Patience Or Greedy: The Story of a Black Cat
Telugu Stories
ఆలస్యం, అమృతం, విషం
ఒక ఊరిలో రాంబిల్లి అనే ఒక నల్ల మచ్చల పిల్లి ఉండేది. అది ఒకరోజు ఇల్లులూ తిరుగుతూ ఒక ఇంటిలోని చెట్టుపై ఒక గూడును కనుగొంది.
అప్పుడు అది ఆ చెట్టు పైకి ఎక్కి ఆ గూటిలోకి చూసింది. అప్పటికి ఆ గూటిలో ఏమీ లేదు, ఎందుకంటే అది ఇప్పుడే పూర్తయింది.
దానితో ఆ నల్ల మచ్చల పిల్లి రాంబిల్లి, "నేను ఆ గుటిలోకి ఏదైనా పక్షి వచ్చి చేరేవరకు వేచి ఉంటాను!"
ఆ గూటిలో ఏదైనా వచ్చి నివాసం ఉండేదాకా దాని చుట్టూ తిరగను, ఏదైనా తనని ఆ గూటి చుట్టూ తిరగటం చుస్తే అందులోకి వచ్చి ఏదీ ఉండదు అని అనుకున్నది.
ఆ నల్ల మచ్చల పిల్లి ఎంతో సహనం కలది. దాని ఓపిక గురించి తలుచుకుని అదే ఎంతో మురిసిపోతోంది.
ఇంతలో ఒక నెల గడిచింది. ఆ నల్ల మచ్చల పిల్లి దూరం నుంచి గూటిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నది.
ఆ గూటిలోకి ఒక పక్షి వచ్చి గుడ్లు పెట్టింది. ఆ పక్షి అక్కడ లేనప్పుడు ఈ నల్ల మచ్చల పిల్లి చెట్టుపైకి పిల్లిలా నక్కి వెళ్ళింది.
ఆ గూటిలో 4 గుడ్లు ఉన్నాయి. అవి ఎంతో అందంగా, ముద్దుగా, మెరుస్తూ, నోరూరిస్తూ సువాసనతో ఉన్నాయి.
అప్పుడు నల్ల మచ్చల పిల్లి ఇలా అనుకున్నది, “గుడ్లు మంచివే, కానీ అవి కడుపు నిండవు. అవి చిన్న పక్షులుగా మారాక తింటే ఇంకా రుచిగా ఉంటాయి. నేను అప్పటిదాకా ఎదురుచూస్తా." అని అనుకున్నది.
సరే అని అప్పటిదాకా నోరూరిస్తున్నా వేచి ఉన్నది.
ఆ నల్ల మచ్చల పిల్లి వేచి ఉండగా, ఎలుకలు పట్టుకుంటూ, నిద్రపోతూ, సమయం గడుపుతూ, కాలం గడవడానికి చేయవలసినదంతా చేసింది.
మరో రోజు గడిచిన తర్వాత, ఆ నల్ల మచ్చల పిల్లి మళ్లీ చెట్టు ఎక్కి గూడులోకి చూసింది.
ఈసారి ఐదు గుడ్లు వచ్చాయి.
కానీ మచ్చల పిల్లి మళ్ళీ తనకు తాను ఇలా చెప్పుకుంది, “ఓహో! అమోఘం, ఒక రోజు వేచి ఉంటే ఇంకొక గుడ్డు పెరిగింది, ఇంకా వేచి ఉంటే ఇంకొన్ని గుడ్లు పెరగొచ్చు, అవి చిన్న పక్షులుగా మారతాయి, అవి తినటానికి ఎంతో రుచిగా ఉంటాయి. అని అనుకొంది.
నేను మరికొంత కాలం వేచి ఉంటాను! అని అనుకున్నది.
అలాగే కొంత కాలం వేచి చూసి మళ్ళీ గూటి దగ్గరికి వెళ్ళింది.
"ఆహ! అక్కడ ఐదు చిన్న పక్షులు ఉన్నాయి, పెద్ద కళ్ళు మరియు పొడవైన మెడలు, మరియు పసుపు ముక్కులతో ఏంతో అందంగా, రుచికరమైన వాసనతో ఉన్నాయి." అని అనుకున్నది.
అప్పుడుఆ నల్ల మచ్చల పిల్లి కొమ్మ మీద కూర్చొని, చాలా సంతోషంగా ఉన్నందున అది తన ముక్కును నాలికతో నాక్కుని అందంగా "ఓపికగా ఉండటం విలువైనదే!" అని అనుకున్నది.
కానీ ఆ చిన్న పక్షులను ఆ నల్ల పిల్లి మళ్లీ చూసినప్పుడు, అది మొదట దేన్నీ తినాలో ఎంచుకోవడానికి చూడగా, అవి అన్నీ చాలా సన్నగా, పీలగా ఉన్నాయని దానికి అనిపించింది.
అప్పుడు అది "ఓహో!! ఇవి ఇంకా చాలా, చాలా సన్నగా, చిన్నగా ఉన్నాయి! నా జీవితంలో ఇంత సన్నగా ఏమీ చూడలేదు." అని అనుకుంది.
"ఇప్పుడు," అది తనలో తాను ఇలా చెప్పుకుంది, "నేను మరికొన్ని రోజులు వేచి ఉంటే, అవి లావుగా పెరుగుతాయి.
సన్నని పక్షులు బాగానే ఉంటాయి, కానీ లావుగా బలిసిన పక్షులు ఇంకా చాలా బాగుంటాయి. నేను అప్పటిదాకా ఎదురుచూస్తా!" అని అనుకుంది.
కాబట్టి ఆ నల్ల పిల్లి రాంబిల్లి అలాగే ఎంతో సహనంతో వేచి ఉంది.
ఆ నల్ల పిల్లి, పిల్ల పక్షులకి రోజంతా పురుగులను గూడుకు తీసుకువస్తున్న తండ్రి-పక్షిని చూసి, “ఆహా! అవి వేగంగా లావుగా అవుతూ ఉండి ఉండాలి!
అవి ఎంతో త్వరలో నేను కోరుకున్నంత లావు అవుతాయి.
ఆహా! ఓపికగా ఉండటం ఎంత మంచి విషయం." అని అనుకుంది.
చివరికి, ఒక రోజు ఆ నల్లా పిల్లి ఇలా అనుకుంది, “ఖచ్చితంగా, ఆ పక్షిపిల్లలు ఇప్పుడు తగినంత లావుగా అయ్యి ఉండాలి!
ఇంక ఒక్క రోజు కూడా ఆగను.
ఆహా! అవి ఎంత మంచిరుచిగా ఉంటాయో! ఆహా! ఓహో! అవి ఇక నావే.
వివాహ భోజనంబు విందైన వంటకంబు!" అని అనుకుంటూ చెట్టు పైకి ఎక్కి గూటి దగ్గరికి వెళ్ళింది.
కానీ ఆ నల్ల పిల్లి పైకి చేరుకుని గూడులోకి చూసే సరికి ఆ గూడు ఖాళీగా ఉంది!! అక్కడ పక్షిపిల్లలూ లేవు, గుడ్లూ లేవు.
అప్పుడు ఆ నల్ల మచ్చల పిల్లి కొమ్మ మీద కూర్చొని ఇలా అనుకుంది, "ఆలస్యం, అమృతం, విషం." అని.
కాకపోతే అది పిల్లి కదా అందుకని అది" మియాం!! మియాం!! మియాం!!" అని అన్నది.
అందుకే అన్నారు పెద్దలు, "ఆలస్యం, అమృతం, విషం." అని.