A Wise Tortoise Telugu Stories Grandma Stories
Grandmas Stories presents you telugu stories
తెలివికి లోకం దాసోహం
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, A Wise Tortoise Telugu Stories Grandma Stories
అనగనగా చండికారణ్యం అనే ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక తాబేలు ఉండేది. అది చాలా తెలివైనది.
ఆ అడవిలో జంతువులన్నీ ఐకమత్యంగా ఉండేవి. ఇలా ఉండగా ఒక సారి ఆ అడవి పై నుంచి వెళుతూ ఒక పెద్ద డేగ ఈ అడవిలోని జంతు సంపదని చూసి దానికి మంచిగా ఆహారం దొరికిందని ఎంతగానో సంతోషించింది.
ఇక ఆ రోజు మొదలు దానికి ఆకలి వేస్తే వెంటనే ఆ అడవిలోని ఒక
జంతువుని నోట కరుచుకుని తినేయటం మొదలు పెట్టింది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, A Wise Tortoise Telugu Stories Grandma Stories
కొన్ని రోజులకి ఆ అడవిలోని జంతువులు బయటికి రావాలంటే భయపడసాగాయి. ఆ డేగ ఎక్కడ కాపు కాసి ఉందో అని అనుకుంటూ చాలా బాధపడసాగాయి.
ఒక రోజు తాబేలు దాని మిత్రుడైన కుందేలుని కలవటానికి బయటికి వచ్చింది.
అదే సమయంలో తన ఆహారం కోసం కాపు కాసి ఉన్న డేగ అమాంతం తాబేలుని నోట కరుచుకుని తను నివసించే కొండ వైపు వెళ్లి ఒక చోట ఆగి ఆ తాబేలుని తినటానికి ప్రయత్నించింది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, A Wise Tortoise Telugu Stories Grandma Stories
తాబేలుకి పైన ఉన్నడిప్ప గట్టిగా ఉండి దానిని ఇటువంటి దాడుల నుంచి కాపాడుతుంది. ఆ డేగ తాబేలుని తినటానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఆ డేగ వల్ల కాలేదు. పైన ఉన్న ఆ గట్టి డిప్ప ఎంత సేపటికీ పగలలేదు. దాంతో డేగకి ఏమి చేయాలో అర్థం కాలేదు.
తన నోటి దగ్గర ఆహారాన్ని ఎలా తినాలా అని ఆలోచించసాగింది.
ఇదే తనకు మంచి సమయం అని ఆ తాబేలు "ఓ డేగ నన్ను తినటానికి ఎందుకు ఇంత శ్రమపడుతున్నావు? " అని అడిగింది.
దానికి ఆ డేగ నీ పైన ఉన్న డిప్ప ఎంతో గట్టిగా ఉంది మరి నిన్ను ఎలా తినాలి అని అడిగింది.
అప్పుడు తాబేలు "మనసులో నవ్వుకుని!!!! ఓ డేగ నా మీద ఉన్న ఆ గట్టి డిప్ప నాకు రక్షణ కవచం నీవు నన్ను భుజించాలంటే వెంటనే నన్ను చెరువులో వదులు అప్పుడు నా డిప్ప నానుతుంది, నీవు తేలికగా నన్ను భుజించవచ్చు" అని అన్నది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, A Wise Tortoise Telugu Stories Grandma Stories
ఇంకేముంది ఆకలిగా ఉన్న డేగ ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆ తాబేలుని తీసుకెళ్లి దగ్గరలో ఉన్న చెరువులో వదిలింది.
నీళ్ళలోకి వెళ్లిన తాబేలు చక చకా డేగకి అందకుండా లోపలికి వెళ్లి పకా పకా నవ్వుతూ "ఓ వెర్రి డేగ నేను నీళ్ళలోకి వెళ్లిన తరువాత నీకు ఎందుకు చిక్కుతాను" అని అంటూ తుర్రున మాయమైంది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, A Wise Tortoise Telugu Stories Grandma Stories
తన నోటి దగ్గర ఆహారాన్ని తానే స్వయంగా పోగొట్టుకున్నది అని అనుకుని ఆ డేగ అక్కడినుంచి వెళ్ళిపోయింది.
అందుకే అన్నారు పెద్దలు "తెలివికి లోకం దాసోహం" అని.
అంటే పై కథలో చెప్పినట్టు ఆ తాబేలు ఎంతో తెలివిగా ఆ డేగ నోట్లో ఆహారం కాకుండా తప్పించుకుంది.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀
No comments:
Post a Comment