Tuesday, June 8, 2021

Telugu stories From grandmaz Stories

Telugu stories From grandmaz Stories

Grandmas Stories presents you telugu stories

అపాయంలో ఉపాయం

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

అనగనగా ఒక కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి ఉండేది. ఆ అడవిలో అనేక జంతువులు కలిసి మెలిసి ఉండేవి. ఆ అడవికి రాజైన సింహం చెడ్డది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

దానికి నచ్చినట్టు అడవిలో ఉన్న జంతువుల్ని చంపి తిన్నంత తిని మిగిలింది వదిలేసేది.

ఇలా కొన్ని రోజుల జరిగిన తరువాత ఆ అడవిలో జంతువులు తగ్గిపోవటం మొదలైంది.
దాంతో మిగిలిన జంతువుల్లో భయం మొదలైంది. అవి కూడా ఆ సింహపు అన్యాయమైన వేటకి బలుతాయేమోనని భయపడసాగాయి.

అవన్నీ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమావేశంలో జంతువులన్నీ ఒక నిర్ణయం తీసుకున్నాయి "అందరం ఒకేసారి చనిపోయేకంటే రోజుకి ఒక్కొక్కరిగా సింహానికి ఆహారంగా వెళ్ళటానికి" నిర్ణయించుకున్నాయి.
ఆ మాటే సింహం దగ్గరికి వెళ్లి చెప్పాయి. " సరే మీ ఇష్టం" అని సింహం చెప్పింది.

అప్పటినుంచి రోజుకి ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్తున్నాయి. అలా కొన్ని రోజులు గడిచాయి అప్పుడు ఒక కుందేలు వంతు వచ్చింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

దానితో కుందేలు విచారంగా సింహం గుహ దగ్గరికి వెళ్తూ ఉంది. ఆ దారిలో కుందేలుకి ఒక పాడుపడిన బావి కనిపించింది.
అది ఏమిటా అని కుందేలు తొంగి చూసింది. ఆ నీళ్లలో దాని ప్రతిబింబం కనిపించింది.
అప్పుడు దానికి చటుక్కున ఒక ఆలోచన వచ్చింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories
సరే అని సింహం దగ్గరికి వెళ్ళింది.

అప్పుడు కుందేలు సింహంతో "రాజా దారిలో వస్తుండగా నాకు నీలాగే ఇంకో సింహం కనిపించింది. అది నన్ను తినేయబోతే, నీ ఆహారం అని తప్పించుకు వచ్చాను" అని చెప్పగానే సింహానికి చాలా కోపం వచ్చింది.

వెంటనే సింహం "అదెక్కడ ఉంది నాకు చూపించు దాన్ని ఇప్పుడే చంపేస్తాను." అని లోపంతో అరిచింది.

పథకం పారటంతో కుందేలు సింహాన్ని ఆ పాడుబడిన బావి దగ్గరికి తీసుకెళ్లింది.
అప్పుడు కుందేలు "ఆ సింహం ఈ బావిలోనే ఉంది. బాబోయ్!! అమ్మోయ్!! నేను దాని దగ్గరికి వెళ్ళను ," అని తెలివిగా దూరంగా ఉండిపోయింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

అసలే కోపం మీద ఉన్న సింహం ఇంక ఏమి ఆలోచించకుండా ఆ బావి దగ్గరికి వెళ్లి అందులోకి తొంగి చూసింది. బావిలో దాని ప్రతిబింబం దానికే కనిపించింది.
ఇదే కుందేలు చెప్పిన మరొక సింహం అనుకుని దానిని భయపెడదామని గట్టిగా అరిచింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

దాని అరుపు దానికే వినిపించి ఆ బావిలోని రెండవ సింహం దీని మీదకి అరిచింది అని అనుకుంది.

వెంటనే ఇంక ఆలస్యం చేయకుండా, ఏమి ఆలోచించకుండా సింహం లోపలున్న మరొక సింహాన్ని చంపటానికి బావిలోకి దూకింది. బావిలోకి దూకిన సింహం చచ్చింది.

ఇంకేముంది తన పథకం చక్కగా పారిందని, సింహం పీడా విరగదయ్యిందని కుందేలు సంతోషంగా వెళ్లి మిగిలిన జంతువులకి చెప్పగానే అవి కూడా ఆనందించి "అపాయంలో ఉపాయం"ఉపయోగించి కుందేలు ఆ అడవిలోని జంతువులనన్నిటినీ కాపాడిందని ఎంతో అభినందించాయి.
అందుకే అన్నారు పెద్దలు " అపాయంలో ఉపాయం" అని.

అంటే ఎవరైనా ఏదైనా అపాయంలో ఉన్నప్పుడు ఏదైనా చక్కటి ఉపాయంతో ఆ అపాయం నుంచి తప్పించుకున్నప్పుడు ఈ సామెతని ఉపయోగిస్తారు.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Monday, June 7, 2021

An Interesting Story of Sri Krishnadevaraya From Telugu stories

An Interesting Story of Sri Krishnadevaraya From Telugu stories

Grandmas Stories presents you telugu stories

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

శ్రీకృష్ణదేవరాయలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విజయనగర సామ్రాజ్యాన్ని పాలించినటువంటివాళ్లలో ముఖ్యమైన రాజు. భారతావనిలో దరిదాపులా దక్షిణాపథాన్నంతా తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు.

 సాహిత్యం, కవిత్వం, మొదలైన విషయాలలో కూడా శ్రీకృష్ణదేవరాయలు నిజమైన దిట్ట. తాను స్వయంగా "ఆముక్తమాల్యద" రచించాడు.

ఇప్పుడు ఒక రోజు జరిగిన సాహిత్య కార్యక్రమంలోని విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక రోజున శ్రీకృష్ణదేవరాయలు అష్ట దిగ్గజాలతో కూడి ఉన్నటువంటి నిండు సభలో ఈ విధంగా ఒక తర్క సమస్యని సభా సదుల ముందు ఉంచాడు.

"రామునికి ముగ్గురు తమ్ముళ్లు, ధర్మరాజుకి నలుగురు తమ్ముళ్లు, రాముడి తమ్ముళ్లు గొప్పవారా, లేక ధర్మరాజు తమ్ముళ్లు గొప్పవారా?" దీనికి సమాధానం చెప్పమన్నాడు.

దీనికి కొంతమంది రాముడి తమ్ముళ్లు గొప్పవారన్నారు. శ్రీకృష్ణదేవరాయలు కారణమేమిటని అడిగితే చెప్పలేకపోయారు. మరికొంతమంది ధర్మరాజు తమ్ముళ్లు గొప్పవారని చెప్పారు. వీళ్ళు కారణం చెప్పలేకపోయారు.
అప్పుడు అందరూ, ప్రభూ మీరే దీనికి సమాధానం చెప్పండన్నారు.

అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు సమాధానం ఇస్తూ రాముడికంటే రాముడి తమ్ముళ్లు ముగ్గురూ శక్తి తక్కువవాళ్ళు, అందుకని వాళ్ళు రాముడికి అనుకూలంగా ఉండటంలో విశేషం ఏమిలేదు. కానీ ధర్మరాజు తమ్ముళ్లు నలుగురూ జగదేకవీరులు, నాలుగు పక్కలా సమస్త సామ్రాజ్యాలనీ జయించారు, నలుగురు తమ్ముళ్లు ధర్మరాజు కంటే మహావీరులైనప్పటికీ ధర్మరాజు మాటకి లోబడి ఉన్నారు.

అందుకని రాముడి తమ్ముళ్ల కంటే ధర్మరాజు తమ్ముళ్లు గొప్పవారు. ఇంతలో సభలోంచి ఒక వ్యక్తి ప్రభూ ఈ జన్మలోకూడా మీరు పాండవ పక్షపాతులే అని అన్నాడు.
శ్రీకృష్ణదేవరాయలు అతని మాటలకు ఎంతో సంతోషపడి అక్షర లక్షలు ధనం ఇచ్చి సత్కరించాడు. ఇంతకీ సభలోని వ్యక్తి చెప్పిన దాని అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడే మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలుగా పుట్టాడని ఆ వ్యక్తి మాటలకి అర్థం.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Sunday, May 30, 2021

Telugu Stories A popular Proverb Story

Telugu Stories A popular Proverb Story

Grandmas Stories presents you telugu stories

అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు

stories for kids,telugu samethalu,grandma stories,telugu neeti kathalu,telugu proverbs,pitta kathalu,must read telugu stories,telugu stories,grandmaz stories,telugu kathalu,moral stories telugu,

అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక తాబేలు ఉండేది. ఆ అడవికి రాజైన సింహం ఈ తాబేలుతో ఎంతో స్నేహంగా ఉండేది.

ఆ అడవిలో అన్ని జంతువులకీ తినటానికి తిండి, తాగటానికి నీరు పుష్కలంగా ఉండేవి. అందువలన అన్ని జంతువులూ చాలా చక్కగా కలసి మెలసి స్నేహంగా ఉండేవి.

అలాంటిది ఆ అడవిలోకి ఒక జిత్తులమారి నక్క కొత్తగా వచ్చింది. దానికి ఈ అడవిలో అన్ని జంతువులూ ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా స్నేహంగా ఉండటం అస్సలు నచ్చలేదు.

stories for kids,telugu samethalu,grandma stories,telugu neeti kathalu,telugu proverbs,pitta kathalu,must read telugu stories,telugu stories,grandmaz stories,telugu kathalu,moral stories telugu,

ఇంక ఆ జిత్తులమారి నక్క ఎలా ఆ అడవిలో అన్ని జంతువుల మధ్య గొడవ పెట్టాలా అని ఆలోచించటం మొదలు పెట్టింది.

ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట చెప్పి అందరి మధ్య తంపులు పెట్టడం మొదలు పెట్టింది.

చెరువు దగ్గర ప్రశాంతంగా నీళ్లు తాగుతున్న ఏనుగు దగ్గరికి వెళ్లి "ఏనుగు మామ! ఏనుగు మామ! నీ గురించి ఆ కుందేలు ఏముందో తెలుసా?" అని అడిగింది.

వెంటనే ఏనుగు "ఆ చెప్పు నక్క బావ! ఆ కుందేలు నా గురించి ఏమనింది?" అని అడిగింది.

ఆహా!! నా పథకం పారింది అని అనుకుని, "నీవు చాలా లావుగా ఉంటావంట, నీకు పెద్ద తొండం అంట, నీ చెవులు ఎంతో పెద్దవిగా వింతగా ఉంటాయంట, అని అంది ఆ కుందేలు" అని చెప్పింది జిత్తులమారి నక్క.
stories for kids,telugu samethalu,grandma stories,telugu neeti kathalu,telugu proverbs,pitta kathalu,must read telugu stories,telugu stories,grandmaz stories,telugu kathalu,moral stories telugu,

ఇంకేముంది వెంటనే కుందేలుకి ఏనుగుకీ గొడవ మొదలైంది.

ఇలా ఆ అడవిలోని అన్ని జంతువులకీ ఒకరంటే ఒకరు పడకుండా చేసింది.

ఒక రోజు ఆ జిత్తులమారి నక్కకి తాబేలు మాంసం తినాలని అనిపించింది. వెంటనే ఒక ఉపాయం అలోచించి తాబేలు స్నేహితుడైన రాజు సింహం దగ్గరికి వెళ్లి "ఓ రాజా!! నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. అందులో ఒక ముని నాకు కనిపించి నీవు గనుక తాబేలు మాంసాన్ని తింటే నీవు ఈ అడవికే కాకుండా అన్ని అడవులకీ రాజువి అవుతావని చెప్పాడు." అని అంది.

stories for kids,telugu samethalu,grandma stories,telugu neeti kathalu,telugu proverbs,pitta kathalu,must read telugu stories,telugu stories,grandmaz stories,telugu kathalu,moral stories telugu,

వెంటనే సింహం "కానీ నేను తాబేలుని ఎలా తినగలను? అది నా స్నేహితుడు" అని అంది.

దానికి జిత్తులమారి నక్క"నాకు వచ్చిన కల నీతో చెప్పను, ఆపైన నీ ఇష్టం. ఆ తాబేలు గనుక నీ నిజమైన స్నేహితుడైతే నీవు అన్ని అడవులకీ రాజువయితే అది కూడా ఆనందిస్తుంది కదా!! ఈ చిన్న త్యాగానికి వెనుకాడుతుందా ఏమిటి?" అని అంది.

సింహం ఆ జిత్తులమారి నక్కమాటలని నిజమని నమ్మి తన స్నేహితుడైన తాబేలుకి విషయం చెప్పి దానిని తినటానికి వెళ్ళింది.

తాబేలు ఏంతో తెలివైనది. సింహం దాని దగ్గరికి వెళ్లి విషయం మొత్తం చెప్పింది.

stories for kids,telugu samethalu,grandma stories,telugu neeti kathalu,telugu proverbs,pitta kathalu,must read telugu stories,telugu stories,grandmaz stories,telugu kathalu,moral stories telugu,

అంతా విన్న తాబేలుకి అసలు విషయం అర్థమయ్యింది. అదే కాకుండా ఈ మధ్య అడవిలో జంతువులన్నిటి మధ్య వస్తున్న గొడవలకి కూడా ఈ జిత్తులమారి నక్కే కారణమని తాబేలు తెలుసుకుంది. అన్ని జంతువులూ తాబేలు దగ్గరికి వచ్చి వాటి గురించి, "ఆ కుందేలు ఇలా అందని నక్క చెప్పింది.....", లేకపోతే "ఆ జింక ఇలా అందని నక్క చెప్పింది.....", అని తాబేలుతో చెప్పాయి.

stories for kids,telugu samethalu,grandma stories,telugu neeti kathalu,telugu proverbs,pitta kathalu,must read telugu stories,telugu stories,grandmaz stories,telugu kathalu,moral stories telugu,

ఆ జిత్తులమారి నక్కకి గుణపాఠం చెప్పటానికి ఇదే సరైన అవకాశం అనుకుని తాబేలు సింహంతో "రాజా!! నీవు చెప్పింది విన్న తరువాత నాకు ఎంతో ఆనందం కలిగింది. నీకు అన్ని అడవులకీ రాజయ్యే గొప్ప అదృష్టం నన్ను తినటంతో వస్తుందంటే నేను ఆనందంగా నీకు ఆహారం అవుతాను. నా మిత్రుడు అంత గొప్పవాడైతే నాకే గర్వం." అని అంది.

ఇది విన్న సింహం "ఆహా నీవు నా నిజమైన మిత్రుడివి, అందుకే సరిగ్గా నక్క బావ చెప్పినట్టే మాట్లాడావు." అని అంది.

దానికి తాబేలు "అవును మిత్రమా!! మనందరి మంచి గురించి ఎంతో ఆలోచించే నక్క బావకి మనం ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోలేము, కానీ ఇంత గొప్ప పనికి మంచి ముహూర్తం పెట్టుకుని అప్పుడు తిందువు నన్ను, వెంటనే నీవు అడవులన్నిటికీ రాజువైపోతావు." అని అంది.

తన స్నేహితుడు తన మంచి గురించి ఇంత అలోచించి చెప్పేసరికి సింహం ఆనందంగా తాబేలు చెప్పినదానికి ఒప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

నిర్ణయించిన రోజు, సమయం రానే వచ్చింది, అడవిలోని జంతువవులన్నీ సింహం చెప్పిన స్థలానికి చేరుకున్నాయి. ఇక ఆ జిత్తులమారి నక్క ఆనందానికి హద్దులు లేవు. ఇంకొద్దిసేపటిలో ఆ సింహం తినగా మిగిలిన తాబేలు మాంసాన్ని ఆనందంగా తిందామని ఎదురుచూస్తోంది.

stories for kids,telugu samethalu,grandma stories,telugu neeti kathalu,telugu proverbs,pitta kathalu,must read telugu stories,telugu stories,grandmaz stories,telugu kathalu,moral stories telugu,

ఇంతలో తాబేలు రానే వచ్చింది, వస్తూనే తాబేలు సింహంతో " రాజా నీకు వెంటనే ఒక విషయం చెప్పాలి" అని అంది.

సింహం "సరే" అంది.

అప్పుడు తాబేలు "రాజా!! మొన్న నక్క బావ కలలో కనిపించిన ముని నిన్న రాత్రి నా కలలో కనిపించి, నేను ఏ నక్క కలలోనైతే కనిపించి ఈ విషయం చెప్పానో ముందు ఆ నక్కని తిన్న తరువాత నిన్ను తినాలి అప్పుడే ఆ సింహం అన్ని అడవులకి రాజు అవుతుందని చెప్పాడు." అని అంది.

stories for kids,telugu samethalu,grandma stories,telugu neeti kathalu,telugu proverbs,pitta kathalu,must read telugu stories,telugu stories,grandmaz stories,telugu kathalu,moral stories telugu,

అప్పుడు సింహం "ఓసి ఇంతేనా!! నా కోసం నక్క బావ ఈ మాత్రం చేయలేడా!!" అని అంటూ ఆ జిత్తులమారి నక్క దగ్గరికి వెళ్ళింది.

వెంటనే ఆ జిత్తులమారి నక్క తన పని అయిపొయింది అని అనుకుని, ఆ తెలివైన తాబేలు తన గుట్టు బయటపెట్టడానికి ఇదంతా చేసిందని అర్థం అయ్యి, "ఓ రాజా!! నన్ను క్షమించు!! నిజంగా నాకు ఏ కలా రాలేదు, ఆ తాబేలు మాంసం తినాలని ఈ నాటకం ఆడాను. నన్ను తినకు" అని సింహం కాళ్ళ మీద పడింది.

stories for kids,telugu samethalu,grandma stories,telugu neeti kathalu,telugu proverbs,pitta kathalu,must read telugu stories,telugu stories,grandmaz stories,telugu kathalu,moral stories telugu,

ఇదంతా విన్న సింహం, తాబేలు, ఆ అడవిలోని జంతువులూ, అన్నీ ఆ జిత్తులమారి నక్క దుర్బుద్ధి అర్థం చేసుకున్నాయి. వెంటనే సింహం ఆ జిత్తులమారి నక్కని ఆ అడవి నుంచి తరిమి కొట్టింది.

తెలివైన తాబేలు చేసిన మంచి పనికి ఆ అడవిలోని జంతువులన్నీ అభినందించాయి.

అప్పటినుంచీ మళ్ళీ ఆ అడవిలోని జంతువులన్నీ తిరిగి ఎంతో స్నేహంగా, ఆనందంగా, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవించసాగాయి.

అందుకే అన్నారు పెద్దలు "అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు" అని.

అంటే ఎవరైనా వారు చెప్పింది సాగినంత కాలం ఎంతో గొప్పవారిగా ఉంటూ, వారికి వారి చేష్టల వల్ల ఏదైనా హాని జరుగుతుందని తెలియగానే ఎదుటి వ్యక్తుల కాళ్ళ మీద పడటానికి కూడా సిద్ధమయ్యే వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతని ఉపయొగిస్తారు.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Saturday, May 29, 2021

Grandma Telugu Stories From Telugu Proverbs

Grandmas Stories presents you telugu stories

Grandma Telugu Stories From Telugu Proverbs

అర్థం చేసుకునే భర్త ఉంటే ఆ భార్యకి అన్నీ కలిసి వస్తాయి

stories for kids,telugu samethalu,grandma stories,telugu neeti kathalu,telugu proverbs,must read telugu stories,telugu stories,grandmaz stories,telugu kathalu,moral stories telugu,
రాజారావు, రమణి ఇద్దరూ భార్యా భర్తలు. రాజారావు పెద్ద వ్యాపారస్తుడు. రమణి చాలా అందంగా, వినయంగా ఉందని మధ్యతరగతి అమ్మాయైనా తనకి బాగా నచ్చి రాజారావు ఆమెని వివాహం చేసుకున్నాడు.
ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నా రమణికి తన భర్తతో ఎక్కువసేపు గడపాలని ఉండేది.

కానీ రాజారావు పెద్ద వ్యాపారస్తుడు అవటంతో అతనికి ఆ పనుల ఒత్తిడి వలన ఎక్కువసేపు ఆఫీసులో గడపాల్సి వచ్చేది, ఇంటికి వచ్చేసరికి పొద్దుపోయేది. రమణి ప్రతి రోజూ భర్త గురించి ఎదురుచూసి అతను త్వరగా ఇంటికి రానందుకు బాధపడేది.

ఇలా ఉండగా వారి ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఒక చిన్న గుడిసె ఉండేది. అందులోకి కొత్తగా భార్య, భర్త వచ్చి చేరారు. వాళ్ళు రోజూ పొద్దున్నే పనిలోకి వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత ఆనందంగా ఇద్దరూ కలిసి ఇంటి పని చేసుకునేవారు.

రోజూ రమణి వీళ్ళని చూస్తూ తన భర్త కూడా తనతో అలా ఉండాలని కోరుకుంటూ భర్తని సతాయించటం మొదలుపెట్టింది. రాజారావు ఎంత ప్రయత్నించినా అతనికి త్వరగా రావటం కుదరటంలేదు. ఇక భార్య బాధ చూడలేక ఒక పని చేయాలని అనుకున్నాడు.

stories for kids,telugu samethalu,grandma stories,telugu neeti kathalu,telugu proverbs,must read telugu stories,telugu stories,grandmaz stories,telugu kathalu,moral stories telugu,

ఒక రోజు తెల్లవారు ఝామున 950 రూపాయలు డబ్బు మూట తీసుకువచ్చి పక్కనేవున్న గుడిశె దగ్గరకి వెళ్లి వారి గుమ్మం ముందు పెట్టి వచ్చాడు.

తెల్లవారి పనిలోకి వెళదామని లేచిన భార్య భర్తలిద్దరూ, తలుపు తీసి గుమ్మం ముందున్న మూటని చూసి, అందులోని డబ్బు చూసి ఆశ్చర్యపడి వెంటనే లెక్కపెట్టుకున్నారు. అందులో 1000 రూపాయలకి 50 రూపాయలు తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఆ భార్యా భర్తలిద్దరూ ఆ 950 రూపాయలని ఎక్కువగా పనిచేసయినా 1000 రూపాయలు చేయాలని అనుకుని, ఆ రోజు ఎక్కువగా పనిచేసి ఇంటికి ఆలస్యంగా వచ్చారు.

ఇంక ఆ రోజు నుంచి డబ్బు ఎక్కువగా సంపాయించాలనే కోరిక వాళ్లలో కలిగి, వారిద్దరూ ఎక్కువగా పని చేసి ఆలస్యంగా ఇంటికి రావటం మొదలుపెట్టారు. వాళ్ళు ఇంటి దగ్గర సరదాగా గడపటం తగ్గిపోయింది.

ఇది రోజూ చూస్తున్న రమణి ఎంతో బాధపడి అదే విషయం భర్త రాజారావుతో చెప్పింది. అది విన్న రాజారావు తన ఎత్తు పారినందుకు మనసులోనే సంతోషపడి, భార్యని ఓదారుస్తూ నువ్వేం బాధపడకు సంపాదించుకోవాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రావు, ఇప్పడు సంపాయించకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తారు.

నేను కూడా ఇక నుండి సాధ్యమైనంత వరకు ఇంటికి త్వరగా వస్తాననటంతో రమణి భర్త తనను అర్థం చేసుకున్నందుకు ఎంతో సంతోషపడింది.

stories for kids,telugu samethalu,grandma stories,telugu neeti kathalu,telugu proverbs,must read telugu stories,telugu stories,grandmaz stories,telugu kathalu,moral stories telugu,

అందుకే అన్నారు పెద్దలు "అర్థం చేసుకునే భర్త ఉంటే  అన్నీఆ భార్యకి కలిసి వస్తాయని."

అంటే పై కథలో చెప్పిన విధంగా భార్య భర్తలిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సుఖంగా జీవించటం అని.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Friday, May 28, 2021

Grandma Stories Telugu proverb story

Grandmas Stories presents you telugu stories

Grandma Stories Telugu proverb story

పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చింది

ఒక గ్రామంలో రెండు పిల్లులు ఉన్నాయి. ఆ పిల్లులు ఆ గ్రామంలోని ఇళ్లల్లో తిరుగుతూ వారి ఇళ్లల్లోని పాలూ, పెరుగూ దొంగతనంగా తింటూండేవి. ఆ రెండిటిలో ఎవరికి ఆహారం దొరికినా అవి రెండూ సమానంగా పంచుకుని తినేవి. 

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, moral stories telugu, grandma tales, telugu proverbs, stories

ఒకరోజు రెండు పిల్లులూ కలిసి ఆహారం కోసం వెతుకుతుండగా వాటికి ఒక తాళం పెట్టిన ఇల్లు కనిపించింది. ఇక ఆ రెండు పిల్లుల ఆనందానికి అంతే లేదు. ఆ ఇంటి దొడ్డి వైపు నుంచి ఆ ఇంటిలోకి ప్రవేశిసించి, ఏమైనా తినటానికి దొరుకుతుందేమోనని వెతకసాగాయి.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, moral stories telugu, grandma tales, telugu proverbs, stories

వారి వంట ఇంటిలో ఆ రెండు పిల్లులకి కొంచెం గిన్నెలో మిగిలిఉన్న పాలు, ఒక పెద్ద రొట్టె ముక్క కనిపించాయి. వెంటనే పిల్లులు రెండూ పోటీపడి మరీ ఆ మిగిలిన పాలు తాగేశాయి. పక్కనే ఉన్న చెట్ల దగ్గరికి వెళ్లి ఆ రొట్టెని తిందామని అక్కడ ఉన్నపెద్ద రొట్టెని తీసుకుని బయటికి వచ్చాయి.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, moral stories telugu, grandma tales, telugu proverbs, stories

ఇక ఆ పెద్ద రొట్టెని రెండు సగాలుగా పంచుకున్నాయి. కానీ మొదటి పిల్లి రెండో పిల్లితో "తనకు తక్కువ రొట్టె ముక్క వచ్చింది నీకు ఎక్కువ రొట్టె ముక్క వచ్చింది, ఇది న్యాయం కాదు" అని అంది.

అప్పుడు రెండో పిల్లి "లేదు లేదు నాకు నీకన్నా తక్కువ రొట్టె ముక్క వచ్చింది అందువలన నీ రొట్టె ముక్కలోంచే నాకు మరికొంత ఇవ్వు." అని అంది.

ఇదంతా చెట్టు మీద దూరం నుంచి గమనిస్తున్న కోతి చక చకా అక్కడికి వచ్చి "మిత్రులారా!! ఏమిటి సంగతి? దేనికో గొడవపడుతున్నట్టు కనిపిస్తోంది, విషయం ఏంటో తెలిస్తే నేనేమైనా సహాయం చేయగలనేమో చూస్తాను" అని అంది.
అప్పుడు మొదటి పిల్లి చూడు మిత్రమా "నీవే న్యాయం చెప్పు, ఈ రెండు రొట్టె ముక్కలలో ఏది పెద్దదిగా ఉంది?" అని అంది.

వంటనే రెండో పిల్లి "చూడు మిత్రమా నా రొట్టె ముక్క, ఆ రొట్టె ముక్కకన్నా చిన్నగా ఉంది." అని అన్నది.
ఇలా రెండు పిల్లులూ నా రొట్టె ముక్క చిన్నదంటే, నా రొట్టె ముక్క చిన్నదని గొడవపడుతుంటే ఆ కోతికి చటుక్కున ఒక ఉపాయం వచ్చింది.

అప్పుడు ఆ కోతి "మిత్రులారా!! అయ్యో!! ఇంత చిన్న విషయానికి గొడవ పడుతున్నారా, నేను మీ సమస్యను క్షణాల్లో పరిష్కరిస్తాను." అని అన్నది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, moral stories telugu, grandma tales, telugu proverbs, stories

అలా అని ఆ రెండు రొట్టె ముక్కలని తన చేతిలోకి తీసుకుని ఒక రొట్టె ముక్కని కొంచెం తిని, "ఆహా ఇప్పుడు చూడండి రెండు రొట్టె ముక్కలు సరిసమానంగా ఉన్నాయి" అని అంది.

మళ్లీ వెంటనే "అరెరే!! లేదు, లేదు ఇప్పుడు ఈ ముక్క పెద్దదిగా ఉంది అంటూ రెండో రొట్టె ముక్కని కొంచెం తినింది." తిని ఇలా అంది, "ఆహా! ఇప్పుడు చూడండి రెండు రొట్టె ముక్కలు సరిసమానంగా ఉన్నాయి."

ఇలా ఆ తెలివైన కోతి ఆ రెండు రొట్టె ముక్కలనూ ఒకసారి ఇది పెద్దది, ఇంకొకసారి అది పెద్దది అని ఆ రెండు రొట్టె ముక్కలనూ పూర్తిగా తినేసింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, moral stories telugu, grandma tales, telugu proverbs, stories

పక్కనే ఉన్న పిల్లులూ రెండు ఎవరిది పెద్ద రొట్టె ముక్క అని ఆశక్తిగా గమనిస్తున్నాయి. చూస్తుండగానే, ఆ రెండు రొట్టె ముక్కలనూ తినేసిన కోతి చటుక్కున ఒక్క గెంతు గెంతి పక్కనే ఉన్న చెట్టుమీదకి దుమికి "వెర్రి పిల్లులరా!! మీ రెండు ముక్కలూ నాకు తినటానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు!! పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చింది" అని అక్కడినుంచి తుర్రున మాయమైంది.

అందుకే అన్నారు పెద్దలు "పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చింది" అని.

అంటే ఎవరైనా ఇద్దరు గొడవపడుతుంటే వారి మధ్యలో మూడో వ్యక్తి దూరి ఆ ఇద్దరినీ మోసం చేసి తాను లాభం పొందినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Thursday, May 27, 2021

Telugu Moral Stories From Grandma

Grandmas Stories presents you telugu stories

Telugu Moral Stories From Grandma

విచక్షణతో కూడిన కోరిక శ్రేయస్కరం

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, telugu

సత్యపురం అనే ఊరిలో పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి భార్య ఒక కూతురు ఉన్నారు. అతనికి చాలా బంగారం సంపాదించాలనే ఆశ ఉండేది. ఆ ఆశతో పాపయ్య శివుడి గురించి తపస్సు చేశాడు.

కొంత కాలానికి శివుడు ప్రత్యక్షం అయ్యి పాపయ్యను "ఎం కావాలో కోరుకో పాపయ్య" అన్నాడు.

పాపయ్య వెంటనే "తాను ముట్టుకున్నదంతా బంగారం కావాలి" అని అన్నాడు.

ఒక నిమిషం ఆలోచించి కోరుకోమని శివుడు హెచ్చరించాడు.

కానీ పాపయ్య వినలేదు తనకు బంగారు వరమే కావాలన్నాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, telugu moral stories

శివుడు "తథాస్తు!!!!!" అని మాయమయ్యాడు.
పాపయ్య తన ఇంటికి వచ్చాడు. ఇల్లంతా తడిమి చూశాడు. ఇల్లు అంతా బంగారం అయిపోయింది.

ఇంట్లో అన్నివస్తువులు తడిమి చూశాడు, అన్నీ బంగారం అయిపోయాయి.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, telugu moral stories

ఇంతలో పాపయ్య కూతురు నాన్న అంటూ దగ్గరికి వచ్చింది.

తన కూతురుని ఆనందంగా ఎత్తుకున్నాడు, ఇంకేముంది కూతురు కూడా బంగారం అయిపోయింది.

ఇంట్లోకి వెళ్లి మంచి నీళ్లు తాగుదామనుకుని నీళ్లు గ్లాసులోంచి నోట్లో పడిందే, మంచినీళ్లు కూడా బంగారం అయిపొయింది.

ఇదంతా చూస్తున్న పాపయ్య భార్య వచ్చి దీని వలన మీరు ఏమి సాధించగలిగారు అని బాధపడసాగింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, telugu moral stories

బాధపడుతున్న పాపయ్య తనకు తెలియకుండానే తన చేతులు తన నెట్టి మీద పెట్టుకున్నాడు. తాను కూడా బంగారం అయిపోయాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, telugu moral stories

అందుకే అన్నారు పెద్దలు "విచక్షణతో కూడిన కోరిక శ్రేయస్కరం" అని.

హద్దులు మీరినటువంటి ఆశ నరకం అవుతుంది.
ఏదైనా కోరుకునేటప్పుడు విచక్షణని ఉపయోగించాలని దీని వలన మనం తెలుసుకోవాలి.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Wednesday, May 26, 2021

GRANDMA TELUGU TALES

Grandmas Stories presents you telugu stories

GRANDMA TELUGU TALES

దుష్టులకి దూరంగా ఉండాలి

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

విద్యారణ్య అడవిలో ఒక తోడేలు ఉండేది. ఆ తోడేలు మిగతా అన్ని జంతువులనీ మోసం చేస్తూ ఉండేది. ఒక రోజున తోడేలు దృష్టిలో బాగా బలిసిన కోతి కనిపించింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

తోడేలుకు కోతి యొక్క గుండెను తినాలనిపించింది. అప్పటినుంచి తోడేలు కోతితో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

మిగతా జంతువులు తోడేలుతో స్నేహం పనికిరాదని కోతికి చెప్పాయి. కానీ కోతి వాటి మాట వినలేదు. ఈ విధంగా కొన్ని రోజులు జరిగాయి. 

బాగా నమ్మకం ఏర్పడిన తరువాత ఒక రోజున తోడేలు కోతిని దిట్టమైన అడవిలోకి తీసుకుని వెళ్ళింది. అక్కడ తోడేలు కోతితో చాలా రోజులుగా నీ గుండెకాయ తినాలని ఉంది అందుకే నీతో స్నేహం చేశాను. ఇప్పుడు నీ గుండెకాయ తినేస్తాను అని అన్నది.

అప్పుడు కోతి తన తోటి జంతువులు చెప్పిన మాట విననందుకు బాధపడింది. కోతి తెలివిగా అలోచించి ఇలా చెప్పింది, "మిత్రమా!! నీకు నా గుండెని ఇచ్చేదానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు ఇంతలా అడగాలా!! కానీ నా గుండె చెట్టు మీద పెట్టి వచ్చాను. నీవు నాతో వస్తే నా గుండె నీకు ఇచ్చేస్తాను. "

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

దీనికి మూర్ఖురాలైన తోడేలు సంతోషంగా ఒప్పుకుని కోతితో పాటు చెట్టు దగ్గరికి వచ్చింది.

ఆ సమయానికి మిగతా జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి, కోతి మిగతా జంతువులన్నిటికీ జరిగిన విషయం చెప్పింది. అన్ని జంతువులూ కలసి తోడేలును తన్ని తరిమేశాయి.

అందుకనే "దుష్టులకు దూరంగా ఉండమని" చెప్తారు.

అంటే ఎవరైనా చెడ్డవారు అని తెలిసి వారితో స్నేహం చేయటం మంచిది కాదు అని అర్థం. పై కథలో చెప్పినట్టు చెడు ప్రవ్రుత్తి కలిగినవారిని ఎప్పుడూ నమ్మకూడదు అని అర్థం.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

Recent posts

The Big Fat Cat And The Mice: A Great Idea

The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...

Popular posts