Thursday, June 17, 2021

INTELLIGENT PERSON STORY TELUGU STORIES GRANDMA STORIES KATHALU

INTELLIGENT PERSON STORY TELUGU STORIES GRANDMA STORIES KATHALU

Grandmas Stories presents you telugu stories

లౌక్యం

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, INTELLIGENT PERSON STORY TELUGU STORIES GRANDMA STORIES KATHALU

పూర్వం భూపతి అనే ఒక రాజు ఉండేవాడు. అతని రాజ్యంలో భుర్గుడు అనే ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. అతను అతని భార్య బాగా పేదరికంలో ఉండేవారు. ఒక రోజున భుర్గుడు రాజు అంతఃపురంలో రాత్రి పూట ప్రవేశించి దొంగతనం చేయాలనుకున్నాడు. 

అతను అనుకున్న ప్రకారం అంతఃపురానికి చేరుకున్నాడు. ఒక భోషాణాన్ని చాలా కష్టపడి తెరిచాడు. దాని నిండా బంగారం ఉంది. బంగారాన్ని దొంగతనం చేస్తే జన్మ జన్మల నరకం ఉంటుంది అనే అభిప్రాయానికి వచ్చిన భుర్గుడు ఆ భోషాణానికి మూత వేసేశాడు. 

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, INTELLIGENT PERSON STORY TELUGU STORIES GRANDMA STORIES KATHALU

ఆ పక్కనే ఉన్న రెండో భోషాణం మూత తెరిచాడు. దాని నిండా వెండి వస్తువులు ఉన్నాయి. వెండి దొంగిలిస్తే రౌరవాది నరకాలు వస్తాయని అనుకున్న భుర్గుడు ఆ భోషాణానికి కూడా మూత వేసేశాడు. 

మూత వేసేటప్పుడు వచ్చిన శబ్దానికి రాజు మేలుకుని భుర్గుడిని చెరసాలలో పెట్టించాడు. 

తెల్లవారిన తరువాత రాజు భూపతి రాజ సభలో భుర్గుడిని విచారించి ఉరి శిక్ష విధించాడు. రాజు భుర్గుడిని నీ ఆఖరి కోరిక ఏమిటని అడిగాడు. దానికి భుర్గుడు ప్రభూ మీకు నాలుగు వాక్యాలు చెప్పాలని అనుకుంటున్నాను అదే నా ఆఖరి కోరిక అని అన్నాడు. 

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, INTELLIGENT PERSON STORY TELUGU STORIES GRANDMA STORIES KATHALU

రాజు సరే చెప్పమన్నాడు. 

అప్పుడు భుర్గుడుఇలా చెప్పటం మొదలు పెట్టాడు. ప్రభూ సరిగ్గా తొమ్మిది నెలల క్రితం మీ ఆస్థాన కవి భరణి చనిపోయాడు, ఆ తరువాత ఆరు నెలల క్రితం మీ సైన్యాధ్యక్షుడు భార్గవ చనిపోయాడు, సరిగ్గా మళ్లీ మూడు నెలల క్రితం నీ మంత్రులలో ఒకడైన భీముడు చనిపోయాడు. ఇప్పుడు నేను చనిపోబోతున్నాను, ఇక్కడ  బాగా పరిశీలించండి తొమ్మిది నెలల క్రితం చనిపోయిన వ్యక్తి పేరులో మొదటి అక్షరం "భ" ఉంది. ఆరు నెలల క్రితం చనిపోయిన వ్య్తకి పేరులో "భా" ఉంది మూడు నెలల క్రితం చనిపోయిన వ్యక్తి పేరులో భీ ఉంది, ఇప్పుడు నా పేరులో "భు" ఉంది ప్రభూ ఆ తరువాత మూడు నెలలకి మీ పేరులో "భూ" ఉంది కాబట్టి మీ వంతు వస్తుంది.

దీనికి పరిష్కారం ఏమిటంటే మీరు నాకు మరణ శిక్ష రద్దు చేసారంటే మీకు కూడా మృత్యు గండం తప్పుతుంది. 

రాజు భూపతి బ్రాహ్మణుడిలోని లౌక్యానికి సంతోషించి అతని జీవిత కాలానికి సరిపడా ధనం ఇచ్చి పంపించాడు.

అందుకే అన్నారు పెద్దలు "లౌక్యంతో లక్ష పనులైనా చక్కపెట్టవచ్చు." అని. 

అంటే పై కథలో చెప్పినట్టు ప్రాణాపాయ స్థితిలో కూడా భుర్గుడు లౌక్యంతో తనని తాను రక్షించుకున్నాడు. అందువలన బుద్ధిని సరిగ్గా వాడి ఆ చతురతతో ఎంత పనినైనా సులువుగా చేయవచ్చని అర్థం.  

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, INTELLIGENT PERSON STORY TELUGU STORIES GRANDMA STORIES KATHALU

No comments:

Post a Comment

Recent posts

The Big Fat Cat And The Mice: A Great Idea

The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...

Popular posts