An Intelligent Fox: The Fox and The Lion
Telugu Stories
తెలివైన నక్క
ఒక అడవిలో ఒక సింహం నివసించేది. అతను పెద్దవాడయ్యాడు. వయస్సు మీద పడటంతో వేగంగా పరిగెత్తలేకపోయేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి వేటాడటం కష్టతరంగా మారింది.
ఒకరోజు అతను ఆహారం కోసం అడవిలో తిరుగుతుండగా, అతనికి ఒక గుహ కనిపించింది. అతను గుహలోపలికి పరీక్షగా చూస్తూ గుహలోని వాసన చూశాడు.
గుహలో ఎదో జంతువు నివసిస్తున్న వాసన వచ్చింది. అప్పుడు సింహం కొన్ని జంతువులు ఇక్కడ ఉండి ఉండాలి," అతను తనలో తాను అనుకున్నాడు. అతను గుహ ఖాళీగా ఉన్నందున లోపలికి చొచ్చుకుపోయాడు.
"నేను లోపల దాక్కుని జంతువు తిరిగి వచ్చే వరకు వేచి ఉంటాను," అని అనుకున్నాడు.
ఆ గుహ ఒక నక్క యొక్క నివాసం. ప్రతిరోజూ, నక్క ఆహారం కోసం బయటకు వెళ్లి సాయంత్రం విశ్రాంతి తీసుకోవడానికి గుహకు తిరిగి వచ్చేది. ఆ సాయంత్రం, నక్క భోజనం చేసి గుహ వైపు బయలుదేరింది.
కానీ గుహ దగ్గరికి వచ్చేసరికి ఏదో తేడాగా అనిపించింది.
అతని చుట్టూ అడవి అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. పక్షులు శబ్దం చెయ్యట్లేదు, జంతువుల అరుపులు వినిపించటం లేదు.
"ఏదో తేడాగా ఉంది," అని నక్క తనలో తాను అనుకుంది.
"అన్ని పక్షులూ, కీటకాలు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాయి?"అని అనుకున్నది.
చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా, నక్క తన గుహ వైపు నడిచింది. నక్క తన చుట్టూ చూసి, ఏదైనా ప్రమాద సంకేతాలు ఉన్నాయా! అని చూస్తున్నాడు.
అతను గుహ ముఖద్వారం దగ్గరికి వచ్చేసరికి, అక్కడ అంతా అతనికి ప్రమాద హెచ్చరికలు కనిపించాయి.
దానితో నక్క గుహ దగ్గర,లోపల అంతా బాగానే ఉందని నేను నిర్ధారించుకోవాలి," అనుకుంది.
దాని కోసం నక్క ఒక అద్భుతమైన ప్రణాళికను ఆలోచించాడు.
తెలివైన నక్క గుహ బయట నిలబడి గుహలోకి పిలిచింది, "ఓ! నా మంచి గుహా, ఈ రోజు నీకు ఏమి జరిగింది? నీవు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు?"
నక్క స్వరం గుహ లోపల పెద్దగా ప్రతిధ్వనించింది. అప్పటికి తన ఆకలిని అదుపు చేసుకోలేని సింహం, "నేను ఇక్కడ ఉన్నందున గుహ నిశ్శబ్దంగా ఉందేమో!! ఏదో తప్పు జరిగిందని నక్క గ్రహించేలోపు, నేను ఏదో ఒకటి చేయాలి." అని అనుకుంది.
నక్క "ఓ గుహా మన ఒప్పందం మరచిపోయావా? నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నీవు నన్ను పలకరించవలసి ఉంటుంది కదా!" అని పలకరించింది.
సింహం తన కంఠస్వరంతో నక్కని బోల్తా కొట్టడానికి ప్రయత్నించి, గుహలోంచి "ఓ! నక్క మిత్రమా నీకు స్వగతం!" అని పిలిచింది.
ఇంకేముంది సింహం గర్జన విని పక్షులు కిలకిలరావాలు చేస్తూ ఎగిరిపోయాయి.
నక్క విషయానికొస్తే, అతను భయంతో వణుకుతూ, ఆకలితో ఉన్న సింహం అతనిపై దూకి చంపి తింటుఅందని అర్థమై, అతనిని తినడానికి ముందే, నక్క తన కాళ్లు ఎంత వేగంగా పరిగెత్తగలదో అంత వేగంగా తన ప్రాణం కోసం పరిగెత్తింది.
సింహం నక్క గుహలోకి ప్రవేశిస్తుందేమోనని చాలా సేపు ఎదురుచూసింది. కానీ నక్క తిరిగి రాకపోవడంతో, సింహం తాను ఆ తెలివైన నక్క దగ్గర మోసపోయిందని గ్రహించింది.
ఏంతో కెహెక్కటి ఆహారాన్ని కోల్పోయిందని తన మూర్ఖత్వానికి తనను తాను తిట్టుకుంటూ, బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
అందుకే అన్నారు పెద్దలు, "తెలివి ఉంటే, తెడ్డు లేకుండా కూడా ఏరు దాటొచ్చని."