The Story of Fox And The Crows: A True Friend
Telugu Stories
నిజమైన స్నేహితుడు
అనగనగా ఒక కాకి, కాకి భార్య ఒక నది పక్కన ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టుపై తమ గూడును నిర్మించి ఆనందంగా జీవిస్తున్నారు.
కొన్ని రోజులకి అడా కాకి గుడ్లు పెట్టింది. ఆడ కాకి గుడ్లు పెట్టినప్పుడు, వారు ఎంతో ఘోరమైన విషయాన్ని కనుగొన్నారు.
చెట్టు అడుగున ఉన్న బిలంలో నివసించే ఒక పెద్ద పాము పైకి వచ్చి వాటి అందమైన గుడ్లన్నింటినీ తినేసింది.
కాకులు కోపం, బాధతో నిస్సహాయంగా రోదించాయి.
ఆలా కాకి గుడ్లు పెట్టిన ప్రతీసారి కింద ఉన్న పాము వచ్చి ఆ గుడ్లని తినేసేది.
ఇలా చాల సార్లు జరిగిన తరువాత ఆ కాకి జంట, "ఈ చెడ్డ పామును ఇకపై మా పిల్లలను తిననివ్వలేము" అని నిర్ణయించుకున్నాయి.
అప్పుడు అడా కాకి మెగా కాకితో "మీరు ఆ పాము నుండి మన గుడ్లని రక్షించడానికి ఒక మార్గాన్ని కనుగొనాలి," అని చెప్పింది.
ఇది విన్న మెగా కాకి "మన స్నేహితుడైన నక్క వద్దకు వెళ్దాం. అతను చాలా తెలివైనవాడు. అతను ఖచ్చితంగా ఒక చక్కటి పరిష్కారంతో మనకు సహాయం చేయగలడు," అని చెప్పింది.
వారిద్దరూ తమ స్నేహితుడు నక్క నివసించే అడవిలోని గుహకు వెళ్లారు.
నక్క వాళ్ళు రావడం చూసింది.
"ఓ, నా స్నేహితులారా. మీరు ఎందుకు చాలా విచారంగా ఉన్నారు? ఎందుకు ఆందోళన చెందుతున్నారు? నేను మీకు ఏదైనా సహాయం చేయగలనా?"
అతను అడిగాడు.
"నా భార్య మా గూడులో గుడ్లు పెట్టిన ప్రతిసారీ, చెట్టు అడుగున నివసించే ఒక చెడ్డ పాము వాటిని తింటుంది" అని కాకి వివరించింది.
"అతడ్ని వదిలించుకుని మా పిల్లల్ని కాపాడుకోవాలనుకుంటున్నాం.మేమేం చేయగలమో చెప్పండి." అని నక్కని అడిగాయి.
నక్క కొంతసేపు ఆలోచించింది.
"మీరు ఏమి చేయాలో నాకు తెలుసు," అని, నక్క, కాకులకు తన పథకం వివరంగా చెప్పాడు.
నదికి స్నానానికి తన పరిచారికలతో రావడం రాణికి అలవాటు.
అలా చేయగానే తమ బట్టలు, నగలు అన్నీ తీసేసి నది ఒడ్డున పెడతారు.
అప్పుడు నేను చెప్పినట్టు చేయండి అని అన్నది.
మరుసటి రోజు రాణి మరియు ఆమె పరిచారికలు ఎప్పటిలాగే బట్టలు, నగలు, గట్టున పెట్టి నదిలోకి ప్రవేశించారు.
అప్పటికే అక్కడ ఉన్న కాకి జంట, నక్క వారికీ ఏమి చెప్పిందో సరిగ్గా అలాగే చేశారు.
రాణి పరిచారికలు బట్టలు, నగలు గట్టున పెట్టిందే, ఆడ కాకి తన ముక్కుతో ఒక విలువైన ముత్యాల హారాన్ని వేగంగా తీసుకుంది.
అదే సమయంలో, మగ కాకి రాణి మరియు ఆమె పరిచారికల దృష్టిని ఆకర్షించడానికి బిగ్గరగా అరవడం ప్రారంభించింది.
"అయ్యో, ఆ కాకులు నా ముత్యాల హారాన్ని తీసుకున్నాయి."
అని అరిచింది రాణి.
"భటులరా!!" అని అరిచింది.
"ఆ కాకుల నుండి ఆ హారాన్ని తిరిగి పొందటానికి రాణి కాపలాదారులు పెద్దగా అరుస్తూ కాకులను వెంబడించారు.
కాకులు నేరుగా మర్రిచెట్టు దగ్గరకు ఎగురుకుంటూ వెళ్లాయి.
కాపలాసురులు కూడా కాకుల జంటని వెంబడిస్తూ ఆ మర్రి చెట్టు దగ్గరికి వచ్చారు.
బయట శబ్దం విని, చెట్టు అడుగున ఉన్న పాము తన బిళంలోంచి
బయటకు వచ్చింది.
ఇంకేముంది, దాని కోసమే ఎదురుచూస్తున్నా ఆడ కాకి వెంటనే పాము ఉన్న చోటే హారాన్ని పడేసింది.
"చూడండి! హారం దగ్గర ఒక పెద్ద పాము ఉంది" అని ఒక భటుడు అరిచాడు.
ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే కాపలాదారులు పాముని పదునైన ఈటెలతో దాడి చేసి చంపేశారు.
వెంటనే భటులు ఆ హారాన్ని తీసుకొని తిరిగి తమ రాణి వద్దకు తీసుకెళ్లారు.
తమ శత్రువును వదిలించుకోవడానికి సహాయం చేసినందుకు కాకుల జంట తమ స్నేహితుడైన నక్కకు కృతజ్ఞతలు తెలిపాయి.
ఆ కాకుల జంట అప్పటినుచి తమ పిల్లలతో సంతోషంగా జీవించాయి.
అందుకే అన్నారు పెద్దలు, "అవసరంలో ఆడుకునేవాడే అసలైన స్నేహితుడు." అని.