Grandmas stories presents you telugu stories
అనగనగా ఒక అడవిలో ఒక బద్ధకం నక్క ఉండేది. అది సింహం తినగా మిగిలిన ఆహారం తింటూ బ్రతికేది. ఒకరోజు ఎంత వెతికినా అడవిలో ఎక్కడా ఆహారం దొరకలేదు. వెతుకుతూ వెతుకుతూ ఆ నక్క అడవి చివరనున్న గ్రామం దగ్గరికి వచ్చింది. అక్కడ బాగా విరగకాసిన ద్రాక్ష తోట ఆ నక్క కంటపడింది.
ఇంకేముంది అసలే ఆహారం కోసం వెతుకుతున్న ఆ నక్కకి ఆ చక్కటి ద్రాక్ష పళ్ళు చూసి నోరూరసాగింది. వాటిని చూడగానే ఆకలి మరింత పెరిగిన ఆ నక్క ద్రాక్ష పళ్ళని ఎగిరి అందుకోవటానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా ఆ నక్కకి ఎత్తుగా తీగ మీద ఉన్న ఆ ద్రాక్ష పళ్ళు అందలేదు. ఎగిరి ఎగిరి అలసిపోయిన ఆ నక్క నిరాసతో అడవిలోకి వెనుతిరిగింది. ఆకలి తీరని ఆ నక్క "అందని ద్రాక్ష పుల్లన" అనుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది.
అందుకే అన్నారు పెద్దలు "అందని ద్రాక్ష పుల్లన" అని
ఒక పని ఎంత ప్రయత్నించినా జరగనప్పుడు ఈ సామెతని ఉపయోగిస్తారు.
ఈ సామెత కథ మీ అందరు చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.
we provided a video clip to listen to this telugu story.
we try to post as many telugu stories as we can
Read, listen and enjoy from Grandmas Stories 😀👍

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀