Sunday, June 11, 2023

Telugu Stories The Greatness Of Karna

  కర్ణుడి ఔన్నత్యం

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,

మహాభారతంలో పాండవులు కౌరవులు కురుక్షేత్రంలో యుద్ధం చేయటం మొదలుపెట్టారు. పదిహేడో రోజు యుద్ధంలో కర్ణుడు నేలకొరిగిన తరువాత, పాండవులు, కౌరవులు వాళ్ళ వాళ్ళ శిబిరానికి చేరుకున్నారు. 

అప్పుడు అర్జునుడు కర్ణుడి గురించి చాల తేలికైన పదాలతో కర్ణుణ్ణి నిందిస్తూ, చులకనగా మాట్లాడటం మొదలుపెట్టాడు. 

అన్ని వాస్తవాలు తెలిసిన మహానుభావుడు శ్రీ కృష్ణుడు. అర్జునుడు కర్ణుణ్ణి నిందించటం శ్రీ కృష్ణుడు అది వినలేక అర్జునుడితో ఇలా అన్నాడు. 

Telugu stories, telugu neeti kathalu, grandma stories, stories for kids, moral stories telugu, telugu kathalu, must read telugu stories, telugu proverbs, telugu samethalu,


"అర్జున!! కర్ణుణ్ణి ఆలా తేలిక చేసి మాట్లాడవద్దు. కర్ణుడు ఎంత గొప్పవాడో నా వేనుకాలేరా నీకు అర్థమౌతుంది." అని శ్రీ కృష్ణుడు అర్జునుడిని యుద్ధ రంగానికి తిరిగి తీసుకువెళ్లాడు. 

శ్రీ కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు, కర్ణుడు పడిపోయిన సమీపానికి వచ్చిన తరువాత శ్రీ కృష్ణుడు అర్జునుడిని కర్ణుడి దగ్గర జరగబోయేది అక్కడ నుంచే గమనించమన్నాడు. 

అప్పుడు శ్రీ కృష్ణుడు కర్ణుని వద్దకు చేరుకున్నాడు, కర్ణుడు మరణానికి అతి సమీపంలో ఉన్నాడు. 

శ్రీ కృష్ణుడు కర్ణుణ్ణి "దేహి!, దేహి!" అని అడిగాడు. 
కర్ణుడు తాను మరణానికి సమీపంలో ఉన్నానని తన దగ్గర ఏమి లేదని చెప్పాడు. 

బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీ కృష్ణుడు "అదేమిటి కర్ణ! నీ దగ్గర ఏమీ లేదంటావేంటి నీ పలువరసలో బంగారు పన్ను ఉంది కదా అది ఇవ్వు చాలు నేను తృప్తి పడతాను" అని అన్నాడు. 

మరణానికి అత్యంత సమీపంలో ఎంతో బాధతో ఉన్న కర్ణుడు బ్రాహ్మణుని మాటకు ఎంతో సంతోషించాడు. అప్పుడు కర్ణుడు ఒక పలుగు రాయిని  తీసుకుని, ఆ రాయితో తన బంగారు పన్నుని పగలగొట్టుకుని బ్రాహ్మణుని చేతిలో పెట్టాడు. 

శ్రీ కృష్ణుడు "శాశ్వత యశస్వీభవ" అని ఆశీర్వదించాడు. 
కర్ణుని ఆత్మ శ్రీ కృష్ణుడిలో ఐక్యమయ్యింది. 

అప్పుడు శ్రీ కృష్ణుడు అర్జునుడి దగ్గరికి వచ్చి అక్కడ జారినదంతా గమనించావా అర్జునా అని అడిగాడు. 
అర్జునుడు సిగ్గుపడ్డాడు. 

Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉

Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀


Recent posts

The Big Fat Cat And The Mice: A Great Idea

The Big Fat Cat And The Mice: A Great Idea Telugu Stories ఎవరు పిల్లికి గంట కడతారు? రామాపురంలో రామారావు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ఒక కి...

Popular posts