Thursday, November 23, 2023

The Tale of Indigo Fox: Moral Stories

The Tale of Indigo Fox: Moral Stories


నీలి నక్క 

ఒక అడవిలో, ఒక నక్కల సమూహం నివసించేది. అవి సింహం భోజనంలో మిగిలిపోయిన వాటిని తినడానికి కలిసి వేటాడేవి. ఆ నక్కల్లో ఒకటి కొద్దిగా ముసలిదైపోయింది. చిన్న నక్కలన్నీ ఆ ముసలి నాక్కని బెదిరించి వాటి తోటి ఆహారం పంచుకోనివ్వలేదు.


The Tale of Indigo Fox: Moral Stories ఒక అడవిలో, ఒక నక్కల  Animal Stories,Grandma's Stories,Must Read Telugu Moral Stories,Telugu Proverb Stories,


అప్పుడు "నా ఆకలి తీరాలంటే నేనేమైనా చెయ్యాలి. ఇలా ఏమి తినకుండా, నేను చాలా కాలం బ్రతకలేను" అనుకుంది ముసలి నక్క.



అతను తన గుంపును విడిచిపెట్టి తన ఆహారం తానే వెతకాలని నిర్ణయించుకున్నాడు. ఆ ముసలి నక్క చాలా రోజులు ఆహారం కోసం తిరిగాడు,  కానీ ఎంత వెతికిన తిండి దొరక లేదు. అతను వెళ్ళిన ప్రతిచోటా, ఇతర జంతువులు ఆ ముసలి నక్కని తరిమికొట్టాయి.



ఇక లాభం లేదనుకుని , ఆ ముసలి నక్క ఆహారం కోసం గ్రామంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. 


రాత్రి పొద్దుపోయిన తర్వాత, గ్రామస్థులు అంతా నిద్రపోయిన తరువాత, ఆ ముసలి నక్క ఆహారం కోసం గ్రామ వీధుల్లో వెతకటం ప్రారంభించింది. 

ఆలా వెతుకుతుండగా ఎక్కడినుంచి వచ్చిందోకానీ, అకస్మాత్తుగా కుక్కల సమూహం ఆ ముసలి నక్కను వెంబడించడం ప్రారంభించింది. 


ప్రాణభయంతో ఆ ముసలి నక్క తన బలహీనమైన కాళ్లు ఎంత వేగంగా పరిగెత్తగలవో అంత వేగంగా పరుగెత్తి అక్కడినుంచి పారిపోయింది.

తప్పించుకోవడానికి మార్గం కనిపించక, ఆ ముసలి నక్క తనకు కనిపించిన మొదటి సందులోకి దూకింది. 



ఆ ముసలి నక్క దుర్వాసనతో కూడిన ద్రవపు తొట్టెలో పడిపోయాడు. 

అది బట్టలకు పెట్టె నీలి మందు యొక్క తొట్టి. ఆ ఇల్లు ఆ ఊరి చాకలివాడిది.


నక్క ఆ ద్రవంలోంచి హడావిడిగా పైకి లేచి భయంతో బయటకు చూసేసరికి, బయట అతని కోసం వేచి ఉన్న కుక్కలు ఆ ముసలి నక్కని చూసి కేకలు వేసి, తోకలను కాళ్ల మధ్య పెట్టుకుని పారిపోయాయి. ఇది చూసి ఆ ముసలి నక్క ఎంతో ఆశ్చర్యపోయింది. 

అప్పటికి అన్ని కుక్కలు అక్కడినుంచి వెళ్లిపోయాయి. ఇక ముసలి నక్క వెంటనే అడవిలోకి వెళ్ళిపోయాడు. 


ముసలి నక్క దాహం తీర్చుకోవడానికి అడవిలోని నీటి గుంట దగ్గరకి వెళ్లింది. 

ముసలి నక్క దగ్గరికి వెళ్లిందే అక్కడ ఉన్న మిగతా జంతువులన్నీ నీలి రంగులో ఉన్న ముసలి నక్క ను చూసి భయంతో పరుగులు తీశాయి. 


ఆలా అన్ని జంతువులూ ఒక్కసారి భయంతో పరుగు తీసేసరికి ఆ ముసలి నక్క ఒకసారి చుట్టూ చూసింది. అక్కడ ఏమి కనిపించలేదు. దానితో ముసలి నక్కకి ఆ జంతువులన్ని ఆలా ఎందుకు పరిగెత్తాయొ అర్థం కాలేదు. 


ముసలి నక్క చాలా దాహంతో ఉంది. సరే తన దాహం తీర్చుకోవడానికి నీటి గుంట వద్దకు వెళ్ళింది.  


అది నీటిని త్రాగడానికి క్రిందికి వంగినప్పుడు, దానికి అద్భుతమైన, అసాధారణమైన రంగులో ఉన్న ఒక వింతగా కనిపించే జీవి నీటిలో నుండి తన వైపు చూస్తున్నట్లు గమనించి ఆ ముసలి నక్క ఎంతో ఆశ్చర్యపోయాడు. 


మొదట ముసలి నక్క భయపడింది, కానీ వెంటనే అది తన ప్రతిబింబాన్ని తానే చూస్తున్నట్లు గ్రహించింది. 

అప్పుడు దానికి  గ్రామంలో అది పడిపోయిన దుర్వాసనతో కూడిన ద్రవాన్ని గుర్తుచేసుకుంది. 

"అందుకే ఆ కుక్కలు మరియు అడవిలోని ఈ జంతువులన్నీ భయపడుతున్నాయి!" అని తనలో తానే తర్కించుకుంది. 


దాని జిత్తులమారి మనస్సు త్వరగా ఒక పథకాన్ని ఆలోచించింది.


వెంటనే అది భయపడిన జంతువులను పిలిచాడు. 


"నాకు భయపడకండి. మిమ్మల్ని రక్షించడానికి బ్రహ్మచేత పంపబడ్డాను." అని ఆ జంతువులని నమ్మించింది. 


ఇది విని ఆ జంతువులన్నీ ఒక్కసారిగా అతన్ని నమ్మి రాజుని చేశాయి.


రోజులు గడిచేకొద్దీ, నక్క గర్వంగా,  సోమరిగా మారింది. 


దానికి  ఇక ఆహారం కోసం వెతకాల్సిన అవసరం లేకపోయింది. 


మిగిలిన జంతువులన్నీ ఆహారాన్ని తెచ్చి, ఆ ముసలి నక్కకి  ప్రతి రోజు పెడుతున్నాయి. దాని అవసరాలన్నీ చూసుకుంటున్నాయి. 


ఇక ఆ ముసలి నక్క సంతోషానికి  అంతులేదు.


The Tale of Indigo Fox: Moral Stories ఒక అడవిలో, ఒక నక్కల  Animal Stories,Grandma's Stories,Must Read Telugu Moral Stories,Telugu Proverb Stories,

ఒక పౌర్ణమి రోజు రాత్రి, ఇంతకు ముందు ముసలి నక్క ఉన్న నక్కల గుంపు చంద్రున్ని చూసి ఉళ వేయడం ప్రారంభించాయి. 


నీలిమందు నక్క చాలా కాలంగా తన సోదరుల కేకలు వినలేదు. ఒక్కసారిగా ఆ నీలి మందు ముసలి నక్క చాలా కాలం తరువాత దాని తోటి నక్కల ఉళ వినటంతో , దానికి కూడా వాటితో కలసి ఉళ వేయాలనే కోరిక కలిగింది. అది ఆ కోరికని అదుపులో ఉంచుకోలేక పోయింది. 


ఇంకే ముంది ఆ నీలి మందు ముసలి నక్క వెంటనే తన తల వెనుకకు తిప్పి, తన హృదయపూర్వకంగా ఉళ వేయడం ప్రారంభించాడు.  


ఇది విన్న ఇతర జంతువులు తమను కాపాడటానికి స్వర్గం నుంచి  పంపబడిన రాజు,  సాధారణ నక్కలా ఉళ వేయడం విని ఆశ్చర్యపోయాయి. 

అవి వెంటనే వారు తమ తప్పును గ్రహించాయి.


"ఇది బ్రహ్మ పంపిన అసాధారణ జంతువు కాదు. నక్కలా ఉళ వేస్తుంది." అని ఎలుగుబంటి అన్నది. 


"అవును. ఇది సాధారణ నక్కలా ఇతర నక్కలను పిలుస్తుంది." 


"అవును,  అది మనల్ని మోసం చేసింది." 


"అవును, అది శిక్షించబడాలి," అని ఇతర జంతువులు అన్ని ముక్తకంఠంతో అన్నాయి. 

ఇంకేముంది "రండి! ఆ నీలి మందు నక్కకి గుణపాఠం చెబుదాం." అని అన్ని జంతువులూ కలిసి నీలిమందు నక్కను తీవ్రంగా కొట్టాయి.


అందుకే అన్నారు పెద్దలు, "సహజ ప్రవ్రుత్తి ఎంత దాచిన దాగదు." అని. 

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

No comments:

Post a Comment

Recent posts

The Big Fat Cat And The Mice: A Great Idea

The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...

Popular posts