Monday, May 24, 2021

Wonderful Telugu Stories To Read

Grandmas Stories presents you telugu stories

Wonderful Telugu Stories To Read

తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories
అనగనగా ఒక కీకారణ్యం అనే అడవి ఉండేది. ఆ అడవిలో ఒక గాడిద ఉండేది. ఆ గాడిద చాలా విచారంగా నిలబడి ఉంది. 

అటుగా వెళుతున్న ఒక తోడేలు ఆ నిలుచున్న గాడిద దగ్గరికి వెళ్లి "ఏమిటి అలా ఉన్నావు?" అని అడిగింది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

 అప్పుడు ఆ గాడిద, తోడేలుతో ఇలా అంది "నాకు స్నేహితులెవరు లేరు. అందువలన నేను ఎప్పుడూ ఒక్కదాన్నే కూర్చుని ఇలా విచారంగా ఉంటున్నాను."

అది విన్న ఆ తోడేలు "అయ్యో! అలా అయితే ఇకనుంచి నేను నీ స్నేహితుడిగా ఉంటాను." అని అంది.
అప్పటినుంచి ఆ తోడేలు, గాడిద కలిసి మెలిసి ఆ అడవంతా తిరుగుతూ ఆనందంగా ఉండసాగారు.

ఆలా తిరుగుతూ తిరుగుతూ ఒక రోజు ఆ అడవి చివర ఉన్న గ్రామానికి చేరుకున్నారు. అక్కడ బాగా పండి మంచి వాసన వస్తున్న పండ్ల తోటలు కనిపించాయి. వెంటనే వాటికి ఆ పండ్ల తోటలోకి వెళ్లి ఆ పండ్లు తినాలనిపించింది. ఆ గాడిద, తోడేలు మెల్లగా ఆ తోటలోకి వెళ్లి కావలసినన్ని పళ్ళు తృప్తిగా తిన్నాయి.

ఆ గాడిద, తోడేలు తృప్తిగా తిని చెట్టు నీడలో చల్లటి గాలికి విశ్రాంతి తీసుకుంటున్నాయి . అప్పుడు గాడిద "ఆహా! మిత్రమా! మంచిగా తిన్నాం, చెట్టునీడలో విశ్రాంతి తీసుకుంటున్నాం, ఇంక ఒకే ఒక్కటి చేయాలని ఉంది." అని అంది.

దానికి ఆ తోడేలు నీకు ఇంకేమి కావాలి మిత్రమా అంది.
అప్పుడు ఆ గాడిద "నాకు మంచి పాట పాడాలని ఉంది! వింటావా మిత్రమా!" అని అంది.

గాడిద మాటలు విని ఉలిక్కిపడిన తోడేలు "నీవు పాటలు పాడతావా? అయినాకానీ ఇది పాటలు పాడటానికి సరైన ప్రదేశమూ కాదు, సమయమూ కాదు. నీ పాట విని ఈ తోట కాపరి వస్తే ఇంకేమైనా ఉందా, పట్టుకుని తంతాడు." అని అంది.

కానీ గాడిద ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. తోడేలు మాట కూడా పూర్తవకుండానే ఆ తెలివితక్కువ గాడిద ఓండ్రపెడుతూ పాడటం ప్రారంభించింది.

stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories

అది పాటందుకోగానే తెలివైన తోడేలు ఒక చెట్టు చాటుగా వెళ్లి వింటోంది.
ఇంకేముంది గాడిద పెద్ద, పెద్ద అరుపులకి మెలుకువ వచ్చిన తోట కాపలావాడు పరిగెత్తుకుంటూ వచ్చి దుడ్డు కర్రతో ఆ పాట పాడుతున్న గాడిదని బాగా కొట్టి వెళ్ళాడు.

ఆ తోట కాపలావాడు వెళ్లిన తరువాత కొంత సేపటికి ఇదంతా చెట్టు చాటుగా ఉండి చూస్తున్న తోడేలు తన స్నేహితుడిని అక్కడి నుండి తీసుకువెళ్ళటానికి వచ్చింది.

అప్పుడు ఆ తోడేలు ఆ గాడిదతో "మిత్రమా!! నా సలహా వినకుండా ఎంత పని చేశావు. నీ మంచి కోరి నేను చెప్తే వినలేదు నీకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం చేసుకున్నావు." అని అంది.

నిదానంగా తన మిత్రుడైన గాడిదని అడవిలోకి తీసుకుపోయింది.

అందుకే అన్నారు పెద్దలు "తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం."

అంటే ఎవరైనా తాను చేయలేని పని చేసి దానివలన వారికి చెడు జరిగితే ఆ సందర్భంలో ఈ సామెత ఉపయోగిస్తారు.

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀

No comments:

Post a Comment

Recent posts

The Big Fat Cat And The Mice: A Great Idea

The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...

Popular posts