Sunday, May 23, 2021

Grandma Telugu Stories From Proverbs

Grandmas Stories presents you telugu stories

పెద్దలమాట చద్దిమూట

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu, grandmaz stories,

శ్రావణపురంలో శరభయ్య అనే చేయి తిరిగిన రైతు ఉండేవాడు. అతను సేంద్రియ వ్యవసాయంలో అనేక పద్దతులతో అద్భుతమైన పంటలని పండిస్తూ ఉండేవాడు.

 అతని నాణ్యమైన పశు సంపద కూడా ఉండేది. ఇదంతా అతని కష్టార్జితం.

శరభయ్య ప్రతి రోజు తెల్లవారుఝామునే లేచి వ్యవసాయ పనులు మొదలు పెట్టి, పనివారికి పని పురమాయించి, వారు ఆ పని సరిగ్గా చేశారో లేదో చూసుకుని, ఇంకా ఏమి కొత్త పద్ధతులతో వ్యవసాయం చేస్తే పంట మరింత మెరుగుపడుతుంది అని కొత్త ప్రయోగాలు చేసి, ఇలా అన్ని పనులు పూర్తిచేసుకుని పొద్దుపోయిన తరువాత ఇంటికి చేరుకునేవాడు.

ఒక్క మాటలో శరభయ్యకి వ్యవసాయం అంటే పంచ ప్రాణాలు. అటువంటి శరభయ్యకి రమేష్,ఉమేష్ అనే ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రమేష్కి దేశ భక్తి ఎక్కువ, ఎప్పుడూ దేశం కోసం ఏమైనా చేయాలి, అందుకోసం సైన్యంలో చేరాలి అని అనుకునేవాడు. ఇంక రెండో కొడుకు ఉమేష్కి వ్యాపారం చేయటం అంటే ఇష్టం.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu, grandmaz stories,

తన తరువాత తన పొలాన్ని, పశు సంపదని ఎవరు చూసుకుంటారు అని శరభయ్యకి ఒకటే చింతగా ఉండేది.

ఇక ఒకరోజు శరభయ్య పెద్ద కొడుకు రమేష్ని పిలిచి "నాయన నీవు భవిష్యత్తులో ఏమి చేయాలనుకుంటున్నావు?" అని అడిగాడు.

దానికి రమేష్ "నేను సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను నాన్న" అని ఖచ్చితంగా చెప్పాడు.
శరభయ్య సరే అని చెప్పి పెద్ద కొడుకుని సైన్యంలోకి పంపాడు.
కొంత కాలం తరువాత శరభయ్య చిన్న కొడుకు ఉమేష్ని పిలిచి "నాయన, నీ అన్నయ్య సైన్యంలో చేరాడు, ఇక నాకు సాయంగా ఉండాల్సింది నీవే, నీకు ఇష్టమైన వ్యాపారం చేసుకుందువుకానీ అప్పటిదాకా నాకు వ్యవసాయంలో సాయం చెయ్యి." అని అడిగాడు.

ఉమేష్కి తన నాన్న చెప్పింది బాగానే అనిపించింది, అందువలన దానికి ఒప్పుకుని శరభయ్యకి వ్యవసాయంలో సాయంగా ఉంటూ వచ్చాడు.

కొంత కాలానికి శరభయ్య చనిపోయాడు. చనిపోతూ ఉమేష్తో "నాయన నా ఆస్తిని నీ అన్నయ్యతో సరి సమానంగా పంచుకో, పొలాన్ని, పశువుల్ని కన్న బిడ్డల్లా చూసుకో" అని చెప్పి చనిపోయాడు.

ఉమేష్ కొంత కాలం అన్నీ బాగానే చూసుకున్నాడు, తరువాత పట్నంలో వ్యాపారం పెట్టాలని పొలాన్ని, పశువుల్ని కౌలుకి చూసుకుంటానికి ఇచ్చేసి పట్నంలో కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు.

మొదట్లో అంతా బాగానే ఉంది. కొంత కాలం గడిచేసరికి కౌలుకి ఇచ్చిన వాళ్ళు డబ్బు సరిగ్గా పంపటం మానేశారు. వ్యాపారంలో నష్టం వచ్చింది. ఇంక చేసేది లేక తిరిగి తన ఊరు శ్రావణపురానికి చేరుకున్నాడు.

అక్కడ తన పొలం కౌలుకి తీసుకున్నవాడు వాడిన ఎరువులూ, రసాయనాల వల్ల పంట ఎంతో క్షీణించి ఉంది. పశువులు పట్టించుకునేవాళ్ళు లేక అనారోగ్యంతో, బక్కచిక్కి ఉన్నాయి. అంటే ఇన్ని రోజులూ కౌలుకి తీసుకున్నవాడు తన తండ్రి పొలాన్ని, పశువులని సరిగ్గా చేసుకోలేదని అర్థమయ్యింది.

ఇక ఆలస్యం చేయకుండా తన తండ్రి కన్న బిడ్డలా చూసుకున్న తన పొలాన్ని, పశువులని తానే స్వయంగా సాగు చేయటం, బాగోగులు చూసుకోవటం మొదలుపెట్టాడు.
మళ్లీ శరభయ్య పొలానికి పూర్వ కళ వచ్చింది. తన తండ్రిలాగే సేంద్రియ సాగులో కొత్త పద్దతులతో రెట్టింపు పంట పండించసాగాడు.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu, grandmaz stories,

ఇంతలో సైన్యంలో చేరిన ఉమేష్ అన్నయ్య రమేష్ తిరిగి ఇంటికి వచ్చాడు. ఉమేష్ తన తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆస్తిని ఇద్దరికీ సమానంగా పంచాడు. 

అన్నదమ్ములిద్దరూ పెళ్లి చేసుకుని తమ కుటుంబాలతో పొలాన్ని, పశు సంపదని చక్కగా చూసుకుంటూ ఎంతో సంతోషంగా జీవించారు.

అందుకే అన్నారు పెద్దలు, "పెద్దలమాట చద్దిమూట" అని.

అంటే పెద్దవాళ్ళు చెప్పింది విని అది సరిగ్గా ఆచరిస్తే ఎంతో మేలు జరుగుతుందని ఈ సామెత అర్థం. పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకుని పిల్లలకి మంచి చెబుతారు. అది విని ఆచరిస్తే తరువాతి తరాలవారికి మంచిదని అర్థం.


Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀


1 comment:

  1. All your stories are good grandmaz stories

    ReplyDelete

Recent posts

The Big Fat Cat And The Mice: A Great Idea

The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...

Popular posts