Thursday, June 17, 2021

ASALUKE MOSAM TELUGU STORIES GRANDMA STORIES KATHALU

ASALUKE MOSAM TELUGU STORIES GRANDMA STORIES KATHALU

Grandmas Stories presents you telugu stories

అసలుకే మోసం వచ్చింది

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, ASALUKE MOSAM TELUGU STORIES GRANDMA STORIES KATHALU

వేంకటగిరి అనే ఊరిలో ఉపేంద్రుడు అనే వ్యాపారి ఉన్నాడు. అతని కొడుకు భూపేంద్రుడికి వివాహం చేయాలనుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకవటం వలన అతని వివాహం అంగ రంగ వైభవంగా చేయాలని అనుకున్నాడు.

ఆ ఊరిలోనే ఒక మంచి అమ్మాయిని భూపేంద్రునికి వధువుగా నిశ్చయించుకున్నారు, పెళ్లి తేదీ కూడా నిర్ణయమైంది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, ASALUKE MOSAM TELUGU STORIES GRANDMA STORIES KATHALU

ఉపేంద్రుడికి ఒక కోరిక ఉంది, అదేమిటంటే తాను తన పెళ్ళికి గుర్రం మీద రావాలనుకున్నాడు. కానీ అప్పటి పరిస్థితుల వల్ల అది జరగలేదు. అందువలన తన కొడుకునైనా గుర్రం మీద ఊరేగింపుగా ఊరంతా తిప్పి ఘనంగా అతని వివాహం చేయాలని అనుకున్నాడు.

అదే ఊరిలో రాజయ్య అనే గుర్రాల వ్యాపారి ఉండేవాడు. ఉపేంద్రుడు అతని దగ్గరికి వెళ్లి తన కొడుకు పెళ్ళికి గుర్రం మీద ఊరేగించటానికి ఒక మంచి గుర్రాన్ని పెళ్లి రోజుకి అద్దెకు ఇమ్మని అడిగాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, ASALUKE MOSAM TELUGU STORIES GRANDMA STORIES KATHALU

రాజయ్య మహాడబ్బు మనిషి, ఎవరిదగ్గరైనా ఎంత డబ్బులు పిండవచ్చు అనుకునే రకం. ఉపేంద్రుడు ధనవంతుడు ఇతనికి గుర్రాన్ని ఒక రోజుకి అద్దెకు ఇచ్చి రెండు రోజుల అద్దె అయినా తీసుకోవచ్చు అని భావించి, తన దగ్గర ఉన్న ముసలి గుర్రాన్ని ఉపేంద్రుడి కొడుకు పెళ్లిరోజుకి పంపుతాడు.

భూపేంద్రుడు గుర్రం పై ఘనంగా పెళ్లి ఊరేగింపులో వెళుతుంటే తండ్రి ఉపేంద్రుని ఆనందానికి అంతు లేదు. ఊరేగింపు సగంలో ఉండగా ఆ ముసలి గుర్రం చచ్చిపోయింది. అందరు అయ్యయ్యో అనుకుని గుర్రాన్ని రాజయ్య దగ్గరకు పంపించి పెళ్లి వాయిదా వేసుకున్నారు.
ఉపేంద్రుడు మంచితనంతో ఆ చనిపోయిన గుర్రం ముసలిదని తెలియక నీకు కావాలంటే ఇంకొక గుర్రం కొనిపెడతా అని రాజయ్యతో అన్నాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, ASALUKE MOSAM TELUGU STORIES GRANDMA STORIES KATHALU

కానీ అత్యాశాపరుడు రాజయ్య "ఓహో!! ఇతను వెర్రిబాగులవాడిలా ఉన్నాడు ఏదో ఒకటి చేసి ఇతని దగ్గర రెండు గుర్రాల డబ్బు వసూలు చేయాలని అనుకుంటాడు."
బాగా అలోచించి రాజయ్య ఉపేంద్రనితో "లేదు! లేదు! నాకు ఆ చనిపోయిన గుర్రమే కావాలి లేకపోతే రెండు గుర్రాల డబ్బు ఇవ్వు" అని అన్నాడు.

అసలే కొడుకు పెళ్లి వాయిదాపడింది, తీసుకున్న గుర్రం చచ్చిపోయింది, తిరిగి ఒక గుర్రానికి డబ్బులు ఇస్తానంటే, ఈ రాజయ్య రెండు గుర్రాలకి డబ్బులు అడుగుతున్నాడు, ఇదెక్కడి న్యాయం? అని ఆ ఉరి న్యాయాధికారి దగ్గరికి వెళ్తాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, ASALUKE MOSAM TELUGU STORIES GRANDMA STORIES KATHALU

ఆ ఉరి న్యాయాధికారి నాగయ్య తన దగ్గరకి వచ్చిన వారికి న్యాయం చేసి పంపుతాడనే పేరుంది. అతను ఉపేంద్రుడు చెప్పింది పూర్తిగా విని రాజయ్య దురాశను అర్థంచేసుకున్నాడు. ఉపేంద్రుడికి ఒక ఉపాయం చెప్పి పంపుతాడు.

మరుసటి రోజు పొద్దున్నే ఉపేంద్రుడు రాజయ్యను ఆ రోజు మధ్యాహ్నం తన ఇంటికి రమ్మని, వస్తే రెండు గుర్రాల డబ్బు ఇచ్చేస్తాడని కబురు పంపుతాడు.

ఉపేంద్రుడు న్యాయాధికారి నాగయ్య చెప్పినట్టు తన ఇంటి తలుపుకి లోపలివైపు మట్టి కుండలు దొంతరగా ఒకదానిమీద ఒకటి పెట్టి తలుపు గడియ వేయకుండా వదిలివేస్తాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, ASALUKE MOSAM TELUGU STORIES GRANDMA STORIES KATHALU

ఉపేంద్రుడి కబురు విన్న దురాశపరుడు రాజయ్య డబ్బు తీసుకుందామని ఉపేంద్రుని ఇంటికి వెంటనే వెళ్తాడు. అక్కడ తలుపు బయట నుంచుని రెండు సార్లు తలుపు తట్టి చూస్తాడు. అయినా తలుపు ఎవరూ తెరవరు, అసలే డబ్బు తీసుకుందామని ఆత్రంగా వచ్చిన రాజయ్య ఉపేంద్రుని ఇంటి తలుపు తెరిచిఉందేమోనని ఆ తలుపుని తోసాడు.

ఇంకేముంది ఆ తలుపు వెనకాల దొంతరగా పేర్చబడి ఉన్న కుండలు అన్నీ నేల మీద డుబుక్కున పడిపోయి విరిగిపోతాయి. అది విన్న ఉపేంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి "అయ్యో మా ముత్తాతల నుంచి ఆస్తిగా వచ్చిన కుండలు, అవి విరగకొట్టేశావు రాజయ్య" అని రాజయ్యతో అన్నాడు.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, ASALUKE MOSAM TELUGU STORIES GRANDMA STORIES KATHALU

అప్పుడు అవి మట్టి కుండలే కదా తనకి వస్తున్న రెండు గుర్రాల డబ్బు ముందు ఇది ఎంత అనుకుని, రాజయ్య "బాధపడకు ఉపేంద్ర నీ మట్టి కుండలకి డబ్బులిచేస్తాను" అని అన్నాడు.

కానీ ఉపేంద్రుడు నాకు ఆ పగులగొట్టిన కుండలు కావాలి లేకపోతే నాలుగు గుర్రాల డబ్బు తనకు ఇమ్మని అడుగుతాడు.

ఇది విన్న రాజయ్యకు విషయం అర్థం అయ్యింది, తను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు, "అసలుకే మోసం వచ్చింది" అని అనుకోని ఇంకేమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

అందుకే అన్నారు పెద్దలు "అసలుకే మోసం వచ్చింది" అని

అంటే ఎవరైనా దురాశకు పోయి ఉన్నది కూడా పోగొట్టుకుంటే ఆ సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

No comments:

Post a Comment

Recent posts

The Big Fat Cat And The Mice: A Great Idea

The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...

Popular posts