పెద్దల మాట చద్ది మూట
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, PEDDALA MATA TELUGU STORIES GRANDMA STORIES KATHALU
అనగనగా కాకులు దూరని కారడవి చీమలు దురని చిట్టడివి. అది చలికాలం. ఆ అడవికి ఒక పెద్ద కోతుల గుంపు వచ్చి చేరింది. చలికాలం అవ్వటంతో ఆ కోతులు గడ్డకట్టినట్టు అయిపోసాగాయి.
వాటికి వెంటనే వెచ్చదనం కావలసివచ్చింది. వెచ్చదనం కావాలంటే నిప్పు కావాలి. అందుకని నిప్పు కోసం వెతకసాగాయి.
వాటికి ఒక రోజు మిణుగురు పురుగు కనిపించింది. అవి చీకట్లో వెలుగుతాయి. అది ఏమిటో తెలియని కోతులు దాన్ని చూసి "నిప్పు దొరికింది, నిప్పు దొరికింది," అని అరవసాగాయి.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, PEDDALA MATA TELUGU STORIES GRANDMA STORIES KATHALU
ఇక ఆ కోతులు ఆ మిణుగురు పురుగుని పట్టుకోవాలని ఎంతో ప్రయత్నించాయి. కానీ ఆ పురుగుని పట్టుకోలేకపోయాయి. ఆ మిణుగురు పురుగు తప్పించుకుపోయింది.
అప్పుడు కోతులు "అయ్య బాబోయ్ మనకి ఇంక నిప్పు దొరకకపోతే ఈ చలికి చచ్చిపోతాం!!" అని అనుకున్నాయి.
తరువాతి రోజు మిణుగురు పురుగుల గుంపు ఆ కోతులు ఉన్న ప్రదేశానికి వచ్చాయి. ఇంక ఆ కోతుల గుంపు వాటి సాయ శక్తులా ప్రయత్నించి కొన్ని మిణుగురు పురుగులని పట్టుకున్నాయి.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, PEDDALA MATA TELUGU STORIES GRANDMA STORIES KATHALU
వెంటనే ఆ కోతులు చిన్న గొయ్యి తవ్వి పట్టుకున్న మిణుగురు పురుగులని అందులో వేసి నిప్పు కోసం ఉదటం మొదలుపెట్టాయి.
ఇంతలో అక్కడే ఒక చెట్టు పైన ఉన్న గ్రద్ద ఒకటి " ఓ మిత్రులారా మీరు పట్టుకున్నవి మిణుగురు పురుగులు, అది నిప్పు కాదు." అని చెప్పింది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, PEDDALA MATA TELUGU STORIES GRANDMA STORIES KATHALU
ఆ గ్రద్ద చెప్పిన మాటలని ఏమాత్రం పట్టించుకోకుండా కోతులు ఆ ముసలి గ్రద్దకి ఏమీ తెలియదని నవ్వుకుంటూ మళ్ళీ ఆ మిణుగురు పురుగులని ఉదటం మొదలుపెట్టాయి.
పాపం వాటి బాధ చుడలేక ఆ ముసలి గ్రద్ద మళ్ళీ ఆ కోతులతో అది నిప్పు కాదు మీరు ఎంత ప్రయత్నించినా దాన్ని వెలిగించలేరు. దగ్గర్లోనే ఉన్న గుహలోకి వెళ్లి చలి నుంచి కాపాడుకోండి." అని చెప్పింది.
ఈ సారి కోతులు ఆ ముసలి గ్రద్ద మాట వినకపోగా దాన్ని అరిచి పక్కకి వెళ్ళగొట్టాయి. చేసేది ఏమీ లేక ఆ ముసలి గ్రద్ద అక్కడినుంచి వెళ్ళిపోయింది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, PEDDALA MATA TELUGU STORIES GRANDMA STORIES KATHALU
No comments:
Post a Comment