శనార్థం వచ్చిందని చెప్పి శ్రీ రామానుజాచార్యుల వద్దకు వెళ్లి, "భోజనం పెడతాను స్వామి! మీరు ఈ భక్తురాలికి ఆ సేవా భాగ్యం కలిగించండి" అని అడుగుతుంది.
ఆమె ఆంత భక్తితో అడిగేసరికి శ్రీ రామానుజాచార్యులవారు సరే అన్నారు.
ఆ స్త్రీ ఒక మాతృమూర్తి! అసలే సంశయిస్తున్న ఆమెకి ఆ విషం కలిపిన భోజనం వడ్డించేటప్పుడు శ్రీ రామానుజాచార్యులలో తన బిడ్డలు కనిపించారు.
ఇంక ఆమె తట్టుకోలేకపోయింది, వెంటనే శ్రీరామానుజాచార్యులవారి పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ, "అయ్యా! తప్పైపోయింది మీరు ఈ భోజనం తినవద్దు. ఇందులో విషం కలపబడింది. తనకు ఇష్టం లేకపోయినా అవినీతి అర్చకులు తనను బెదిరించి తనతో ఈ పని చేయించారు. నా తప్పుని క్షమించండి" అని శ్రీరామానుజాచార్యులవారిని వేడుకుంది.
దయార్థహృదయులైన శ్రీ రామానుజాచార్యులవారు వెంటనే ఆమెని పైకి లేపి అమ్మా! ఇందులో నీ తప్పు ఏమి లేదని ఆమెని ఓదార్చి, ఆమె చేత ఈ పని చేయించాలని చూసిన ఆ అవినీతి అర్చకులని పిలిపించి "అయ్యో!! మీరు నా మీద ద్వేషంతో ఈ తల్లి చేత ఎంత పాపం చేయించబోయారు నాయనా !! ముందు ఆ తల్లి పాదాలపై పడి క్షమాపణ వేసుకోండి." అని అన్నారు.
అప్పుడు బుద్ధి వచ్చిన ఆ అవినీతి అర్చకులు ఆ తల్లిని తమ తప్పుకి క్షమించమని వేడుకుని ఇంకెప్పుడూ ఇటువంటి పని చేయము ఇంక నుంచి నీతిగా ఉంటాము అని శ్రీ రామానుజాచార్యులవారికి మాట ఇస్తారు.
ఆ అర్చకుల పాశాత్తపాన్ని చూసిన శ్రీరామానుజాచార్యులవారు వాళ్ళని క్షమించి వదిలేశారు.
అందుకే అన్నారు పెద్దలు, "పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయిశ్చిత్తములేదు" అని.
అంటే ఎవరైనా తమ తప్పు తెలుసుకుని దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే ఆ సందర్భంలో ఈ సామెతని ఉపయోగిస్తారు.
అందుకే అన్నారు పెద్దలు," ఎవరు తీసిన గోతిలో వారే పడతారు" అని.
అంటే ఎవరైనా ఎవరికైనా అపకారం తలపెట్టాలనుకుంటే అది వారికే జరిగినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
ఈ సామెత కథ మీ అందరూ చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
No comments:
Post a Comment