Friday, May 21, 2021

Telugu Stories For Everyone

Telugu Stories For Everyone

Grandma stories presents you telugu stories

తేలుకుట్టిన దొంగ

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu

పాండ్య దేశపు రాజు మాల్యవంతుడు. అతని మంత్రి పేరు బొమ్మరాయడు. ఒకసారి బొమ్మరాయుడు ఒక పని నిమిత్తం వేరే రాజ్యానికి వెళుతుండగా పూట కూళ్లమ్మ బసలో బాగా తెలివైన ఒక వ్యక్తి కనిపించాడు. 

బొమ్మరాయుడు అతన్ని దగ్గరికి పిలిచి అతని చేయి చూసి చాలా ఆశ్చర్యం చెందాడు. అతని హస్తరేఖల్లో పాండ్య దేశపు రాజుకి అల్లుడయ్యే అవకాశాలు కనిపించాయి. బొమ్మరాయుడు ఆలోచన ఏమిటంటే రాజు కుమార్తెను తన కొడుకుకి చేసుకుని రాజ్యాన్ని కైవసం చేసుకోవాలనే దురాలోచన ఉంది. ఈ వ్యక్తి చేతుల్లో రాజుకి అల్లుడయ్యే రేఖని చూసి అతన్ని చంపేయాలనుకున్నాడు.

బొమ్మరాయుడు ఒక లేఖపై ఇలా రాశాడు "ఈ లేఖ తెచ్చినవానికి విషము ఇమ్ము." అని ఆలా రాసి ఆ యువకుడిని పిలిచి "ఈ లెఖను నీవు తీసుకుని వెళ్లి రాజధాని నగరంలో ఉన్న నా కుమారుడికి ఇవ్వు నీకు మంచి జరుగుతుంది" అని చెప్పాడు.
మంత్రి వేరే పని మీద వెళ్ళిపోయాడు.

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,
ఆ యువకుడు ఆ లేఖను జాగ్రత్తగా తన నడుము వస్త్రంలో దోపుకుని రాజధాని నగరానికి చేరుకొని అంతఃపురానికి దగ్గరగా ఉన్న తోటలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆగాడు. అలసట వలన ఆ యువకునికి నిద్ర పట్టింది.

 మంత్రి కుమార్తె పేరు విషయ. ఆమె అదే సమయంలో ఈ యువకుడు విశ్రాంతి తీసుకుంటున్న తోటలోకి వచ్చింది.
ఈ యువకుడి అందానికి దిగ్భ్రాంతి చెందింది విషయ. ఆమె అతని దగ్గరికి వెళ్లి అతని దగ్గర ఉన్న ఉత్తరాన్ని చూసింది. ఆ ఉత్తరాన్ని నిదానంగా బయటికి తీసి చదివింది. తన తండ్రి అతనిని ఎందుకు చంపమన్నాడో అర్థంకాలేదు.

 విషయ అతన్ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. చెలికత్తెలతో విషయ ఆలోచించి ఆ లేఖలో "విషము" అనే పదాన్ని "విషయ" అనే పదంగా మార్చింది.

ఇప్పుడు ఆ లేఖలోని భావం ఏమిటంటే "ఈ లేఖ తెచ్చినవానికి విషయనిమ్ము."
విషయ ఆ లేఖను మరల అతని దగ్గర పెట్టేసి తన భవనానికి వెళ్ళిపోయింది.
ఆ యువకుడు ఆ లేఖను మంత్రి కుమారుడి చేతికి ఇచ్చాడు. మంత్రి కుమారుడు తన చెల్లెలికి అంత తొందరగా ఎందుకు వివాహం చేయాలి అని ఆశ్చర్యపోయాడు.

ఎంతైనా అతను మంత్రి కుమారుడు కదా, లేఖ తెచ్చిన యువకుణ్ణి "ఈ లేఖ ఇచ్చి మా నాన్నగారు నీకు ఇంకేమైనా చెప్పమన్నారా?"అని అడిగాడు.

ఆ యువకుడు "ఈ లేఖ ఇచ్చినందువల్ల నాకు మంచి జరుగుతుందని చెప్పామన్నారు." అని అన్నాడు.
వెంటనే మంత్రి కుమారుడు ఆ యువకునికి, తన చెల్లెలికి వివాహం జరిపించాడు.

వివాహ వేడుకలు జరుగుతుండగానే బొమ్మరాయుడు ఇంటికి తిరిగి వచ్చాడు. అక్కడ ఉన్న పరిస్థితులకి అతను ఆశ్చర్యపడి తన కొడుకుని వివరాలు అడిగాడు. "మీరు లేఖలో రాసినట్టుగా వారిద్దరికీ వివాహం జరిపించాను." అని మంత్రి కుమారుడు చెప్పాడు.

అది విన్న మంత్రి ఆ లేఖను ఒకసారి తీసుకురమ్మన్నాడు. ఆ లేఖలో తాను "విషము" అని రాసినదాన్ని "విషయ"గా మార్చబడి ఉన్నది.

ఆ తరువాత బొమ్మరాయుడు "తేలుకుట్టిన దొంగలాగా" నిశ్శబ్దముగా ఉన్నాడు.

కొద్ది రోజులలోనే రాజు మాల్యవంతుడు ఆ యువకుడి తెలివితేటలను గుర్తించి తన కూతురుని ఆ యువకునికిచ్చి వివాహం చేశాడు.

ఈ విధంగా మాల్యవంతుడి తరువాత ఈ యువకుడు రాజయ్యాడు, మంత్రి కుమారుడు మంత్రి అయ్యాడు.
అందుకనే అదృష్టవంతుల్ని ఎవరూ చెరపలేరు అని అంటారు.

అందుకే అన్నారు పెద్దలు "తేలుకుట్టిన దొంగ" అని.

అంటే ఎవరైనా ఏదైనా తప్పు చేసి ఆ తప్పు వలన వారికే బాధకలిగినా దానిని బయటపెట్టకుండా దాచి ఉంచితే ఈ సామెతని ఉపయోగిస్తారు.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

2 comments:

  1. Thank you grandma for posting such interesting Telugu stories keep posting more and more Telugu stories

    ReplyDelete
  2. Great site 👍👍🤩🤩Grandma 👵 keep posting

    ReplyDelete

Recent posts

The Big Fat Cat And The Mice: A Great Idea

The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...

Popular posts