Grandmas Stories presents you Telugu Stories
అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు
ఒక ఊరిలో కాంతమ్మ అనిత అనే అత్త కోడళ్ళు ఉండేవారు. వారిద్దరికి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు అంటే ఉప్పు నిప్పు లాగ ఉండేవారు. (ఉప్పు నిప్పు అనెేది ఇంకొక వాడుక పదం అంటే ఎవరి మధ్య ఐన సఖ్యత లెేనప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు). ఇలా ఉండగా ఒక రోజు అత్త కాంతమ్మ ఆమెకు ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూర బాగా మసాలా దట్టించి వండుకుంది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి కాంతమ్మ వంటంటే ఆమె భర్త కొడుకు ఇద్దరు ఎంతో ఇష్టంగా తింటారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చుూస్తున్న భోజనాల వేళ అయ్యింది, కాంతమ్మ ఉత్సాహంగా భర్త, కొడుకు, కోడలికి భోజనం వడ్డించసాగింది. అత్త కూర ఏమి వండిందా అని కంచంలో చూసిన అనితకి తనకి ఏ మాత్రం ఇష్టం లేని గుత్తి వంకాయ కూర చూసి కోపం నషాళానికి అంటింది. ఇంకేముంది అత్తా కోడళ్ళ మధ్య రామ రావణ యుద్ధం మొదలైంది.
కోపంతో అనిత అత్త చేతిలోని దుత్త (అంటే కుండ) తీసుకుని నేలకేసి కొట్టింది. అంతే ఇంకేముంది కుండ పగిలి కూర నేల పాలయ్యింది. అత్త మీద చూపించలేని కోపాన్ని కోడలు దుత్త మీద చూపించింది.
అందుకే అన్నారు పెద్దలు "అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు" అని.
press the proverb link that takes to you a video of this story in youtube
ఈ సామెత కథ మీ అందరు చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.
ఈ సామెత కథ మీ అందరు చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.
we provided an audio clip to listen to this telugu story.
we try to post as many telugu stories as we can
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀
I really liked your story grandmaaaa
ReplyDeleteGrandma stories thank you for posting telugu stories and keep posting more and more telugu saamethalu and telugu padyaalu
ReplyDeletegreat site grandma stories
ReplyDelete